జర్మనీలో ఒక రెస్టారెంట్లోని పాల్ అనే ఒక ఆక్టోపస్ జర్మనీ ఆడే ప్రపంచ కప్ ఫుట్ బాల్ మ్యాచ్ లలో ఎవరు గెలుస్తారు అన్న దానిని ఇప్పటివరకూ కరెక్టుగా చెబుతూ వచ్చింది.నిన్న సెమీ ఫైనల్లో స్పెయిన్ చేతిలో జర్మనీ ఓడిపోతుందని కూడా సరిగ్గానే చెప్పింది.అయితే దీనితో ఆ రెస్టారెంటు యజమానికి చిర్రెత్తుకొచ్చి అదే జరిగితే పాల్ ని కోసి కూర వండేస్తానని చెప్పాడు.పాపం దాని ఖర్మ కాలి జర్మనీ ఓడిపోయింది.ఇప్పుడు దాని భవిష్యత్తు ఏమౌతుందో?



అయినా జర్మనీ ఓటమికి ఆక్టోపస్సుని నిందిస్తే ఎలా?ఆ మ్యాచ్ లో వాళ్ళ ఆట అలా తగలడింది.మొదటి అరగంటలో బంతిని తమ అధీనంలో ఉంచుకోవడానికే వాళ్ళు నానా తంటాలు పడాల్సి వచ్చింది.అర్జెంటీనాని చిత్తు చేసింది వీళ్ళేనా అని అందరీ ఆశ్చర్య పోయేంత చెత్తగా ఆడారు వాళ్ళు.



అయినా భవిష్యత్తు చెప్పేటప్పుడు అంతా తియ్యగా చెప్పాలని ఆ ఆక్టోపస్సుకి తెలీదులాగుంది.ఉగాదినాడు మన రాజకీయనాయకుల దగ్గర పంచాగ శ్రవణం చేసే పంతుళ్ళనడిగి తెలుసుకొని ఉండాల్సింది ఆ జీవి పాపం!
1 comment:
ఉగాదినాడు మన రాజకీయనాయకుల దగ్గర పంచాగ శ్రవణం చేసే పంతుళ్ళనడిగి తెలుసుకొని ఉండాల్సింది బాగా చెప్పారు.
Post a Comment