నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Friday, July 9, 2010

ఇదేం ఓదార్పు జగన్ బాబూ?

ఓదార్పు యాత్ర గురించి జగన్ గానీ అతడి శిబిరం గానీ చెప్పే మాటలు రెండు ఉన్నాయి.ఒకటి హిందూ సాంప్రదాయం ప్రకారం ఎవరైనా చనిపోతే వారి ఇళ్ళకు వెళ్ళి పలకరించడం ఆనవాయితీ అని.

పలకరించడం సాంప్రదాయమే గానీ అందుకు ఒకరో ఇద్దరొ వెళ్ళి పలకరిస్తారు గానీ ఇలా పెద్ద మందని వెంటేసుకొని,గుంపులు గుంపులుగా వెళ్ళి టీవీ కెమెరాలు మీడియా వాళ్ళు చుట్టూ చేరి ఉంటే ఒక సర్కస్ లాగా ఆ పని చేయరు కదా?
రెండవది, జగన్ చాలా ఎమోషనైపోయి చెప్పినది ఏమంటే "వాళ్ళ కన్నీళ్ళు నేను తుడవాలి,నా కన్నీళ్ళు వాళ్ళు తుడవాలి" అని.

కన్నీళ్ళు తుడవాలి నిజమే, కానీ ఎప్పుడు?చనిపోయిన పది నెలల తరువాతనా?వైఎస్ మరణం తట్టుకోలేకనో, సహజం గానో ఆ మరణినిచిన వాళ్ళలో అత్యధికులు మధ్య, దిగువ తరగతి వాళ్ళే.అలాంటి కుటుంబాలలో చనిపోయిన వాళ్ళని తలుచుకొంటూ నెలల తరబడి గడిపితే బతుకు బండి నడవదు.కాబట్టి విషాదాన్ని దిగమింగి జీవనం సాగిస్తూ ఉంటారు వాళ్ళందరూ.ఇప్పుడు నువ్వు వెళ్ళి తుడవడానికి వాళ్ళ దగ్గర కన్నీళ్ళేమీ మిగిలి ఉండవు బాబూ.

ఇక నీ కన్నీళ్ళు తుడవడం గురించి చెప్పుకోవాలంటే,ఆ మొదట్లో ఒకటి రెండు రోజులు తప్ప నువ్వు రాజకీయ ఎత్తుగడల్లో మునుగిపోయి ఉన్నావు కానీ కన్నీళ్ళు కారుస్తూ ఉన్నట్టు ఎవరికీ కనిపించలెదు కదా?

అంచేత ఇప్పుడు ఇంత యాగీ చేసి ఈ ఓదార్పు యాత్ర చేయడం వెనక అసలు పరమార్ధమేమిటో కాస్తా వివరిస్తే బావుంటుంది కదా జగన్మోహనా?

6 comments:

హరి దోర్నాల said...

ఇవన్నీ పైకి చెప్పే మాటలే. అసలు పరమార్థం ముఖ్య మంత్రి సీటు. సోనియాకి రాష్ట్రంలో తనకున్న బలాన్ని నిరూపించుకోవడం. రాష్ట్ర రాజకీయాలపై పట్టు కోల్పోకుండా చూసుకోవడం.

ఇతనికి తన తండ్రి మరణంపై ఎంత దుఃఖం ఉందో శవ యాత్ర లోనే తెలిసింది. ఇక ఇప్పుడు కన్నీళ్లు తుడిపించుకోవడం ఏమిటీ?

http://supportloksatta.blogspot.com/2010/04/blog-post.html

సౌమ్య said...

యువభారతానికి నాంది పలుకుతున్నారు....రాహుల గాంధీ ప్రధానమంత్రి, జగన్ ముఖ్యమంత్రి....వారెవ్వా ఏమి దేశం, తండ్రులు చనిపోతే పదవి ప్రాప్తం.

చెప్పు దెబ్బలు-పూలదండలు said...

కొంత కాలం పోతే తండ్రులు సకాలంలో చనిపోకపోతే తండ్రుల్ని చంపి పదవి దక్కించుకొనే నేతల కాలం వస్తుందేమో?!

Kavanoor Dayalan said...

అక్రమంగా సంపాదించిన డబ్బులు కాపాడుకోవాలంటే మరి బల ప్రదర్శన అవసరం.

Anonymous said...

తండ్రులు సకాలంలో చనిపోకపోతే తండ్రుల్ని చంపి పదవి దక్కించుకొనే నేతల కాలం వస్తుందేమో

Already we are in that. Aurangajeb almost did the same to Shajahan.

jagan di O 'balavantapu Odaarpu pathakam' :P

Anonymous said...

"హిందూ సాంప్రదాయం ప్రకారం ఎవరైనా చనిపోతే వారి ఇళ్ళకు వెళ్ళి పలకరించడం ఆనవాయితీ"

వీడు క్రిస్టియన్ కదా నలుగురు పాస్టర్లను పిలిచి మీటింగ్ పెడితె సరిపొయెది

ఇక కన్నీళ్ళు అంటరా వైస్సార్ ని ఎప్పుడొ మర్చిపొయారు జనం, అదె అసలు బాధ యివరాజావారిది