నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Thursday, July 15, 2010

గాంధీ బతికుంటే ఎన్ కౌంటరైపోయుండేవాడు

మహాత్మా గాంధీ ఈనాడు బతికి ఉంటే సెజ్ ల పేరిట అభివృద్ధి పేరిట అమాయకులను నిర్వాసితులని చేయడం, సారవంతమైన భూమిని రైతుల దగ్గర లాక్కొని బడా కంపెనీలకి అప్పగించడం చుస్తూ ఊరికే ఉండే వాడా? ఒంట్లో ఓపిక లేకపోయినా ఏదో విధంగా లేచి ముందుండి ప్రజల ఆందోళనకి నాయకత్వం వహించే వాడు కదా?అయితే నాటి ఆంగ్లేయ ప్రభుత్వం లాగా మన ప్రభుత్వం ఆ ముసలాయన చేసే అహింసాయుత పోరాటానికి భయపడుతుందా?
ఓ వెయ్యో, రెండు వేలో ధృడ సంకల్పం తప్ప మరొక ఆయుధం లేని జనాన్ని వెంటేసుకొని పిడికెడు ఉప్పు చేతిలోకి తీసుకోగానే ఆ ముసలాయన్ని చూసి నాటి రవి అస్తమించని ఆంగ్లేయ ప్రభుత్వం వణికిపోయింది. ఆయన నిరాహార దీక్శ చేసిన ప్రతి సారీ నాటి ప్రభుత్వం దిగి వచ్చింది.
అదే అహింస, సత్యాగ్రహం ఆయుధాలుగా ఆయన ఈనాడు పోరాటం చేస్తే ఏమౌతుంది?

ఒకానొక రాత్రి పోలీసులు ఆయన ఆశ్రమం పైన దాడి చేసి ఆయన్ని, ఆయన అనుచరులను గుట్టు చప్పుడు కాకుండా జీపుల్లో తీసుకెళ్ళి ఏ అడవిలోనో కాల్చిపారేసి, చేతిలో తుపాకులూ, పక్కన విప్లవ సాహిత్యమూ పెట్టి, పోలీసుల పైకి ముందు వాళ్ళే కాల్పులు జరిపారనీ, ఎదురు కాల్పుల్లో మరణించారనీ ఒక కథ చెప్పేవాళ్ళు.
ఏదో ఆంగ్లేయులు కాబట్టీ, వాళ్ళకీ ఇన్ని విద్యలు అప్పట్లో తెలియవు కాబట్టీ పెద్దాయన చేతి కర్రతో దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చాడు. అదే మన పాలకులైతేనా........

4 comments:

gajula said...

southafricalo gandhi talent chusi indiaku teesukocchinde britishvaaru.aayanni etla encounter chestaru?alluri seetharamarajunu chesaru kada.ika ippati prabutvaalu emi cheyagalavo chustune vunnamu kada.gajula

చెప్పు దెబ్బలు-పూలదండలు said...

Agree with you Gajula.I am not a big fan of Gandhi,though.My point is the present government is worse than the British one.

Anonymous said...

I do agree.please read my new post here.
http://jahnavi-aalochanalu.blogspot.com/2010/07/idee-anthe.html

కెక్యూబ్ said...

చాలా బాగా చెప్పారు. సెజ్ లు నయా సామంత రాజ్యాలుగా రూపొందబోతున్నాయి, అక్కడ మన చట్టాలు అమలుకావు. అలాంటి అధికారాలతో రూపుదిద్దుకోబోతున్న సెజ్ ల వలన ఎవరికి లాభం? ఈ దేశాన్ని కార్పొరేట్ సంస్థలకు అమ్మజూపుతున్న నేటి పాలకుల మెడలు వంచాలంటే గోవాలోను, నందిగ్రాం, సింగూర్, సోంపేటలలో జరిగిన, జరుగుతున్న పోరాటాలను ఆదర్శంగా తీసుకొని ప్రజలు చైతన్యం కావాలి. ఇది ఏ ఒక్క వర్గం సమస్యో కాదు. మీకు ధన్యవాదాలు.