ఈ మధ్య పాత పుస్తకాలు సర్దుతూ ఉంటే విజయ మాస పత్రిక ప్రతులు కనిపించాయి. ఎనభయ్యవ దశకం దాకా వచ్చిన విజయ మాస పత్రిక గురించి ఈ పోస్టు.
విజయ బాపినీడు గారి సంపాదకత్వంలో అప్పటి మద్రాసు నుంచి వెలువడేది ఈ పత్రిక. కొన్నప్పుడు ఒకే పత్రిక లాగా ఉన్నా అందులో అయిదు భాగాలు ఉండేవి. ఒక దానిలో కథలు, మరొక దానిలో అనుభంద నవల ఉండేవి. ఈ రెండింటికి మధ్యలో ఒక దానిలో జోకులూ, కార్టూనులూ, ఒక దానిలో సినిమాల రివ్యూలు, మరొక దానిలో సీరియల్ ఉండేవి.
ప్రత్యేకంగా చెప్పుకోవలసింది గౌరీ శంకర్ గారు రాసిన సినిమా రివ్యూల గురించి. కేవలం సినిమాలోని కథ చెప్పి వదిలేయకుండా సినిమా బాగోగులని కూలంకషంగా చర్చించేవాడాయన.ప్రతి సినిమాకి ఒక రేటింగ్ ఇచ్చి దాని గురించి కథ, సంగీతం,సాహిత్యం ఇత్యాదులు క్షుణ్ణంగా రాసేవాడు. ఆ రివ్యూ చదివి సినిమా చూడొచ్చో లేదో తేల్చుకో వచ్చు.
ఇక హాస్యపత్రికలో నాణ్యమైన జోకులూ కార్టూనులూ వచ్చేవి. జయదేవ్ గారి కార్టునులూ మంచి హాస్యాన్ని పంచేవి. ఇక సీరియల్ విషయానికొస్తే ప్రతి నెలా ఒక చిన్న బుక్ లెట్ లాగా ఒక భాగం ప్రచురించే వారు. వాటన్నిటినీ దాచి చివరిలో బైండ్ చేయించుకొంటే ఒక మంచి నవలగా అయ్యేది. ముదిగొండ శివప్రసాద్ గారి శ్రీలేఖ, యండమూరిగారి ఒక రాధ ఇద్దరు కృష్ణులూ అందులో వచ్చినవే.
ఇక చివరిలో ఎనభై, తొంభై పేజీల నవల ఉండేది. ఒక సారి నవలల పోటీలో వసుంధర గారి ప్రధమ బహుమతీ పొందిన ఆ వీధిలో రాక్షసుడు నవల నాకిప్పటికీ గుర్తే.
తరువాత క్రమంగా విజయ రావడం ఆగిపోయింది. తెలుగింటి ఆడవాళ్ళు చదవడం మానేసి, టీవీలకి అతుక్కుపోవడం వల్లే ఇది జరిగిందని నా భావన.
1 comment:
Please include a few photos of the cover pages of that good magazine.
Post a Comment