నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Monday, August 30, 2010

రాక్షసుడు ఓబుల రెడ్డి చరిత్ర ఇంతకన్నా అందంగా చూపడం ఎలా సాధ్యం?

రామ్ గోపాల్ వర్మ తీస్తున్న రక్త చరిత్ర సినిమా మొదటినుండీ వివాదాస్పదమే. ఆయనకి కావలసింది కూడా ఇదే. ఆయన స్వయంగా వెళ్ళి పరిటాల, సూరి వర్గీయులని,కుటుంబీకులని కలవడం మొదలుకొని ఈ సినిమా వార్తల్లో నిలిస్తూంది. ఇందులో ఎవరిని హీరోగా ఎవరిని విలన్ గా చూపిస్తారో అని అందరూ ఆసక్తితో చూస్తుంటే, నా సినిమాలో హీరోలు,విలన్లూ లేరు. పరిస్థితుల చేతిలో బందీలైన వాళ్ళ గాధ ఈ సినిమా అని వర్మ చెప్పుకొచ్చాడు.
సినిమా తాలూకూ స్టిల్స్ బయటకు రాగానే ఒక గుండు సీన్ మొదట సంచలనం రేపింది. అందులో పరిటాల పాత్రధారి ఒక వ్యక్తికి గుండు గీస్తుంటే చూస్తూ నించును ఉంటాడు. ఒక స్టల వివాదంలో పరిటాల వర్గీయులు చిరంజీవి తమ్ముడు, హీరో పవన్ కల్యాణ్ కి గుండు కొట్టించిన ఎపిసోడ్ అది అని చిరంజీవి అభిమానులు గోల చేశారు. సినిమా రిలీజయ్యేదాకా అగండి అని వర్మ చెప్పడంతొ అది సద్దు మణిగింది.

ఇప్పుడు ఒబుల్ రెడ్డి సోదరి, అతడి అనుచరులమని చెప్పుకొంటూ కొందరు సినిమాలో ఓబుల రెడ్డి పాత్రని చెడుగా చూపించారంటూ వర్మపైన కేసు పెడతామని, వర్మని చంపుతామని బెదిరించడంతో మరొక వివాదం మొదలయ్యింది.
రమణా రెడ్డి, ఓబుల్ రెడ్డి కుటుంబం, పరిటాల కుటుంబం మధ్య నెలకొన్న శత్రుత్వం ఈ సినిమా ప్రధానాంశం. రెండు కుటుంబాల మధ్య ఉన్న పగ, ప్రతీకారం హత్యలు, ప్రతి హత్యలు వెరసి అనంతపురం జిల్లా ఫాక్షన్ మొత్తం సినిమాలో ఉంటుంది.

అయితే ఓబుల్ రెడ్డి ఒక సగటు రాయల సీమ ఫాక్షనిస్టు కాదు. ఫాక్షనిస్టులు సాధారణంగా తమకి అడ్డు నిలిచిన వాళ్ళని, ప్రత్యర్ధులనీ చంపడం, కాంట్రాక్టులు చేసే వాళ్ళ దగ్గర డబ్బు వసూలు చేయడం, తరతరాలుగా వస్తున్నా హత్యలు, ప్రతిహత్యల అకౌంట్లు ఏవైనా బaలన్సు ఉంటే వాటిని పూర్తి చేయడం ఇలా ఉంటారు. అందుకే తెలుగు సినిమాలలో ఫాక్షనిస్టులు సూపర్ హిట్ హీరోలయ్యారు.

ఈ ఓబుల్ రెడ్డిది ఒక నీచ, నికృష్ట, హేయమైన చరిత్ర. ఇది రక్త చరిత్ర కాదు. కన్నూ మిన్నూ గానని కామ పిశాచ చరిత్ర. అందంగా, కంటికి నదురుగా ఏ ఆడది కనిపించినా ఎత్తుకు పోవడం, మాన భంగం చేయడం, కిరాతకంగా హింసించడం వీడి ప్రవృత్తి. వీళ్ళ ఇంటికి దగ్గరలో ఒక మహిళ కళాశాల ఉండేది. ఓబుల్ రెడ్డి కుటూంబంలో పెత్తనం మొదలు పెట్టాక ఆ కాలేజీలో విద్యార్ధుల సంఖ్య దారుణంగా పడిపోయి ఒకానొక దశలో కాలేజీ మూసివేసే దశకి చేరుకొంది. ఓబుల్ రెడ్డి ఇంటి ముందు నుంచి అమ్మాయిలను పంపడానికి వాళ్ళ తల్లి తండ్రులు ఎవరూ సాహసించలేదు.
ఒక ఇంజనీరు భార్యని వీడూ, వీడి మనుషులూ ఎత్తుకెళ్ళి అతి కిరాతకంగా సమూహిక మానభంగం చేసిన కేసు అప్పట్లో సంచలనం సృష్టించింది. వీడు కేవలం కామ పిశాచి మాత్రమే కాదు. అతి కిరాతకమయిన శాడిస్టు కూడా. తన్ శత్రువర్గానికి చెందిన ఒక మనిషిని పొట్టలో రిగ్గుతో రంధ్రం వేసి చంపాడు. ఇలా అనంతపురంలో ఎవరిని కదిలించినా ఓబుల్ రెడ్డి రాక్షస కృత్యాలు కథలు కథలుగా బయటకొస్తాయి.

అయితే ఈ మహానుభావుడి చావు కూడా ఇతడి స్టాండర్డుకి ఏ మాత్రం తగ్గ లేదు. పరిటాలకి అనుకూలంగా పని చేసే ఒక నక్సల్ విభాగం సభ్యులు ఇతడిని హైదరాబాద్ లో ఒక హోటల్ లో చంపారు. ఓబుల్ రెడ్డి ముగ్గురు అనుచరులతో కలిసి ఒక వేశ్యతో రాస క్రీడలు సాగిస్తుండగా హంతకులు లోపలికి ప్రవేశించారు. ఓబుల్ రెడ్డి భయంతొ బాత్ రూమ్ లో దాక్కున్నాడు. ఏం జరుగుతుందో తెలిసే లోగా ముగ్గురు అనుచరులనీ, ఆ వేశ్యనీ నరికి చంపారు. అటు పిమ్మట బాత్ రూం లోంచి ఓబుల్ రెడ్డిని బయటకు లాగి అతడి పురుషాంగాన్నీ, వృషణాలనీ కోసి, అటుపిమ్మట తాపీగా గొంతు కోసి చడీ చప్పుడు లేకుండా పరారయ్యారు.
ఓబుల్ రెడ్డి హీన చరిత్రకు నిదర్శనమేమిటంటే అతడి మరణం అతడి వర్గీయులని కూడా ఆనందింప చేయడం.

ఇలాంటి ఒక నీచ, నికృష్ట, అదమాధమ, రాక్షసుడికి సోదరిగా, వర్గీయులుగా తమని తాము ఎవరైనా చెప్పుకొంటే అది వాళ్ళు సిగ్గు పడాల్సిన విషయం. కాబట్టి అతడి సోదరినని చెప్పుకొంటున్న ఉషా రాణి గానీ ఇతర వర్గీయులు గానీ దయచేసి తెలుసు కోవలసిన విషయం ఏమిటంటే ఎవరైనా ఓబుల్ రెడ్డి గురించి ఎంత తక్కువగా చూపించినా కూడా అది సభ్య సమాజం ఖాండ్రించి ఉమ్మేసే విషయమే అవుతుంది.

10 comments:

A K Sastry said...

ఈ అనంతపురం ఓబుళ్ రెడ్డి యెవడు?

అంత దాఋణంగా అంతమయ్యాడా?

ఈ ఉషారాణి యెవరు? తెలియగచెప్పుము బ్లాగేశ్వరా!

Anonymous said...

Obul reddy and ramana raddy are brothers. Ramana Reddy was Ex MLA (Congress) Punugonda. Both were Killed.

Praveen Mandangi said...

బీహార్ కి చెందిన మాజీ MP షాహబుద్దీన్ కంటే పెద్ద కిలారీ గాడిలా ఉన్నాడే. షాహబుద్దీన్ పై 60-70 కి పైగా బందిపోటు కేసులు ఉన్నాయి. ఆ డబ్బులతోనే అతను స్వగ్రామంలో బిల్డింగ్ కట్టుకున్నాడు. అతను రేప్ లు మాత్రం చెయ్యలేదు. చాలా మంది దొంగలు, మాఫియా లీడర్లు కూడా ఈ ఓబులరెడ్డిని చూస్తే ఆశ్చర్యపోతారు.

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

ఉషా రాణి అనే ఆమె ఓబుల్ రెడ్డి చెల్లెలు. ఈ మధ్య అదే పనిగా టీవీ చానళ్ళలో రామ్ గోపాల్ వర్మనీ, రక్త చరిత్రనీ చూపిస్తున్నారు, ఫాలో అవడం లేదా?

nagireddy gaddam said...

@Krishnasri: please read "mee rajyam meerelandi" Novel of Swami, the Rayalaseema writer, which will enlighten you about the hidden facts of the factionism and the social factors which are not discussed in detail so far.

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

Nagi Reddy, please tell more about the book.

A K Sastry said...

ఓహో! ఆ ఓబుళరెడ్డా!

గుర్తొచ్చించి.

మీరాజ్యం మీరేలండి చదివినట్టే గుర్తు. అంతుందా అందులో?

సంతోషం.

gajula said...

obulareddy,budda sitaramireddy(ex mla)ilaanti vedavalaku kukkachaave gathi.buddasitaramireddy inkaa chaala daarunaalu chesaadu.

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

Don't know about Budda Seetarami Reddi.Why don't you write about him?

gajula said...

budda sitaarami reddy atmakur(srisailam)ex mla.eyanagaari thandri budda vengalareddy ex mla.vempenta issue gurthunna vaallaku deeni venuka budda family vunnavishayamu thelustundi.ika budda sitaaramireddy chesina repula gurinchi cheppalante maatalu raavu.vokka maatalo cheppalante veeni chemchaagaallatho veedantaadu 'e vurlo andamaina lady evaraina vunte cheppandi nenu thechhukuntaanu'ani.veedu chesinavi aa levello vunnayi.35yrs sarpanchugaa vunna voka 70yrs minority naayakunni bombulatho champinchaadu(adi voka rape vishayamulo jokyamu chesukunnadani?),vehicleku side ivvaledhani voka andhradrivernu kaalchi champaadu,ilaa cheppukuntu pothe chalaa vunnayi,mitrulu inkaa evarainaa chebithe bhaaguntundi.(veedu e madyane mla quarterlo chanipoyaadu kurchilo kurchuni,chanipoyaka 3 rojulaku e vishayamu baity prapanchaaniki telisindi).