జగన్ చేస్తున్న ఓదార్పు యాత్ర కానీ కాంగ్రెస్ నాయకత్వం అతగాడిని బెదిరిస్తున్న తీరు, అటూ ఇటూ అయితే సొంత దుకాణం పెట్టుకొంటానని జగన్ చేస్తున్న ప్రగల్భాలు చూస్తుంటే ఇదంతా ఒక ఆటలాగా అనిపిస్తుంది. వెయిటింగ్ గేమ్ అంటారు దీన్ని. ఎవరు ముందు బయట పడతారో అని చూడడమే దీని లక్శ్యం.
ఇరవై వేల కోట్లు అతి తక్కువ కాలంలో పోగేసిన జగన్ కి కాంగ్రెస్ అండ ఎంతైనా అవసరం.లేకుంటే ఆ ఎంక్వైరీ, ఈ ఎంక్వైరీ అని తినేస్తారు. కాంగ్రెస్ పంచన ఉంటే మరో ఇరవై వేల కోట్లు సులభంగా పోగేయ వచ్చు. కాబట్టి జగన్ కాంగ్రెస్ ని వీడి పోవటం అతడికి అంత లాభదాయకం కాదు.
ఇక ఇన్నాళ్ళూ పార్టీని అడ్డం పెట్టుకొని డబ్బు సంపయించిన వాడిని ఇప్పుడు వదులుకొంటే కంగ్రెసుకి కూడా నశ్టమే. ప్రతి చోటా ఇలాంటి డబ్బు మూటలున్న నాయకుడు ఒకరు కావాలి వాళ్ళకి. ఎన్నికలప్పుడు అభ్యర్దులకి మూటలు పంచాలన్నా, వాళ్ళ వైపునుంచి జనాలకి ఖర్చు పెట్టాలన్నా ఇలాంటి cash rich party ఒకటి కావాలి మరి.
నాతో పెట్టుకొంటే బయటికి పొయ్యి మీ దుంప తెంచగల సమర్ధత నాకుంది అని పార్టీలో పెద్ద వాళ్ళకు చెప్పాలని జగన్ ఆలోచన.
తెగే దాకా లాగితే మెడ పట్టుకొని బయటకు తోస్తాం అని జగన్ ని భయపెట్టాలన్నది నాయకత్వం ఆలోచన. కొన్నాళ్ళకి ఒకరినొకరు అర్ధం చేసుకొని ఇద్దరూ సర్దుకుపోతారు. కొంతకాలమాగి రోశయ్య ఆరోగ్యం ఆయనకు సహరించకపోయినప్పుడు జగన్ కి ముఖ్యమంత్రిగా అవకాశమిచ్చి ఎవరూ తగ్గినట్లుగా కాకుండా పరిస్థితి చక్కపెడతారు.
3 comments:
మీ ౨౦ వేల కోట్ల లెక్క అసలు కంటే బహుశా కొంచెం తక్కువ. అంతకు రెట్టింపు ఉంటుందని విమర్శకుల అంచనా.
May be. My 20,000 crores is from news paper reports.I think you are right.
avakaashavaada raajakeeyaalalo emaina jaragocchu
Post a Comment