నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Friday, August 27, 2010

రాహుల్ జీ కొంచెం మా సోంపేట వాళ్ళని కూడా గమనించండి ప్లీజ్

ఒరిస్సాలోని నియమ్ గిరి కొండల్లోని ఆదీవాసీల పోరాటం విజయవంతమైంది, తాత్కాలికంగానైనా. హాలీవుడ్ బ్లాక్ బస్టర్ అవతార్ ని తలపించిన దేవిడ్ Vs గోలియాత్ పోరాటంలో డేవిడ్ విజయాన్ని చూసి మనసున్న వారందరూ ఆనందించారు.
వాళ్ళకి అభినందనలు తెలియజేయడానికి దేశానికి యువరాజు, కాబోయే మహరాజు రాహుల్ గాంధీ స్వయంగా వాళ్ళదగ్గరికి వచ్చారు. ఒరియా బాషలో ప్రసంగం మొదలు పెట్టి అభివృద్ధి అనేది ప్రజల ప్రయోజనాలని తాకట్టు పెట్టేదిగా ఉండకూడదని ఒక నీతి వాక్యం చెప్పారు. పైపెచ్చు తమ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఇలా జరగడం లేదని కూడా సెలవిచ్చారు.
రాహుల్ సార్, ఆంధ్రాలోని సోంపేటలో జరిగిన సంఘటన గురించి మీకు తెలియదా, లేక ఆంధ్రాలో మీ పార్టీఅధికారంలో ఉన్న సంగతి మరిచిపోయారా? మీ పార్టీకి చెందిన అమాత్యులు పేరులోనే ధర్మాన్ని నింపుకున్న ప్రసాదరావు గారు ఆరు నూరైనా, ఎందరు బలైనా, సోంపేటలో పవర్ ప్రాజెక్టు వచ్చి తీరుతుందని హుంకరించిన విషయం ఒకసారి ఎవరినయినా అడిగి తెలుసుకోండి.
ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనే కాదు మీ పార్టీ వాళ్ళు ఏలుతున్న చోట కూడా ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోండి.మా సోంపేట వాళ్ళకి న్యాయం చేయండి.అప్పుడు అసలే నాయకులు లేని కాలంలో ఉన్నాం మనమిప్పుడు. మీరు అప్పుడు మహా నేతగా ఎదగొచ్చు. మిమ్మల్ని గాంధిగానే కాక రాహుల్ గా కూడా జనం ఆదరిస్తారు.

5 comments:

Anonymous said...

సరిగ్గా నేను మనసులో అనుకున్నదానిని వ్రాసినందుకు చాలా సంతోషం. ఇది ఒక రాజకీయ ఎత్తు తప్ప రాహుల్ గాంధి కి నిజంగా ఆదివాసీల మీద అంత అభిమానమా? మీరు అన్నట్లు రాహుల్ గాంధికి అదే కామెంట్స్ సోంపేటలొ చెప్పమనండి ?

G.P.V.Prasad said...

meeru jee ivvalsina avasaram ledu endukante ennkunna prajalato kaakunda ennukoni prajala kosam batukutunnadu

కెక్యూబ్ వర్మ said...
This comment has been removed by the author.
కెక్యూబ్ వర్మ said...

నేను ఆయన ర్యాలీ జరిగిన రోజే రాసాను.. చూడగలరు.. సోంపేట, విశాఖ బాక్సైట్ ను జిందాల్ కు అమ్మకంపై అక్కడి గిరిజనులు చేస్తున్న పోరాటాలు ఈయన కంటికి ఆనలేదు.
http://sahacharudu.blogspot.com/2010/08/blog-post_26.html

A K Sastry said...

చదవండి

http://teluguradical.blogspot.com/2010/08/blog-post_28.html