నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Friday, August 27, 2010

యూదు విద్వేషి వంట్లో యూదు రక్తం

అడాల్ఫ్ హిట్లర్....కరడు గట్టిన యూదు ద్వేషి. యూదులు తక్కువ జాతి వారని, వారిని వారితో పాటు తను తక్కువ జాతికింద లెక్క వేసిన ఇతర నల్ల జాతి వారినీ, ఆఫ్రికన్లనీ కాన్సెంట్రేషన్ కాంపులు పెట్టి మరీ విష వాయు ప్రయోగంతో చంపించిన రాక్షసుడు. తనూ, తన నాజీ పార్టీ అధికారంలో ఉన్న జర్మనీలో ఉన్న యూదు జాతీయులనందరినీ ఏరి ఏరి చంపించిన పిశాచి.
ఐన్ స్టెయిన్ లాంటి వాళ్ళెందరో అతడి బారి నుండి తప్పించుకోవడానికి యూరోప్ వదిలి పారిపోవలసి వచ్చింది. షుమారు ఒకటిన్నర దశాబ్ధం నడిచిన ఆ రాక్షస పాలన చివరికి అతడు ఆత్మహత్య చేసుకోవడంతో ముగిసింది.

తనది ఎక్కువ జాతి అని మిగిలిన వాళ్ళది తక్కువ జాతి అని ఆ తక్కువ జాతి రక్తం తన జాతి వాళ్ళతొ కలవకూడదని వాళ్ళని అంతం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న ఆ హిట్లర్ రక్తం ఎలాంటిదో కనుక్కుందామని జీన్ పాల్ ముల్డర్ అనే ఒక పరిశోధకుడు హిట్లర్ వంశీయుల డీ ఎన్ ఏ సేకరించి దాన్ని పరిశీలిస్తే సమాధిలో కూడా హిట్లర్ ఉలిక్కిపడే నిజం బయటపడింది. తనది గొప్ప జాతి అని విర్రవీగి ఎవరైతే తక్కువ జాతి వాళ్ళు అని చంపించాడో ఆ యూదులు, నల్ల జాతి వాళ్ళలో ఉండే e1b1b అనే హాప్లోటైప్ అతడి రక్తంలో ఉందని తెలిసింది. నరకంలో ఉన్న హిట్లర్ ఆత్మ ఏమని ఘోషిస్తోందో ఇప్పుడు.

బ్రాహ్మణ ఆధిక్యంతో గర్విస్తూ మిగిలిన వాళ్ళని తక్కువగా చూస్తూ, చివరికి తను ఒక దళిత వ్యక్తితో తన తల్లికి పుట్టానని తెల్సుకున్న సోమయాజులు పాత్ర(వంశ వృక్షంలో) గుర్తుకు వస్తూంది ఈ సంగతి వింటే.

12 comments:

Anonymous said...

Appropriate word should be "MAY BE"

ఆ యూదులు, నల్ల జాతి వాళ్ళలో మాత్రమే ఉండే is false.

http://en.wikipedia.org/wiki/Haplogroup_E1b1b_%28Y-DNA%29

E1b1b is distributed as far south as South Africa, and northwards into North Africa, from where it has in more recent millennia expanded to Europe and Asia.[2] E1b1b1 (E-M35) is the predominant subclade of E1b1b, representing almost exactly the same population. M215 was found to be older than M35 when individuals were found who have the M215 mutation, but do not have M35 mutation.[2] The E1b1b clade is presently found in various forms in the Horn of Africa, North Africa, parts of Eastern, Western, and Southern Africa, West Asia, and Europe (especially the Mediterranean and the Balkans)[2][3][10][11].

E1b1b and E1b1b1 are quite common amongst Afro-Asiatic speakers. The linguistic group and E1b1b1 may have dispersed together from the region of origin of this language family.[12][13][14] Amongst populations with an Afro-Asiatic speaking history, a significant proportion of Jewish male lineages are E1b1b1 (E-M35).[15] Haplogroup E1b1b1, which accounts for approximately 18%[3] to 20%[16][17] of Ashkenazi and 8.6%[18] to 30%[3] of Sephardi Y-chromosomes, appears to be one of the major founding lineages of the Jewish population.[19][Note 6]

Anonymous said...

Hail Hitler. The great dictator.

Anonymous said...

యూదుల వాడే యూదులని నిర్మూలించాడన్నమాట. వాళ్ళలో వాళ్ళు తన్నుకుంటే అది అంతర్గత వ్యవహారం, వేరేదేశాలవాళ్ళు జోక్యం చేసుకోకూడదు. ద్వారకలో ముసలం పుట్టినట్ట్లు యూదుల్లో కూడా ముసలం పుట్టిందనుకుంటం, ఇందులో కొత్త ఏముంది?

seenu said...

యూదులకు, యాదవులకు ఏమైనా దగ్గర సంభంధం ఉందా ? యూదులలో క్రైస్ట్ పుట్టాడు, యాదవులలో కృష్ణ పుట్టాడు ... దీనిలో మీకేమైనా సారూప్యత కనిపిస్తిందా. రెండవ ప్రపంచ యుద్దానంతరం యూదుల సంఖ్య తగ్గిపోయింది , మహాభారత యుద్ధానంతరం యాదవుల నాశనం జరిగింది

Anonymous said...

మీరు పొఱపడ్డారు. వంశవృక్షం సినిమాలో లో జె.వి. సోమయాజులు పాత్ర బ్రాహ్మణుడికే పుట్టినట్లు చూపించారు. (ఒక బ్రాహ్మణ హరికథాగాయకుడికి) అయినా మానవత్వం లేని హిట్లర్ నీ, స్వయంగా మానవత్వాన్ని ప్రబోధించిన బ్రాహ్మణులతో పోల్చడం సరికాదు. మన దేశంలో బ్రాహ్మణులు గురువులు. జాతిగర్వం ప్రపంచంలో అందరికీ ఉంటుంది.. ఎంతోకొంత ! లేనివాళ్ళెవరు ? దళితులక్కూడా ఉంటుంది. అంతమాత్రాన అందరూ హిట్లర్‌లైపోరు గదా ?

చెప్పు దెబ్బలు-పూలదండలు said...

Tara గారూ థాంక్స్. నేను అంత లోతుగ చదవలెదు. ఎనోనొమస్ గారూ హిట్లర్ ని బ్రాహ్మణులతో పోల్చడం గానీ బ్రాహ్మణులకు జాతి గర్వం ఉందని చెప్పడం గానీ నా ఉద్ధెశ్యం కాదు. పొరబాటుగా అల్ల అనిపించేలా నా పోస్టు ఉంది అంటే అది నా తప్పు. సారీ.

చెప్పు దెబ్బలు-పూలదండలు said...

శ్రీను గారూ,యూదులకీ యాదవులకీ సంబంధం ఉందేమో నేను చెప్పలేను. ఎవరైనా ఆ అంశం మీద రాస్తారేమో చూడాలి.

durgeswara said...

మీరు పొరపాటును గ్రహించారు గనుక పోస్ట్లోని ఆవాక్యాన్ని తొలగించమని కోరిక , ఇక యుదులు యదువంశీయులేననే ఆధారాలు ఉన్నాయి

Anonymous said...

చెప్పుబెబ్బ ఓ సారి పడ్డాక తొలగించి పూలదండగా మార్చే ప్రశ్నేలేదు. ఈ చెప్పుదండ అసలే మాటమీద నిలబడే కాదు నిద్రపోయే రకం. -:))

చెప్పు దెబ్బలు-పూలదండలు said...

Durgeswar, the mistake is now rectified.Thank you very much Tara and Durga.

Anonymous said...

>>తనది గొప్ప జాతి అని విర్రవీగి ఎవరైతే తక్కువ జాతి వాళ్ళు అని చంపించాడో.

అసలు విషయం మర్చిపోయాను, ఆ గొప్ప జాతిలో అరబ్బు జీన్సు కలిసిపోయాయని ఇప్పటికే తేలిపోయింది..

Anonymous said...

జై బ్లాగు వీక్షణం
జైజై కత్తి మహేష్