చిరంజీవి ఈ మధ్య చాలా ఆనందంగా ఉన్నారు. తను చేపట్టిన జన జాగృతి యాత్రకి వచ్చిన జనాన్ని చూసి ఆయన ఆనందిస్తున్నారని ఆయనే చెప్పుకొన్నారు. కానీ తనని చూడ్డానికి వచ్చిన వాళ్ళందరూ తన ఓటర్లు అయ్యుండాలని లేదన్న విశయం ఆయన ఇంకా తెలుసుకోకపోవడం వింతగా ఉంది. గత ఎన్నికలప్పుడు, ఆయన పార్టీని ప్రకటించడానికి పెట్టిన మొదటి మీటింగుకీ అశేశంగా జనం వచ్చినా ఎన్నికలలో తన రైలింజను పట్టాలు తప్పిన సంగతి ఆయన అప్పుడే మర్చిపోయాడా లేకపోతే ఆయన మాటల వెనుక ఇంకేదైనా దాగి ఉందా?
ఈ జనాన్ని చూపించి రేపో మాపో కాంగ్రెసు పార్టీలో తన పార్టీని విలీనం చేస్తే అప్పుడు మంచి వాటా కోసం డిమాండ్ చేయడానికి ఇప్పటినుండే పధకం రచిస్తున్నాడా?
ఈ మీటింగులకు వచ్చిన జనాన్ని చూసి సోనియా గాంధీ మోసపోయి ఈయన ఏమడిగితే అది ఇచ్చేంత అమాయకురాలా ఆమె?
లేకపోతే చేవ చచ్చి, జవ సత్వాలుడిగి పోతున్న తన పార్టీ శ్రేణులని ఉత్తేజపరచాలన్నది ఆయన ఉద్ధేశ్యమా?
అదీ గాక తనని తాను మోస్సగించుకొంటున్నాడా?
1 comment:
loguttu perumaalla (10 janapath)keruka
Post a Comment