నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Thursday, August 19, 2010

రోశయ్య గారూ మీకోసం కొన్ని పధకాలు

ాపులిస్టు పధకాలు పెట్తి ఖజానామీద భారం వేయను నేను అని నిన్న రోశయ్య గారు ఒక ప్రకటనలో చెప్పారు. అది చదివి నాకు బాధేసింది. మీవి అని చెప్పుకోవడానికి కనీసం కొన్నయినా పధకాల్లేకపోతే ఎలా? ఖజానా సంగతి పక్కన పెట్టి ఇవి రోశయ్య గారి మానస పుత్రికలు అని చెప్పించుకోవాలంటే కనీసం ఒకట్రెండు స్కీములుండాలి. అప్పుడే మిమ్మల్ని మనసున్న మారాజని అంటారు. ఖజానా పైన ఎంత భారం పడ్డా సరే వీటిని ఆపేదే లేదు అని ఒక స్టేట్ మెంట్ ఇవ్వండి. మడమ తిప్పని మహా నేత అయిపోతారు. సరే పధకాలు ఏం పెట్టాలా అని ఆలోచిస్తున్నారా? కొన్ని మచ్చుకి చూడండి.

1.రాజీవ్ నిరుద్యోగశ్రీ: డిగ్రీ పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం లేని ప్రతి యువతికీ, యువకుడికీ నెలకి రెండో, మూడో వేలు ఇచ్చే ఏర్పాటు చేయండి. స్వంతంగా వ్యాపారాలు చేసుకొంటున్నా, ప్రైవేటు కంపెనీలలో వేలకి వేలు జీతాలు తీసుకొంటున్నా వాళ్ళని కూడా దీనిలో చేర్చేయండి.
2. ఇందిరా గృహిణిశ్రీ: పెళ్ళయి సంసారం చేస్తున్న ప్రతి ఆడపడుచుకీ నెలకి ఇంతని ఇంటికే డబ్బు పంపే ఏర్పాటు చేయండి. ఆస్తీ అంతస్తుతో నిమిత్తం లేకుండా ప్రతి మహిళకీ దీన్ని వర్తింపచేయండి.

౩. సోనియా వధువుశ్రీ: పెళ్లి చేసుకొంటున్న ప్రతి పిల్లకీ సారె కింద రెండో మూడో వేలివ్వండి. దీనిక్కూడా అస్తితో నిమిత్తం లేకుండా అందరినీ అర్హులని చేయండి. మీ పేరు ఇంటింటా మారు మోగిపోతుంది.
4. రాహుల్ విద్యార్ధిశ్రీ: ప్రభుత్వ పాఠశాలలొ చదువుకొంటున్న ప్రతి పిల్లకీ పిల్లవాడికీ నెలకి ఇంతని ఇవ్వండి. అప్పుడు పిల్లలందరూ స్కూళ్ళలో ఉంటారు.
5. ప్రియాంక బాలికాశ్రీ: పన్నెండేళ్ళు దాటిన ప్రతి ఆడపిల్లకీ నెలకి ఇంతని పెళ్ళయ్యేదాకా ఇస్తే ఆ డబ్బుతో ఆ పిల్ల పెళ్ళీడు వచ్చేసరికి మొగుణ్ణి కొనగలిగేంత పోగేసుకొంటుంది.

ఇవి చాలకపోతే ఇలాంటివి ఇంకా ఎన్నో ఉంటాయి. ముందు వీటితో మొదలు పెట్టండి. జమా ఖర్చులని లెఖ్ఖలు వేయకుండా ఎన్ని ఇబ్బందులొచ్చినా వీటిని ఆపే ప్రసక్తే లేదు అని అప్పుడప్పుడూ చెప్తూ ఉండండి. అప్పుడే మిమ్మల్ని మడమ తిప్పని మహానేతల జాబితాలో చేరుస్తారు.

7 comments:

పుల్లాయన said...

very good :)

Anonymous said...

good one

Anonymous said...

Rosaiah turn out be empty/hollow(dummy) man.

Compared to PV, he is nothing. When PV got power, he show his true character and led the nation to prosperity.

Where as Rosaiah is trying to cling to CM post by appeasing to that Italina.

శ్రీవాసుకి said...

బాగుంది పోస్ట్. ఈ పధకాలన్నిటికీ డబ్బు కావాలంటే 10 ఇళ్ళకి ఒక మద్యం షాపు చొప్పున అనుమతులివ్వాలి. మగవాళ్ళు ఎలాగు త్రాగి పడిపోతే ప్రభుత్వం పంపే ఆ డబ్బు ఆడవాళ్ళకి ఉపయోగపడుతుంది. అప్పుడు అందరి మొహాలలోను వెలుగే. ఆంధ్రా వెలిగిపోతోందని చెప్పుకోవచ్చు. :-)

Anonymous said...

nirudyoga sri babu gari patakam kadandi. nirudyogulato patu intiki nelaku rendu velu istanannadu kada

amma odi said...

పథకాలన్ని మహబాగున్నాయి. మంచి అవిడియాలు!

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

కామంట్ చేసిన అందరికీ థాంక్స్.బాబు గారు చెప్పింది ఆర్ధిక స్థితిని బట్టి నెలకింతని ఇస్తామని. నేను సూచించింది అర్ధిక స్థితిగతులతో సంభందం లేకుండ ప్రతి నిరుద్యోగికీ నెలకింతని ఇచ్చెయ్యమని. వ్యాపారస్తులూ, ప్రైవేటు ఉద్యోగులు కూడా ఇందులోకి వస్తారు.