నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Monday, August 16, 2010

హీరోల సినిమాలు చూడకూడని ఒట్టు పెట్టుకున్నాను

ప్పుడు సినిమా హీరో కావాలంటే ఒకేఒక అర్హత సినిమా కుటుంబంలో పుట్టడమే. నటన రాకపోయినా, వాచికం లేకపోయినా, బాష తెలియక పోయినా, మొహం చూడ్డానికి బాగా లేకపోయినా ఏం పర్లేదు. సినిమాల్లో బాగా పాతుకుపోయిన కుటుంబంలో పుట్టినట్లైతే అన్నీ సర్దుకుపోతాయి. సినిమాల్లో నటించవచ్చు. తినగ తినగ వేము ఎలాగూ తియ్యగానె ఉంటుంది కాబట్టి కొంతకాలానికి ప్రేక్షకులు కూడా ఈ రొచ్చు మొహాలు చూడ్డానికి అలవాటు పడిపోతారు. మొదట మొదటిలో ఎలాగూ కుల పిచ్చితో కొట్తుకు చచ్చే అభిమానుల గుంపు ఒకటి ఉండి ఏడుస్తుంది కాబట్టి స్టార్టింగ్ ట్రబుల్ లేకుండా లాగించవచ్చు.

ఈ ఉద్ధేశ్యంతో నేను కొంత మంది హీరోల సినిమాలు హాల్లో డబ్బులు పెట్టి టిక్కెట్ కొనుక్కొని చూడకూడదని నిర్ణయించుకొన్నాను. ఆ లిస్టు చిత్తగించండి.
1. మంచు బ్రదర్స్. మోహన్ బాబు సుపుత్రులు విష్ణు, మనోజ్ లు: అయితే విష్ణు సినిమా ఢీ అన్నదానిని మాత్రం చూడకతప్పలేదు. శ్రీను వైట్ల స్క్రిప్టు పుణ్యమా అని ఆ సినిమా నచ్చింది. అదే సినిమాని ఆ దర్శకుడు మరో మూడు సినిమాలు తీశాడు అది వేరే విషయం. మనోజ్ సినిమా ప్రయాణం టీవీలో చూడాల్సి వచ్చింది. టీవీలో కాబట్టి అడ్వర్టైజ్ మెంట్లు చూసి సినిమా వచ్చినప్పుడు కళ్ళు మూసుకొని నిద్ర పోయాను. అక్కడక్కడా చూసినప్పుడు హీరోయిన్ మొహం నచ్చింది. ఇటీవల ఝుమ్మంది నాదం బావుందని కొందరు చెప్పారు కానీ ఈ లోగా కొన్ని బ్లాగుల్లో వచ్చిన రివ్యూలు చదివి తప్పించుకొన్నాను. తాప్సి బొడ్డు చూసే అవకాశం అలా తప్పి పోయింది.

2.విశాల్, ధనుష్: వీళ్ళు తమ పరిమితులు తెలుసుకొని అందుకు తగ్గట్లు అల్లరి నరేష్ లాగా సినిమాలు తీస్తే బావుండెదోమో గానీ తమని సూపర్ స్టార్లుగా ప్రొజెక్ట్ చేసుకోవాలనుకోవడంతోనే చిక్కంతా. తమిళ తంబిలు అది నచ్చుతారేమోగానీ నాకు నచ్చక వీళ్ళ సినిమాలపైన బ్యాన్ పెట్టాను.
౩. సుశాంత్: మొదటి సినిమా కాళిదాసు రిలీజయిన హాలు బయట సుశాంత్ యువసేన అన్న బ్యానర్ చూసిన నాడే వీడెవడొ అతిగాడులా ఉన్నాడనుకొని ఈ లిస్టులో చేర్చేశాను. తరువాత టీవీలో ట్రైలర్ చూసి నా నిర్ణయం సరయిందేనని తేల్చేశాను.
నాగ చైతన్య జోష్, రానా లీడర్ చూశాక పర్వలేదనిపించి వాళ్ళని ఇందులో చేర్చలేదు.
అయితే సినిమా వాళ్ళ వారసులు రాబోయే కాలంలో కుప్పలు తెప్పలుగా రానున్నారు కాబట్టి ఈ లిస్టు మరింత పెరిగే అవకాశం ఉంది.

ఒక మాట. తారక రత్న అన్న ఒక హీరో ఇప్పుడు సినిమా రంగం నుంచి దాదాపుగా తప్పుకొన్నట్లు భావించి ఆయన గురించి రాయలేదు. అస్సలు ఈ లిస్టు తయారయ్యింది ఆ మహా నటుడి నుంచే నని మీకు మనవి చేస్తున్నాను.
మరొక మాట. మనోజ్ నటించిన వేదం బాగా ఉందని రివ్యూలు చదివాను. పైపెచ్చు అమలాపురం సరోజ కూడా ఆ సినిమాకి ఒక ప్లస్ పాయింటు. అయినా ఎందుకో ధైర్యం చేయలేక పోయాను.

11 comments:

మాధవ్ said...

nenu telugu movies choodadam maanesi 5 yeasr avuthundi..because of alluarjun

మేఘన said...

idi manakandariki thelusu(hero's ga vasthnna vallaki kuda), kani nijallni voppukunentha thelivi thakkuva vallu(hero's) kaaduga, anduke video piracy inthala perigipothundi.

Anonymous said...

A very good decision.

Anonymous said...

బఫూన్ బన్నీ గాడో మరి ... కొంపదీసి వాడి కుప్పి గంతులు నచ్చాయా ఏంటీ?. వాడి ఫేసు అచ్చం చింపాంజీ లా ఉంటుంది . హాస్య నటుడి మనవడు కదా అలానే ఉంటుంది. వాడు కూడా కామెడీ రోల్స్ చేసుకోక కండలు చూపుతుంటాడు . ఇంకా సుమంత్ కూడా

Anonymous said...

Telugu insdustry lo naaku nachani oke okka padam 'varasudu' :)

gajula said...

manaku vere alternative entertainment ledu kaabatti ,e vaarasulu edo oka roju manchicinema theeyakapotharaa ani eduruchustu vunde aneka mandilo nenu oka vaarasunni

Avyaya said...

anna nuvvu cheppindi perfect...enthaa pedda family nunchi vacchina enthaa chandalangaa unna.....there is something called ACTING....if u know that ntng matter's.........there are some hero's(I dnt want to take there name)bagaleka poyinaa there acting skills r gud......

చెప్పు దెబ్బలు-పూలదండలు said...

I don't how I missed Allu Arjun in this list.He must be here.BTW I haven't seen his movies in theatres till date.

Anonymous said...

Meeru "Nitin" ane maha natunni ee list lo cherchatam marchipoyaru....

Anonymous said...

1)Bhasha, Vaachakam ane vishayallo ... Jr NTR is the best in Young Heroes list ..... 2)Sarvanand is doing a good job in selecting the roles ....3) Navdeep a talented artist but lack of support... 4) Ram Charan...Performance is good...but need to concentrate on Bhasha and Vaachakam....

This is my just observation ....

usha said...

vedam chuda ledannaru chudandi,krish kosam ayina chudachu