నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Tuesday, July 13, 2010

రాష్ట్ర పిత రాజ శేఖర్ రెడ్డి!

రాజశేఖర్ రెడ్డిని గాంధీగారి పక్కన పీఠం వేసి కూర్చోపెట్టగానే తన పని అయిపోయినట్లు మళ్ళీ ఆ ఊసేమీ పట్టించుకోవడం లేదు జగన్.చేయాల్సింది చాలా ఉందయ్యా జగన్ బాబూ!

మోహన్ దాస్ గాంధీని జాతిపిత అన్నట్లుగా మన రాజశేఖరుడిని కనీసం రాష్ట్ర పిత అయినా చేయక పోతే ఎలా?ఇంక విగ్రహాల సంగతంటావా ..ఆ దిశగా నువ్వు ఇప్పటికే చాలా చేసేస్తున్నావులే.నీ ఒదార్పు యాత్ర పూర్తయ్యేలోగా మన రాష్ట్రంలో ఆ గాంధీ బొమ్మల కన్నా మీ నాన్న బొమ్మలు ఎక్కువే ఉంటాయి.అందులో రెండో మాటే లేదు.
ఆ గాంధీ పేరుతో ఊరూరా సందులూ గొందులే ఉంటే మన పేరుతో ఏకంగా ఒక జిల్లాకి జిల్లాయే ఖారారైపోయింది కదా.ఈ విషయంలో మనదే పైచేయి.
మరి యేటేటా జయంతికీ,వర్ధంతికీ సెలవులు ప్రకటించాలి.అన్ని తరగతుల సిలబస్సులో అన్ని సబ్జెక్టులలో పాఠ్యాంశంగా చేర్చాలి.ఒక అనుమానం రావచ్చు ఇక్కడ.తెలుగు,ఇంగ్లీషు,హిందీలలో జీవితాన్ని పాఠంగా పెట్టొచ్చు.మిగతా సబ్జెక్టులలో రాజశేఖర్ రెడ్డిని ఎలా ఇరికించాలా అన్న అనుమానం వద్దు.

మ్యాథ్స్ లో జలయగ్నం లెక్కలు,పాదయాత్ర లెక్కలూ పెట్టవచ్చు. సైన్సులో మళ్ళీ ఆనకట్టలూ,నీటి పారుదలా, సోషల్ స్టడీస్ లో భౌగోళిక శాస్త్రంలో మాగాణి లెక్కలు, చరిత్రలో ఆయన జీవిత గాధనే ఒక చరిత్రగా,ఆర్ధిక శాస్త్రంలో బడ్జెట్ లెక్కలూ, లక్ష రూపాయల బడ్జెత్ గురించి చెప్పొచ్చు.

ఇవన్నీ తరువాత ముందు రాష్ట్ర పిత టైటిల్ గురించి ఆలోచించు జగన్.

ఈ బ్లాగు నీకండగా నిలుస్తుంది.

8 comments:

Informatica said...

aa vidam gaa anni prayatnaalu jaruguthunnai.......meeru worry avavkarledu...ippati varaku raashtram lo only YSR chesinde paalana ani already survey lu chesi mari chepthunaaru...........Venkateswarswamy, srikrishnudu...andari kante chivarai gaa sai baaba...sai baaba taruvaata aagipoyina gods list ki enchancements project chepataaru........

Meere veetanniti ni marchipoyi Jagan ki salahaa isthunaaru......branding gurinchi ...jagan ki Sakshi cheppe range lo evarinaa vunaraa cheppandi

gajula said...

adi jagan,congressparty samasya.naluguriki upayogapade vishayalu raayandi.gajula

Informatica said...

sir adi Jagan and congress party samasyamaatrame ayite...meerendukandi atuvanti vaati meeda spandinchatam....janaala ki pani ki vache vaati meeda respond avavndi......

Jagan vaste ...vaadi venuka paduthunna chamchaagaalal ki ekkada dochi/...malli raashtraanni YSR time ki teesukeltaadani ...naa bhayam.....nannu ventaaduthunna bhayam gurinchi aalochinchakundaa vundalenu kadhaa

ఆ.సౌమ్య said...

ha ha ha :P

gajula said...

mitrulu infermationgaru nannu apaartham chesukunnaru.nenu mana blog mitrudiki aa salaha icchanu.andriki manchi chese prabhutvam raavaalane meelaagane memukuda korukuntunnamu.gajula

ఆ.సౌమ్య said...

రాష్ట్ర పిత అనేకంటే రాష్ట్రానికే దేవుడు అంటే బాగుంటుందేమో.

చెప్పు దెబ్బలు-పూలదండలు said...

Rashtra daivam.

Sreedhar said...

RajeevShekara Reddy;
Rajeev Veera Reddy;
amma Sonia[jejemma]
.... mana Pingali gariki dakkani gowravam vellaka?