నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Monday, January 3, 2011

అయ్యో పాపం!జస్ట్ మిస్ రాం గోపాల్ వర్మా!

మద్దెలచెరువు సూరి హత్యలో పెద్దగ ఆశ్చర్యపోయే, బాధ పడే అంశాలేమీ లేవు. కత్తితో బతికే వాడు ఆ కత్తితోనే చస్తాడని మన్ పెద్దలు ఏనాడో చెప్పిన విషయం నిజం చేయటానికే ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతూ ఉంటాయి. 
 




 
సూరి హత్యకోసం మనం ఇక్కడ సంతాపాలూ, చింతకాయలూ ఏమీ పెట్టబోవడం లేదు. అయితే ఈ హత్య టైమింగ్ గురించే చిన్న మాట. ఇదే హత్య రాం గోపాల్ వర్మ తీసిన రక్త చరిత్ర సినిమాలలో ఏదో ఒకటి విడుదల కాకముందో, థియేటర్లలో ఆడుతూ ఉన్నప్పుడో జరిగి ఉంటే పాపం వర్మకి దిక్కుమాలినంత పబ్లిసిటీ వచ్చి నిర్మాత నాలుగు రాళ్ళు వెనకేసుకుని ఉండేవాడు కదా.
 
పోనీ ఇదే హత్య సినిమా ప్లాన్ చేస్తున్నప్పుడో, షూట్ చేస్తున్నప్పుడో జరిగి ఉంటే వర్మగారు తెర మీద మరింత రక్తం పారించి ఉండే వాడు కదా.


ఎటూ కాకుండా పోయిందే ఈ హత్యతో అని ఒక చిన్న నిట్టూర్పు.

2 comments:

శ్రీవాసుకి said...

మీ నిట్టూర్పు, బాధ నాకు అర్థమయ్యాయి. రక్తచరిత్ర-3వస్తుందిలెండి

Anonymous said...

జూబిలీహిల్స్ కారు బాంబ్ కేసు లో ప్రాణాలు కోల్పోయిన అమాయకుల ఆత్మలకు ఇప్పటికైనా న్యాయం జరిగింది.ఆ ఘోరకలిలో పాలుపంచుకున్న మిగతావాళ్ళకు కూడా ఇటువంటి కుక్కచావు రావాలని కోరుకుంటూ.