IPL లో తమ దేశానికి చెందిన ఒక క్రికెటర్‌ని కూడా సెలక్ట్ చేసుకోకపోవడం పాకిస్తాన్‌లో చాలా మందికి కోపం తెప్పించింది. ఈ అవమానానికి ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని భావించారు. ఆ దేశానికి చెందిన రాజకీయ నాయకులు, అంటే బిన్ లాడెన్, ఐ ఎస్ ఐ, దావూద్ ఇబ్రహీమ్, తాలిబాన్ లాటి వాళ్ళు కలిసి తమకీ ఒక ప్రీమియల్ లీగ్ ఉండాలని భావించారు. లీగ్ అంటే డబ్బుతో కూడుకున్న విషయం కాబట్టి తమ దేశ వ్యాపార వేత్తలతో అంటే ఒసామా బిన్ లాడెన్, తాలిబాన్, ఐ ఎస్ ఐ, దావూద్ ఇబ్రహీమ్ లతో మాట్లాడి PPL అంటే పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్‌ని అనౌన్స్ చేశారు.
ఇక జట్ల కోసం బిడ్డింగ్ చేస్తే కుప్పలు తెప్పలుగా బిడ్స్ వచ్చి పడ్డాయి. దాంతో ఆ దేశ క్రికెట్ బోర్డ్ ఆశ్చర్యంతో ఉబ్బి తబ్బిబ్బై పోయింది. తమ లీగ్ మొదలైతే IPL మట్టి గొట్టుకు పోవడం ఖాయం అని జట్లను అనౌన్స్ చేసింది. అందులో మచ్చుకు కొన్ని జట్లు ఇవి: లాడెన్ లయన్స్, దావూద్ డెవిల్స్, తాలిబాన్ టైగర్స్, ఐ ఎస్ ఐ ఇన్విన్సిబుల్స్, బుఖారీ బుల్లెట్స్, కరాచీ కింగ్స్. ఎలాగూ IPL మటాషై పోతుందని తీర్మానించేశారు కాబట్టి ఎందుకైనా మంచిదని ఇరవై జట్లతో లీగ్ లాంచ్ చేశారు.
ఇక ఆటగాళ్ళ కోసం వెదుకులాట మొదలు పెడితే పాకిస్తాన్‌లో ఆడ్డానికి ఆ దేశ ఆటగాళ్ళే ఒప్పుకోలేదు రక్షణ ఉండదని. ఏదైనా తటస్థ వేదిక అంటే భారత్, లండన్, దుబాయ్, షార్జా అయితేనే ఆడుతామని తెగేసి చెప్పారు. చచ్చీ చెడీ, దేశ రక్షణ మంత్రితో సెక్యూరిటీ పైన భరోసా ఇప్పించి ఒప్పించారు. ఇక తీరా వేలం మొదలు పెడితే IPL లో లేని వాళ్ళు, రిటైరై కోచ్ పదవులకి వెళ్ళే ఆలోచనలో ఉన్న వాళ్ళు ముందుకొచ్చారు. అందరూ IPL నుండి పిలుపు వస్తే వెళ్ళిపోవడానికి ఒప్పుకుంటేనే సంతకం పెడతామని పట్టు పట్టారు. అందుకు రెడీ అని జట్లని సిద్ధం ఏశారు.
ఇక లాహోర్‌లో మొదటి మ్యాచ్ మొదలు పెట్టారు. స్టేడియంకి చుట్టూ రెండు కిలోమీటర్ల మేరా సెక్యూరిటీ బలగాలను దింపి చీమ సైతం తమని దాటి పోలేనంత కట్టుదిట్టంగా కాపలా కాయడం చూసి ఆటగాళ్ళకి తమ ప్రాణాలమీద భయం లేకుండా చేశారు. స్టేడియంలో సగం ప్రేక్షకులూ, మిగతా సగం పోలీసులూ సైనికులూ ఉండడం చూసి ఆటగాళ్ళందరికీ ఏమూలో ఉన్న మిగిలినా ఆకాస్త భయం కూడా పోయింది.
టాస్ అయ్యాక ఆటగాళ్ళు ఒక్కొక్కరుగా మైదానంలోకి వస్తుండగా ప్రేక్షకులు హర్షధ్వానాలు మిన్నంటాయి. ప్రతి ఆటగాడూ బ్యాట్స్‌మన్‌తో సహా చెవుల్లో బ్లూ టూత్ డివైసెస్ పెట్టుకొని ఉండడం గమనించిన అంపైర్ ఫీల్డింగ్ జట్టు కెప్టెన్‌ని పిలిచి విషయమేంటని అడిగాడు.
"సార్ అవి సెల్ ఫోన్స్. వాటిలోంచి మాకు మధ్యమధ్యలో ఆర్డర్స్ వస్తాయి. ఎప్పుడు నోబాల్స్, వైడ్స్ వెయాలో, అలాగే ఎప్పుడు లూజ్ బాల్స్ వేసి బౌండరీలు ఇవ్వాలో. అలాగే బ్యాట్స్‌మన్‌కి కూడా ఎప్పుడు అవుటవ్వాలో అని. దాని పట్టి మేం ఆడాలి"అని వివరించాడు అతను. "NO..no.... This is not cricket. I won't allow this to happen as an umpire. I will report this matter to ICC" అంటూ కోపంగా వెళ్ళిపోబోయాడు సదరు అంపైర్. "" ఆగండి సార్. మీక్కూడా ఒక ఫోన్ ఉంది. మీది మీకివ్వడం వాళ్ళు మర్చి పోయి నకిచ్చి పంపారు. తీసుకోండి. ఫస్ట్ కాల్ అందులో ICC నుండే వస్తుంది" అని జేబులోంచి ఒక ఫోన్ తీసి అంపైర్ చేతికిచ్చాడు కెప్టెన్. "I don't obey their orders. I will inform this matter to the world media" కోపంగా విసిరి కొట్టాడు అంపైర్.
అతన్ని జాలిగా చూశాడు కెప్టెన్. "సార్ తీసుకోండి. దాన్లో చెప్పినట్టు చేస్తే మీరి విమానం సీట్లో కూర్చుని ఇంటికెళ్తారు. లేకుంటే కాఫిన్లో కార్గో ఏరియాలో వెళ్తారు" అన్నాడు. సడెన్‌గా బాబ్ ఊల్మర్ గుర్తొచ్చి ఫోన్ తీసి జేబులో, బ్లూటూత్ చెవిలో పెట్టూకొని మ్యాచ్ ప్రరంభించండి అని సైగ తీశాడు అంపైర్.
మ్యఛ్ మొదలయింది. ఆటగాళ్ళందరూ సీరియస్‌గా మధ్య మధ్యలో చెవుల్లో వినపడే ఆర్డర్స్‌ని అనుసరించి ఆట మొదలు పెట్టారు. కాస్సేపటికి బ్యాట్స్‌మన్ సిక్సర్ కొట్టాడు. చుట్టూ ఉన్న లౌడ్ స్పీకర్లలోంచి సూఫీ కీర్తనలు పెద్దగా వినిపించాయి. ఛీర్ గాళ్స్ స్టీజీ మీదకి ఎక్కారు. నిండుగా బురఖాలు ధరించి నమాజ్ చేస్తున్నట్లు కూర్చుని కాస్సేపు అయ్యాక దిగి వెళ్ళిపోయారు.
అలా ఒక ఇన్నింగ్స్ పూర్తయి, రెండో ఇన్నింగ్స్ మొదలయ్యి సగం పూర్తయ్యాక ప్రేక్షకుల గ్యాలరీలో ఒక పెద్ద పేలుడు సంభవించి సగ భాగం స్టేడియం ధ్వంసమయి పోయింది. ఎవరో ప్రేక్షకుడు తన నడుము కున్న బాంబు పేల్చడంతో ఆ పేలుడు జరిగి కొంచెం అటూఇటుగా ఓ వందమంది చచ్చిపోయారు.
దాంతో ఆ పూటకి ఆట రద్దు చేసి మిగతా ఆట రేపు ఇదే వేదిక మీద జరుగుతుందని అనౌన్స్‌మెంట్ చేశారు నిర్వాహకులు.
టీం బస్సెక్కి హోటల్ గదులకు తిరిగి వెళ్తుండగా అప్పటికి షాక్ నుండి తేరుకున్న ఓ విదేశీ ఆటగాడు తన పక్కనున్న షాహిద్ ఆఫ్రిదీని అడిగాడు. "అంత టైట్ సెక్యూరిటీ పెట్టారు. అయినా బ్లాస్ట్ ఎలా జరిగింది బాస్?" షాహిద్ ఆఫ్రిదీ అతన్ని చూసి , అర్జునుడికి భగవద్గీత భోధిస్తున్న అర్జునుడిలాగా ఓ చిరు నవ్వు నవ్వి, " పిచ్చి వాడా అంత టైట్ సెక్యూరిటీ ఉండబట్టే కదా, ఒకటిన్నర ఇన్నింగ్స్ ఆడగలిగాం. పాకిస్తాన్ పోలీసులా మజాకా! చూడు రెండొందల మంది చచ్చుంటారు ఆ బ్లాస్ట్‌లో. ఒకా ప్లేయరయినా చచ్చాడా?" అన్నాడు.
ఆ విదేశీ ఆటగాడు మళ్ళీ షాక్ నుండి తేరుకునేలోగా హోటల్ వచ్చింది.