నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Friday, April 22, 2011

బాబా కూడా భీష్ముడే(ఒక విధంగా)!


శంతనుడుకి గంగ తనని వదిలి పోయిన చాలా రోజులకి పెళ్ళిమీదికి మనసుపోయింది సత్యవతిని చూశాక. కానీ ఆమె తండ్రి ఆమెని అతనికిచ్చి పెళ్ళి చేయడానికి ఒప్పుకోలేదు ఏ నాటికైనా శంతనుడి మొదటి పుత్రుడైన దేవవ్రతుడికే రాజ్యం దక్కుతుంది సత్యవతి సంతానానికి కాదు అని. తండ్రి కోసం సింహాసనం పైన తన హక్కుని వదులుకోవడానికి దేవవ్రతుడు సిద్ధపడ్డా సత్యవతి తండ్రి మరొక మెలిక పెట్టాడు. రేపు దేవవ్రతుడి సంతానం అధికారం కోసం పట్టుబట్టరని నమ్మకమేమిటీ అని ఆయన ప్రశ్న. దాంతో తండ్రికోసం జీవితాంతం ఘోటక బ్రహ్మచారిగా ఉండిపోతానని భీష్మ ప్రతిగ్న చేసి దేవవ్రతుడు భీష్ముడయ్యాడు.
  
అందుకు సంతసించిన శంతనుడు కొడుక్కి ఇచ్చామరణాన్ని ప్రసాదించాడు. ఆయన కోరుకున్నప్పుడు మాత్రమే మరణం ఆయనను సమీపించగలదు. అంచేతనే మహాభారత యుద్ధంలో అర్జునుడి బాణాన్ని ఆహ్వానించి నేలకొరిగినా దక్షిణాయనం ప్రవేశించేదాకా అంపశయ్యమీద పరుండినాడు ఆ భీష్ముడు.
  
మహాభారతంలోని ఆ మహా పురుషుడిని ఈనాడు మనందరికీ తలపుకు తెస్తున్నాడు పుట్టపర్తి సత్య సాయిబాబా. అయితే భీష్ముడు తను ఇష్టపడ్డదాకా జీవాన్ని తనలో నిలుపుకుంటే ఈ అభినవ భీష్ముడు యంత్రాల సాయంతో బతికున్నాడో లేదో తెలియకుండా ICU లో బెడ్ మీద గడుపుతున్నాడు. ఆయన చుట్టూ చేరిన ట్రస్టు సభ్యులు ఇష్టపడ్డదాకా మరణం ఈయనని సమీపించదు. 
   


ఆనాడు దేవవ్రతుడికి శంతనుడు ఇచ్చామరణాన్ని ప్రసాదిస్తే, బాబాగారికి ట్రస్టు కనుసన్నలలో మెలుగుతున్న డాక్టర్ సఫాయా ఈ వరాన్ని ఇస్తున్నాడు. ప్రశాంతి నిలయంలోంచి బంగారాన్ని తరలించడం మొదలయ్యిందని మీడియా బట్టబయలు చేసింది కాబట్టి ఈ ICU డ్రామాకి త్వరలోనే తెరపడనున్నదని అనిపిస్తూంది

1 comment:

Anonymous said...

I have one question to you.
How can you believe Andhrajyothy pepar? Why it is so intrested about Baba. Other than this pepar nobody is writing about Gold and money related news at baba ashram.
I read Ennadu, sakshi & andhrabhoomi they did not mention any thing about Gold & Money news.