నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Friday, April 29, 2011

అద్వైతమే హిందుత్వానికి శరణ్యంఈ మధ్య  బాబాల, స్వామీజీల టైమ్ అసలు బావున్నట్లు లేదు. మహా టీవీ వాడు ఆ మధ్య వరుసగా కల్కి భగవాన్ గారినీ, ఆయనతో బాటు కొలువైన అమ్మ భగవాన్‌నీ వరుసగా ఉతికి ఆరేశాడు. ఆశ్రమంలో జరిగే భాగోతాలన్నీ దృశ్యాలతో సహా బయటపెట్టి కంపు కంపు చేసి పారేశాడు. తరువాత నిత్యానంద స్వామి వారి రాసలీలలు వీడియోతో సహా మన డ్రాయింగ్ రూమ్‌లలో మనందరం చూసినవే. యూ ట్యూబ్‌లో అత్యధిక ఆదరణ పొందిన వీడియోగా ఖ్యాతిని దక్కించుకొన్న ఘనత కూడా అయ్యగారికి దక్కింది. ఇప్పుడు సత్య సాయి బాబా గారు దాదాపు నెల రోజులు హాస్పిటల్‌లో మరణంతో పోరాడి కన్ను మూశారు. ఈ ఘట్టంలో సత్య సాయి ట్రస్టు వాళ్ళు తమ చేష్టలతో స్వామి వారిని అపఖ్యాతి పాలు ఛేశారు. ఇంటర్నేషనల్, నేషనల్ లెవల్ బాబాల స్థితి ఇలా ఉంటే, రోజుకొకటిగా లోకల్ స్వాములని ఉతికి ఆరేస్తున్నారు మీడియా వాళ్ళు.
    

ఇలా మన ఆధ్మాత్యక గురువులు  భ్రష్టు పడుతూ ఉంటే ఇది హిందుత్వాన్ని దెబ్బ తీస్తుందా, అసలు హిందూ మతాన్ని దెబ్బ తీయడానికి ఇదంతా కిరస్తానీ వాళ్ళు చేస్తున్న కుట్రా అని ఎవరికైనా అనుమానం వస్తే రావొచ్చు. కానీ నా ఉద్ధేశ్యంలో ఇదంతా హిందూ మతం మంచికే.

    
ఏనాడో శంకరాచార్యులు ప్రవచించిన, తరువాత వివేకానందుడు బోధించిన అద్వైతాన్ని నమ్ముకోవడమే హిందూ మతానికి రక్ష. సర్వం ఖల్విదం బ్రహ్మం, అహం బ్రహ్మస్మి అని అద్వైతం చెప్తుంది. విశ్వ మంతా బ్రహ్మం నిండి ఉంది, ఆ బ్రహ్మమే నాలోనూ ఉంది. అటువంటప్పుడు ఈ స్వామీజీలు, బాబాలు నాకెందుకు అని ప్రశ్నించ గలిగితే ఈ బాబాలు, స్వాముల గొడవ ఉండదు. అయితే మనం ప్రార్దించడానికి, ఏదైనా ఆపద వచ్చినప్పుడు వేడుకోవడానికి ఒక ఆధారం గానీ, సింబల్ గానీ కావాలి కదా అనుకొంటే, అందుకోసం మన వాళ్ళు ముగ్గురు ముఖ్య మైన దేవుళ్ళని త్రిముర్తులుగా, వీళ్ళు సరిపోరనుకొంటే మరో మూడు కోట్ల మంది చిన్నా చితకా దేవుళ్లనీ పుట్టించారు. వాళ్లతో పని పూర్తి చేసుకోవచ్చు. 


4 comments:

CHANDRA SEKHAR P said...

ITS REALLY TRUE WE MUST FOLLOW "ADVITA", WHICH WAS GIVEN TO US BY SRI SANKARA ACHARYA.

WE MOST OF THE PEOPLE ARE FORGETTING THE REAL GOD AND RUNNING BEHIND THE VIRTUAL GODS OR IMAGINARY GODS.

FINALLY PEOPLE MUST HAVE BELIEVE AND FAITH IN GOD WHO MAY NOT HAVE ANY AMBITION AND PHYSIC

durgeswara said...

ప్రస్తుతకాలానికి అదే శ్రేయోమార్గం.

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

Thank you Chandra Sekhar and Durga. Advaita is eternal and is applicable to any time and any people

Sree said...

guruvu garu, advaitaniki matrix ki emanna sambandham unda? nenu kooda matrix fan ni. anduke adugutunna. oorike pettara leka dani venuka emanna vishayam unda?