నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Tuesday, May 31, 2011

రెండు కోట్ల కుర్చీ, రెండున్నర కోట్ల దేవుడు, పదమూడు లక్షల బెల్టు


నైజాం నవాబు వేసుకునే దుస్తులని పెట్టుకునే వార్డ్‌రోబ్ శుభ్రం చేయడానికి ముగ్గురు మనుషులు ఉండేవారట. ఇక నవాబు గారి ఆభరణాలకు, ఇతల విలాస వస్తువులకు లెక్క కట్టాల్సి వస్తే పెద్ద పెద్ద ఆడిటింగ్ కంపెనీలు కావాల్సిందే. అదంతా అప్పటి విషయం ఇప్పుడు అంత వైభవం, విలాసం మెయిన్‌టెయిన్ చేయడం అయ్యేపని కాదు అని ఎవరయినా అనుకుంటే అది తప్పు అని కర్ణాటక పర్యాటక శాఖ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి నిరూపిస్తున్నారు.


  
ఇనుప ఖనిజపు గనులకు అధిపతి అయిన రెడ్డి గారు కూర్చునే బంగారు కుర్చీ ఖరీదు అక్షరాలా రెండు కోట్లా ఇరవై లక్షలు, ఆయన చేత పూజలందుకొనే దేవుడి ప్రతిమల ఖరీదు రెండున్నర కోట్లు, ఆయన ధరించే బెల్టు పదమూడు లక్షలు. ఇక ఆయనవీ, ఆయన సతీమణివీ ఆభరణాల లెక్కలు మూడు పేజీల నిండా ఉన్నాయి. ఇందులో బంగారు గాజులు, దండలు, విలువైన రాళ్లతో చేసిన ఆభరణాలు ఉన్నాయి. ఇక వెండి వస్తువులకయితే అంతే లేదు. అలాగే ఇంటినిండా ఉన్న ఖరీదైన ఏసీలు, టీవీలు, ఫర్నిచర్ అన్నీ కూడా లక్షల్లోనే విలువ చేస్తాయి.


అయితే బ్రూనై సుల్తాన్ లాగా గాలి గారి టయిలెట్ సీట్ కూడా బంగారుదేనా అన్న వివరం మాత్రం తెలియదు.

ఈ లెక్కలన్నీ ఆయనంటే పడని వాళ్ళో, కర్ణాటక గవర్నరో చెప్పినవి కాదు. స్వయానా శ్రీ గాలి గారు కర్ణాటక లోకాయుక్తకి దాఖలు చేసిన అఫిడవిట్‌లో ఆయన పొందుపరచిన వివరాలు. 


ఇనుముని బంగారం చేయడమంటే ఇదే కాబోలు.






         

ఏసీ బంగళా జైళ్ళు కావాలి మనకిప్పుడు


కనిమోళి తీహార్ జైలులో ఉన్న సెల్ గురించి చదివినప్పుడు నా హృదయం ద్రవించింది. ఆమె చేసింది చిన్నా చితకా స్కామా? వందల వేల కోట్ల రూపాయల స్కాము చేసిందే అన్న కనికరం కొంచెమైనా లేకుండా మామూలు ఖైదీలాగా పడేస్తారా? ఒక ఏసీ లేదు,ప్లాస్మా టీవీ లేదు, డబుల్ కాట్ బెడ్డు లేదు. కనీసం ఒక్కడైనా AK-47 పట్టుకున్న గన్ మ్యాన్ లేడు. వాక్సింగు, ఫేషియల్ చేయించుకోవడానికి జైలుకి అటాచ్డ్ బ్యూటీ పార్లర్ లేదు. ఎంత అన్యాయం, ఎంత అమానుషం.
 


కనిమోళి దుస్థితి చూశాక అయినా మన నాయకులు బుద్ధి తెచ్చుకోవాలి. ఎంతైనా నేటి నాయకులే రేపటి ఖైదీలు కాబట్టి అధికారంలో ఉన్నప్పుడే రేపు తాముండబోయే జైళ్ళని నిర్మించుకోవాలి. ప్రాచీన ఈజిప్టులో ఫారోలు తాము బతికున్నప్పుడే తమకి సమాధులుగా ఉండబోయే పిరమిడ్లని కట్టుకున్నట్లు వీళ్ళు కూడా మంచి మంచి సకల సౌకర్యాలున్న జైళ్ళని కట్టి పారేస్తే రేపెప్పుడైనా ఖర్మ కాలి తమ స్కాములు బయటపడి జైలు కెళ్ళాల్సిన అగత్యం కలిగితే ఇప్పుడు కనిమోళికి కలిగిన దుస్థితి కలగకుండా తప్పించుకోవచ్చు.
 


ఈ జైలులో సెల్లులు ఉండవు. ఒక్కో ఖైదీకి ఒక్కో సెంట్రలైజ్‌డ్ ఏసీ విల్లా ఉంటుంది. ప్రతి విల్లాలో బెడ్ రూమ్, కిచెన్, డైనింగ్ రూమ్ మొదలైన అన్ని సదుపాయాలూ ఉంటాయి. ప్రతి విల్లాకి ఒక వంటవాడు, పని వాళ్ళు ఉంటారు. విల్లాలలో ఉన్న ఖైదీలకోసం మినీ థియేటర్, క్లబ్, బ్యూటీ పార్లర్ మొదలయిన సదుపాయాలు ఉంటాయి. 


 
ఇలాంటి ఓ రెండో, మూడో వందలు కట్టి పడేస్తే ఏ దిగులూ లేకుండా మన నాయకులు స్కాములు చేసుకోవచ్చు. రేపెప్పుడైనా ఖర్మకాలి జైలుకెళ్ళాల్సిన పరిస్థితి వచ్చినా ఇంటికన్నా జైలు పదిలం అనుకుంటూ హ్యాపీగా వెళ్ళి కూర్చోవచ్చు.

Friday, May 27, 2011

జగన్ లోకేష్ మధ్య పోటీ గురించి ఆరు నెలల క్రితమే నేను రాశాను.


ఇప్పుడు చంద్రగిరి నుంచి నారా లోకేష్ రాజకీయ రంగ ప్రవేశం చేయనుండడంతో అందరూ జగన్ లోకేష్‌ల మధ్య పోటీ గురించి మాట్లాడుతున్నారు. ఈ విషయమై నేను గత నవంబరులోనే రాశాను. చూడండి.


Monday, November 22, 2010

సాక్షి కథనం-స్టూడియో-N కి ఇంధనం-అసలు కారణం జగన్ లోకేష్ ల మధ్య పోటీయా?

సాక్షి టీవీలో ప్రసారమైన హస్తం గతం కథనం సోనియా గాంధీలో కానీ ఆమె విధేయులలో కాని ఎంత రియాక్షన్ తెప్పించిందో తెలియదుకానీ స్టూడియో N లో మాత్రం చాలా స్టిములేషన్ తెప్పించింది. నిన్నా,మొన్నా ఆ చానల్ అదే పనిగా ఆ స్టోరీని రిపీట్ చేసి, దాని పైన వెల్లువెత్తిన నిరసనల్ని,ఖండనల్ని పదే పదే చూపించింది. ఒక వైపు బాక్స్ కట్టి సాక్షి కథనం తప్పు అన్న వాక్యం, దానికి ఇటు వైపు కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఫోటోలు మార్చి మార్చి చూపించింది.
 
స్టూడియో-N టీడీపీ చానల్ అని అందరికీ తెలుసు కాబట్టి జగన్ చానల్ ని దుమ్మెత్తి పోసింది అనుకొంటే, ఆ రియాక్షన్ వెనక కొచెం సోనియాని సమర్ధిస్తున్నట్లు, సానుభూతి చూపుతున్నట్టు కూడా అనిపించింది. దీని వెనక అసలు కారణం నా ఉద్ధేశ్యంలో జగన్ కి లోకేష్ (చంద్రబాబు తనయుడు, స్టూడియో-N కి సీఈఓ గా వ్యవహరిస్తున్నాడు)కి మధ్య ఉన్న peer pressure అయ్యుండవచ్చు.
 

చంద్రబాబు, వైఎస్సార్ ఎలా సమకాలీనులో, వాళ్ళ కొడుకులు కూడా అలాగే సమ వయస్కులు. జగన్ ఎప్పుడూ లైమ్ లైట్ లో ఉంటే లోకేష్ స్టాన్ ఫోర్డ్ లో చదువుకొంటూ గడిపేశాడు. మొన్నీ మధ్యనే బాలకృష్ణ కూతుర్ని పెళ్ళి చేసుకొని వార్తల్లో కొచ్చాడు. గత ఎన్నికలలో తెలుగుదేశానికి నగదు బదిలీ పథకం అనే ఆయుధాన్ని అందించింది లోకేషే. అది అనుకొన్నట్లుగా పని చేయలేదు. అది వేరే సంగతి.

చంద్ర బాబు మిగతా కుటుంబ సభ్యుల్ని రాజకీయాలకు దూరంగా పెట్టినట్లే కొడుకుని కూడా పార్టీకి, రాజకీయాలకు దూరంగా పెట్టాడు. మరో వైపు జగన్ తండ్రి వర్గాన్ని వైఎస్ బతికున్నపుడే మానేజ్ చేస్తూ, తనకంటూ బలమైన వ్యాపార, రాజకీయ సామ్రాజ్యాన్ని, సమాచార సామ్రాజ్యాన్ని నిర్మించుకొన్నాడు. ఇప్పుడిప్పుడే లోకేష్ తమ దగ్గరి బంధువులకి చెందిన(ఇందులో బాబుగారి పెట్టుబడి ఉందేమో నాకు తెలియదు) స్టూడియో-N చానల్ ని నిర్వహిస్తూ మీడియాలో అడుగు పెట్టాడు.


తరగతిలో ఇద్దరు విద్యార్ధుల మధ్య, ఒకే కుటుంబంలోని ఇద్దరు సమవయస్కుల మధ్యా పోటీ ఉన్నట్లు సహజంగానే జగన్ లోకేష్ ల మధ్య కూడా అంతర్లీనంగా పోటీ ఉండి ఉంటుంది. ఆ పోటీలో భాగమే ఆ మధ్య స్టూడియో-N లో వచ్చిన జగన్ రాజ ప్రాసాదాల కథనాలు అని నేననుకొంటున్నాను. ఇప్పుడు జగన్ ని దుమ్మెత్తి పోయడానికి స్టూడియో-N కి హస్తం గతం కథనం, దాని పైన వెల్లువెత్తిన నిరసనలు మరొక బంగారం లాంటి అవకాశాన్ని అందించాయి. దాన్ని లోకేష్ పూర్తిగా వాడుకొంటున్నాడు అని నా అభిప్రాయం. 


ఎవరైనా మానసిక విశ్లేషణా నిపుణులు దీన్ని మరింత లోతుగా పరిశీలించాల్సి ఉంది.  

రోల్స్ రాయ్స్ కార్లతో చెత్త ఎత్తించిన మొనగాళ్ళు


రోల్స్ రాయ్స్ కారంటే వైభవానికి, ఐశ్వర్యానికి చిహ్నం. ఆమధ్య చిరంజీవి పుట్టిన రోజుకి ఆయన తనయుడు రామ్ చరణ్ ఏడు కోట్ల రూపాయలతో ఒక కారు కొని బహుమతిగా ఇచ్చాడట. ఇప్పుడు మన రోడ్ల మీద అంతగా లేవు కానీ మనకి స్వాతంత్ర్యం రాకముందు సంస్థానాధీశుల దగ్గర ఈ విలాసవంతమైన కార్లు చాలానే ఉండేవి. కష్టపడకుండా డబ్బు వచ్చి చేరుతుంటే, చేయడానికి పనేమీ లేకుండా సోమరిపోతుల్లా తిని కూర్చుని వీళ్ళు ఈ ఖరీదైన కార్లని కొని తమ గ్యారేజీల్లో పెట్టేవారు. 


 
అయితే ఇంత ఖరీదైన కార్లని మునిసిపాలిటీ చెత్త మోయడానికి వాడారని తెలిస్తే నమ్మశక్యంగా ఉంటుందా? కానీ ఇది నిజం. కనీసం నలుగురు మహరాజాలు ఈ అత్యంత విలువైన కార్లని చెత్తమోయడానికి వినియోగించారు. వాళ్ళు అలా చేయడానికి కారణం రోల్స్ రాయ్స్ కంపెనీ మీద కోపం. కొవ్వుపట్టి కొట్టుకోవడం అనేది ఇంకో కారణమనుకోండి. అది వేరే విషయం. ఆ వివరాలు ఒకసారి చిత్తగించండి.


 
ఒకసారి అల్వార్‌కి చెందిన మహరాజా జయ సింగ్ లండన్ పర్యటనలో ఉన్నప్పుడు రోల్స్ రాయ్స్ షోరూమ్‌కి వెళ్ళారు ఒక కారు కొందామని. ఆయనని అక్కడ కొత్తగా చేరిన ఒక సేల్స్ మాన్ గుర్తు పట్తలేదు. రాజా వారి సెక్రెటరీ అన్ని వివరాలు అడిగి చివరగా ఆ కారు రేటు గురించి మాట్లాడబోతే ఇది మీలాంటి వాళ్ళు కొనే కారు కాదులే పోవయ్యా అని దురుసుగా సమాధానమిచ్చాడట. దానితో అగ్గిమీద గుగ్గిలమైన రాజావారు ఉన్నపళాన పది కార్లు కొని పారేసి, వాటిని భారత దేశానికి తరలించి, పైకప్పు ఊడబీకించి చెత్త సేకరించడానికి పెట్టాడు. కార్లమీద లోగో కానీ, రోల్స్ రాయ్స్ బోనెట్ పైన ఉండే spirit of ecstacy బొమ్మకానీ చివర వరకూ పోకుండా జాగ్రత్తగా ఆ కార్లతో చెత్త తోలించారు రాజావారు.


 
ఇలాంటిదే మరొక కథ పాటియాలా రాజావారిది. ఈయనతో లండన్ షోరూమ్‌లో ఉన్న ఒక సేల్స్ మ్యాన్ సరిగా ప్రవర్తించనందుకు ఆగ్రహించిన రాజావారు అక్కడ ఉన్న 50 కార్లు అప్పటికప్పుడు కొనేసి, తన సంస్థానానికి తరలించి చెత్త మోయడానికి పెట్టేశారు. ఇదే పాటియాలాకి చెందిన మరొక మహరాజు భూపీందర్ సింగ్ గారి కథ మరొకటుంది. ఈయన కడు విలాసజీవి, శృంగార పురుషుడు. రాజావారికి పది మంది భార్యలు, 200 మంది ఉంపుడుగత్తెలు ఉన్నారట అప్పట్లో. ఈయనంటే రోల్స్ రాయ్స్ కంపెనీవారికి ప్రత్యేక భక్తి శ్రద్ధలుండేవి. ఆ కంపెనీ వారు ఎప్పుడు కొత్త మోడల్ తయారు చేసినా అయ్యగారు నాలుగయిదు కొనిపారేసేవారట. ఒక సారి(1913 లో) కంపెనీ వారు కొత్త మోడల్ గురించి రాజావారికి తెలియజేస్తే, మొత్తమ్ ఎన్ని కార్లు చేశారు అనడిగారట. ఇరవై అని కంపెనీ ప్రతినిధి చెప్పాక, అన్నీ నాకే అమ్మండి అని హుకుం జారీ చేశారు సారు వారు. దానికి వాళ్ళు ఒప్పుకోలేదు. ముందుగా బుక్ చేసుకున్న వాళ్లు ఉన్నారు. కావాలంటే అవి కాకుండా ఎన్ని మిగిలితే అన్నీ మీకే ఇస్తాం అని వాళ్ళు చెప్పినా రాజావారు శాంతించలేదు. ఆగ్రహంతో  తన వద్ద అప్పటికే ఉన్న రోల్స్ రాయ్స్ కార్లన్నిటినీ చెత్త మోయడానికి పంపేశారు.


 
మరొకటి భరత్‌పూర్ రాజావారి కథ ఉంది. ఈయన ఎప్పుడు కొన్నా మూడేసి కార్లు కొనేవారట. అంచేత ఈ రాజావారిక్కూడా రోల్స్ రాయ్స్ కంపెనీవారు కడు ప్రాధాన్యత ఇస్తారు. ఒకసారి రాజా వారి గ్యారేజ్‌లో ఒక కారు చెడిపోయింది. దాన్ని రిపేరు చేయడానికి మెకానిక్కులని పంపడంలో కంపెనీ ఆలస్యం చేసిందని ఆగ్రహించిన రాజావారు తన వద్దనున్న రోల్స్ రాయ్స్ కార్లన్నిటినీ మునిసిపాలిటికి అప్పగించారు. ఆ కార్లు చెత్త సేకరిస్తుండగా ఫోటోలు తీసి ఒక పత్రిక ప్రచురించింది. దానితో అప్పటికి రోల్స్ రాయ్స్ కార్లు వాడుతున్న పెద్ద తలకాయలన్నీ, వైస్‌రాయ్‌తో సహా కంపెనీ వారిమీద ఒత్తిడి తెచ్చి అప్పటికప్పుడు మెకానిక్‌లని పంపేలా చేసి రాజావారిని శాంతింపజేశారు.


మహరాజాలనీ, రోల్స్ రాయ్స్ కార్లనీ తలచుకొన్నప్పుడు మరొక మూడు ముచ్చట్లు చెప్పుకోవాలి. పాటియాలా మహరాజా భూపిందర్ సింగ్ గారు తన వద్దనున్న కార్లలో ఒక దానికి వజ్రాలతో పొదిగిన డాష్‌బోర్డ్ పెట్టించారు. ఆ కారుని ఎప్పుడు సర్వీసుకి పంపినా దానికి కాపలాగా నలుగురు సైనికులుండేవారు. 


జామ్‌నగర్ సంస్థానానికి చెందిన మహరాజాగారు తను తన భార్యకి బహూకరించబోయే Phantom II కారుకి తన భార్య వాడే పింక్ రంగు చెప్పులకి సరిగ్గా మ్యాచ్ అయ్యే రంగు వేయాలని ఆ చెప్పులని ఇంగ్లాండులోని ఫ్యాక్టరీకి పంపారట. 
 
ట్రావంకూర్ సంస్థానానికి చెందిన మహరాణీ సేతు పార్వతీబాయి తన 20/30 sedanలో ప్రయాణించేటప్పుడు ఆమెకాళ్ల దగ్గర ఒక చిన్న స్టూలు మీద ఒక మరుగుజ్జు కూర్చుని బయటవాళ్ళకి కనిపించకుండా ఆమె కాళ్ళు పిసుకుతూ ఉంటాడట.
 
PS: ముడ్డి మనది కాకపోతే ఢిల్లీ దాకా దేకమన్నాడట. అలాగే ఈ మహరాజులు, మహరాణులు ప్రజల డబ్బుతో, బ్రిటిషోడు ఇచ్చే రక్షణతో పనీ పాటా లేకుండా సోంబేరి బతుకు బతికినందువలన ఇన్ని వేషాలు వేయగలిగారు. టైటిల్‌లో మొనగాళ్ళు అని ఉన్నందువలన ఈ పిచ్చి నాయాళ్ళని హీరోలుగా చూపించే ప్రయత్నం చేస్తున్నానని అనుకోవద్దని మనవి.

జయలలితాంబ నమో నమః


తమిళనాట గద్దె నెక్కగానే జయలలిత ఒక మహిళ స్థాయిని దాటి దేవత లెవల్‌కి ఎదిగిపోయింది. ఆమె ముందు చెప్పులు వేసుకోవడం అపరాధమని ఆమె మంత్రివర్గంలోని ఒక ప్రబుద్ధుడు ఆమె ఉన్నచోట చెప్పుల్లేకుండా నడుస్తున్నాడట. 


 
అతి త్వరలో అతి భక్తికీ, మూఢ భక్తికీ పేరెన్నికగన్న మన్ తమిళ తంబిలు జయమ్మకి శాశ్వత దేవత హోదా కట్టబెట్టినా ఆశ్చర్యం లేదు.

రికార్డింగ్ డాన్సులా, బాడ్మింటన్ ఆటలా??


జూన్ 1 నుంచి మహిళా బాడ్మింటన్ ప్లేయర్లు విధిగా స్కర్టులు ధరించి మాత్రమే కోర్టులోకి దిగాలని ప్రపంచ బాడ్మింటన్ ఫెడరేషన్ ఒక నిబంధన పెట్టింది. ఈ రూల్ ఎందుకయ్యా అంటే మహిళల బాడ్మింటన్‌ని మరింత ఆకర్షణీయంగా చేసి మరింత ఎక్కువ స్పాన్సర్‌షిప్ రాబట్టడానికట. Badminton World Federation ఉపాధ్యక్షుడు పైసాన్ రంగసికితిపో దృష్టిలో మహిళా క్రీడాకారిణులు పొట్టి స్కర్టులు వేసుకుని ఆడితే, ఆటకి మరింత ఆదరణ లభించడంతో బాటు స్పాన్సర్షిప్‌ల రూపంలో మరింత ఆదాయం వస్తుంది కాబట్టి కురచ స్కర్టులు వేసుకుని ఆడడం తప్పనిసరి అట.


  
స్కర్టుల సైజుకీ డబ్బుకీ ముడి పెట్టడం చూస్తుంటే నాకు చిలకలూరిపేట రికార్డింగు డాన్సు ట్రూపులు గుర్తుకొస్తున్నాయి. వాళ్ళకి డాన్సు చేసే సమయంలో వాళ్ళు వేసుకొనే గుడ్డల సైజు బట్టి పేమెంటు ఉంటుంది. చీర, జాకెట్టుతో డాన్సు చేసినప్పటికన్నా లంగా జాకెట్టుతో చేస్తే ఎక్కువ ఇస్తారు. అవి కూడా విప్పేసి డ్రాయరు, బ్రాతో డాన్సాడితే మరింత ఎక్కువ ఇచ్చుకోవలసి ఉంటుంది. అక్కడక్కడా అవి కూడా విప్పేసి చేసే డాన్సులు కూడా ఉంటాయట. వాటికి ఇంకా ఎక్కువ ఫీజు ఉంటుంది. ఇదే పద్ధతిలో ప్లేయర్లు మ్యాచ్‌లో గెలిచారా లేదా అని కాకుండా వాళ్ళు ఎంత పొట్టి గుడ్డలతో ఆడితే అంత ఎక్కువ డబ్బు అని కొత్త రూల్సు వస్తాయేమో?!





 
ఎంత పొట్టి గుడ్డలేసుకొని ఆడినా ఆడేవాళ్లలో అందం లేకపోతే చూడ్డానికి బావుండదు. అందుకని ప్రతి టూర్నమెంటులో కొంతమంది మాంచి కసక్కనిపించే మోడల్సుని కూడ రంగంలోకి దించి వాళ్లకి పాంటీలు, బ్రాలు వేయించి ఆడిస్తే ప్రేక్షకులు విరగబడి చూస్తారేమో అధికారులు అలోచించాలి. వీళ్ళకి ఆటలో గెలుపు ఓటములతో నిమిత్తం లేకుండా అప్పియరెన్సు మనీ అని కొంత ముట్టచెబితే సరిపోతుంది.


 
అయినా లింగ వివక్షత లేకుండా ఆడ ప్రేక్షకులని ఆకర్షించడం కోసం మగ ఆటగాళ్ళకి కూడా చొక్కాలు విప్పి కేవలం డ్రాయర్లతో ఆడిస్తే ఆడియెన్స్ పెరిగే అవకసం ఉంటుందేమో అదీ అలోచించాలి మరి.

Tuesday, May 24, 2011

ఆమె వక్షోజాలు నెలకి అంగుళం చొప్పున పెరుగుతుంటాయట.


మనుషులలో ఎదుగుదల అన్నది ఒక వయసు వరకే ఉంటుంది. ఆ తరువాత వంటి బయట వెంట్రుకలు, వంటి లోపల కొవ్వు తప్ప మరేదీ పెరగదు. అందుకే మీ పిల్లలకి చిన్నప్పుడే కాంప్లాన్ తాగించండి అని ఆ కంపెనీ వాళ్ళు టీవీ ప్రకటనలు గుప్పిస్తూ ఉంటారు.
 
అమ్మాయిలకి వక్షాలు కూడా ఒక సైజు కన్నా తక్కువ ఉంటే వాటిని పెంచడానికి నానా రకాల ఆపరేషన్లు ఉన్నాయి. ముఖ్యంగా సినిమాలు లాంటి రంగాలలో ఉన్న వారికి ఈ ఆపరేషన్ ఒక వరం లాటిది. దీని సాయంతోనే బే వాచ్ సుందరి పమేలా ఆండర్సన్ అంత పాపులరయింది. ఆ మధ్య మన దేశంలో బిగ్ బాస్ షోలో కూడా పాల్గొన్నది ఈ చిన్నది. అవి చిన్నవిగా ఉన్నందుకే తమకి తగిన అవకాశాలు రావడంలేదని కమలినీ ముఖర్జీ, విద్యా బాలన్‌లు కూడా Breast Augmentation వైపు మొగ్గు చూపారని సమాచారం. 
 
భారత జట్టు క్రికెట్ ప్రపంచ కప్పు గెలిస్తే అన్నీ విప్పి చూపింఛాలని ఉబలాటపడ్డ పూనమ్ పాండే face book పేజీ కానీ, ఆమె ట్విట్టర్ పేజీ కానీ చూస్తే పూనమ్ నీవి చిన్నవిగా ఉన్నాయి. ఆపరేషన్ చేసుకుని పెంచుకో, అద్భుతంగా ఉంటావు అన్న కామెంట్లు పుష్కలంగా ఉంటాయి.
 
కానీ ఏమి చేసినా ఆ పెరుగుదల ఒక స్థాయి వరకే, అంతకు మించి పెరగాలంటే మళ్ళీ ఏ ఆపరేషనో చేసుకోవాల్సిందే. కానీ అమెరికాలో, మిన్నెసోటాలోని చెల్సీ చార్మ్స్ అనే చిన్నదానికి ఆపరేషన్ చేసుకున్నాక ఆమె రెండు వక్షాలు క్రమేపి పెరగడం మొదలు పెట్టి ఆ పెరుగుదల ఆగిపోకుండా నెలకో అంగుళం చొప్పున పెరుగుతూనే ఉన్నాయట. అయితే ఈమె నటించేది బూతు సినిమాలలో కాబట్టి అవి అలా పెరుగుతూనే ఉన్నా ఈమెకి ఇబ్బంది ఏమీ లేదు. హాలీవుడ్ హీరోయిన్లలో అధిక భాగం మందికి అవి చిన్నవిగానే ఉంటాయి. అందుకనే దేవానంద్ తన గైడ్ సినిమాకి హీరోయిన్‌గా ముందు వైజయంతి మాలని అనుకొని, ఆ సినిమా ఇంగ్లీషు వెర్షన్ కూడా ఉండడంతో, పెద్ద బ్రెస్ట్ ఉన్న వైజయంతి మాల కన్నా చిన్నవి ఉన్న వహీదా రెహ్మాన్‌ని ఎంచుకున్నాడు.


ఈ చార్మ్స్ చిన్నది మూడు సార్లు తన రొమ్ములని పెంచే ఆపరేషన్ చేయించుకొన్నదట. మొదటిసారి ఆమె కప్ సైజు DD కి పెరిగి, రెండవసారి HH కి చేరింది. మూడో సారి ఆపరేషన్ అయ్యాక వాటిని కొలవడానికి సైజ్ చార్ట్స్ సరిపోవడం లేదట.
 
మొదటి రెండు ఆపరేషన్‌లలో సెలైన్ ఎక్కించి రొమ్ములని పెద్దవి చేస్తే, మూడవసారి పాలీప్రొపిలీన్ వాడారట. ఆమెకి ఆ మెటీరియల్ వలన రియాక్షన్ వచ్చి, దానితో లోపల నీరు చేరడం. ఆ నీటిని ఈ పాలీప్రొపిలీన్ గ్రహించి మరింత ఉబ్బడం, దానితో మరింత నీరు చేరడం, మరింత ఉబ్బడం ఇలా ఒక గొలుసు చర్య(chain reaction) మొదలయ్యి, ఆమె వక్షోజాలు నెలకి ఒక అంగుళం చొప్పున పెరుగుతూనే ఉన్నాయట. చాతీకి ముందువైపు ఇలా బరువైన సంపద ఉన్నందువల్ల, వీపునొప్పి మొదలయిందట పాపం ఈ సుందరికి. క్రమబద్ధంగా వ్యాయామం చేస్తూ ఆ నొప్పిని అదుపు చేస్తూందట మన చెల్సీ చార్మ్స్.




వీటి అందాన్ని గుర్తించి అతి పెద్ద వక్షోజాలు అని గిన్నీసు బుక్కు వాళ్ళు రికార్డులక్కూడా ఎక్కించారట. మార్క్ క్విన్ అనే బ్రిటీషు కళాకారుడు ఈమె లైఫ్ సైజు శిల్పాన్ని చెక్కి తన గ్యాలరీలో ప్రదర్శిస్తున్నాడట. 


పోయిన వారం ITV అనే ఒక టెలివిజన్ చానల్ వాళ్ళు ఈమెతో ఇంటర్వ్యూ చూపించారు. This morning show అన్న ఆ షోలో యాంకర్‌గా ఫిలిప్ షోఫీల్డ్ అన్న ఒక వెర్రి గాడు, సెట్‌లోకి పుచ్చ పండ్లు తీసుకొచ్చి వాటిని, మన చార్మ్స్ వక్షాలను పోల్చి చూసి, ప్రేక్షకులతో తిట్లు తిన్నాడు. ఇది మార్నింగ్ షో అనుకున్నావా, లేట్ నైట్ షో అనుకున్నావా వెధవా అని ప్రేక్షకులు ఫోన్ చేసి మరీ చీవాట్లేశారు.
 
అంతలేసి అందాలను మోయటం భారమైపోయి, ఇప్పుడు పాప మళ్ళీ వాటిని తగ్గించుకోవడానికిమళ్ళీ ఆపరేషన్‌కి సిద్ధపడుతూందట. సహజంగా వచ్చిన వాటితో తృప్తి చెందక కృత్రిమంగా సంపాదించుకున్న వాటితో ఇలాంటి తలనొప్పులు కూడా ఉంటాయని ఈ అమ్మడి భాగోతం తెలియజేస్తూంది.

నాస్తికులే శృంగారాన్ని బాగా ఆనందిస్తారా?


అస్తీ, అంతస్తుల తేడాల్లేకుండా, చివరికి పశువులూ, పక్షులు సైతం ఆనందించే సెక్సులో సుఖాన్ని అనుభవించడంలో ఆస్తిక, నాస్తిక తారతమ్యాలున్నాయంటున్నారు నిపుణులు. శృంగారంలోని మజాని ఆస్తికుల కన్నా నాస్తికులే బాగా ఎంజాయ్ చేస్తారని ఇటీవల నిర్వహించిన ఒక సర్వేలో వెల్లడయింది. 


  
కాన్సాస్ యూనివర్సిటీ డాక్టర్లు 14,500 మందిలో నిర్వహించిన ఒక సర్వేలో వెల్లడైన నిజం ఇది. దైవ భక్తి ఎంత ఎక్కువగా ఉంటే వారిలో శృంగారం కలిగించే ఆనందం అంత తక్కువగా ఉంటుందని ఈ సర్వే వెల్లడి చేసింది. ఆ పనిలో ఉన్నప్పుడు, పనయిన తరువాత భక్తులలో ఒక అపరాధ భావన వారికి తెలియకుండానే ఉంటుందని, దాని వలన వీరిలో కలిగే ఆనందం తక్కువగా ఉంటుందని వీళ్ళు తేల్చారు.

అయితే మిగిలిన విషయాలలో, అంటే వారానికి ఎన్ని సార్లు శృంగారంలో పాల్గొంటారు అన్న దానిలో కానీ, హస్త ప్రయోగం, ఓరల్ సెక్స్, వివాహేతర సంబంధాలు మొదలయిన వాటిలో పెద్దగా తేడా ఏమో కనిపించక పోయినా sexual guilt మాత్రం దైవ భక్తి ఎక్కువగా ఉన్న వారిలో ఎక్కువగా ఉంటుందని ఈ సర్వేలో తేల్చారు.
 
అయితే ఈ సర్వే అంతా వాళ్ళు క్రిస్టియానిటీలోని రకరకాల తెగలపైన చేసింది. హిందూ మతంలో అన్ని విధులతో పాటు పెళ్ళయాక గృహస్థాశ్రమం కూడా ఒక   విధిగా చెప్తారు కాబట్టి పెళ్ళాంతో శృంగారం అన్నదాన్ని అపరాధ భావన కలిగించే పనిగా చూడరు కాబట్టి హిందూ మతస్తులు  ఈ సర్వేని పట్తించుకోవలసిన అవసరం లేదేమో.

Thursday, May 19, 2011

బూతు చిత్ర కథానాయకుడిగా ఒసామా బిన్ లాడెన్


ఒసామా బిన్ లాడెన్‌ని చంపి ఆ శవాన్ని సముద్రంలో పడేసినా లాడెన్‌ని అమెరికన్లు ఇంకా మర్చి పోలేదు. లాడెన్‌పై అమెరికన్లకున్న క్రేజ్‌ని క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు లాడెన్ హీరోగా ఓ సినిమా నిర్మిస్తున్నారు. ఇదేదో హాలీవుడ్ వాళ్ళు నిర్మించే చిత్రమని, అందులో లాడెన్‌ని టెర్రరిస్టుగా చూపిస్తారని అనుకొంటే పొరబాటే. ఈ సినిమాని తీస్తున్నది హజ్లర్(HUSTLER) అనే ఓ బూతు సాహిత్య సంస్థ. అందులో లాడెన్‌ని బూతు చిత్ర నాయకుడిగా చూపించబోతున్నారు.
 


Hustler అనేది అమెరికాలో ఓ బూతు పత్రిక. అయిదు లక్షల సర్క్యులేషన్ ఉన్న ఈ పత్రిక ప్లేబాయ్, పెంట్ హౌస్‍ల తరహా పత్రికె అయినా అవి క్లాస్ అయితే ఇది మాస్ పత్రిక. అవి బాల్కనీ ప్రేక్షకుల కోసం అయితే ఇది నేల క్లాసు కోసం.


 
Navy SEALS  దాడిలో లాడెన్ ఇంట్లో కంప్యూటర్ డిస్కులూ, పత్రాలు మొదలయిన వాటితో బాటు న్యాచులర్ వయాగ్రా మాత్రలూ బూతు పత్రికలూ, బూతు చిత్రాల తాలూకూ డీవీడీలు కూడా దొరికాయి. ఆ పత్రికలు, డీవీడీలు ఈ Hustler సంస్థ ప్రచురించినవీ, చిత్రించినవీ. దానితో తమ ఉత్పత్తులంటే ఎంతగానొ ఇష్టపడే ఒసామా బిన్ లాడెన్‌ని హీరోగా పెట్టి ఓ XXX బూతు చిత్రాన్ని నిర్మించాలని ఈ సంస్థ వాళ్ళు తలపెట్టారు. ఈ సంవత్సరం ఆఖరులొ మార్కెట్లో రిలీజవబోయే ఈ చిత్రంలో లాడెన్‌ రూపురేఖలతో ఉన్న వ్యక్తి హీరోగా ఉంటాడనీ, అలాంటి వ్యక్తిని ఎన్నుకోవడం కూడా పూర్తయిందనీ వాళ్ళు చెప్పారు.



ఒసామా బిన్ లాడెన్ అమెరికా అమ్మాయిలపైన స్వారీ చేస్తూ శృంగారం చేస్తూ ఉంటే ఆల్ ఖైదా వాళ్ళు గానీ, అరబ్ ప్రపంచం గానీ పెద్దగా అభ్యంతరాలేవీ వ్యక్తం చేయరని Hustler ధీమా కాబోలు.

Wednesday, May 18, 2011

ఒసామా బిన్ లాడెన్‌ని చంపిన ఆపరేషన్‌ని తలదన్నే ఆపరేషన్ ఎంటెబ్బీ


ఈ నెల రెండవ తేధీన పక్కనున్న ఆఫ్ఘనీస్థాన్ నుంచి బయలుదేరి పాకిస్తాన్ సైన్యానికి గానీ, రక్షణ వ్యవస్థకు గానీ అనుమానం రాకుండా ఆ దేశంలో ప్రవేశించి వాళ్ల డిఫెన్స్ అకాడెమీకి అతి సమీపంలో ఒక బిల్డింగ్‌లో తలదాచుకున్న ఒసామా బిన్ లాడెన్‌ని మట్టుబెట్టిన US Navy SEALS సాహసవంతమైన ఆపరేషన్‌ని చూసి అందరం ముక్కున వేలేసుకుని, ముక్త కంఠంతో "శభాష్" అన్నాం. అయితే 35 సంవత్సరాల క్రితమే ఇజ్రాయెల్ కమాండోలు హైజాక్‌కు గురయి ఒక శతృ దేశంలోకి తీసుకు వెళ్ళబడి అక్కడ ఉన్న తమ విమానాన్ని, ప్రయాణికుల్ని క్షేమంగా తమ దేశానికి తీసుకెళ్తూ, హైజాకర్లనీ, వాళ్ళకు మద్ధతుగా తమ మీద దాడి చేసిన ఆ శతృ దేశ సైనికులనీ మట్టుబెట్టిన వీరోచిత గాధ ఆపరేషన్ ఎంటెబ్బీ గురించి ఒక సారి గుర్తు చేసుకోవడం అవసరమని భావించి ఈ పోస్టు పెడుతున్నాను.




ఓపికగా రాస్తే ఈ ఆపరేషన్ గురించి ఒక పెద్ద నవలే రాయవచ్చు. అంచేత టూకీగా రాస్తున్నాను. ఆసక్తి ఉన్నవాళ్ళు గూగుల్‌లో వెదికితే కావలసినంత మెటీరియల్ దొరుకుతుంది.

జూన్ 27,1976 ఉదయాన్న ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్ నుండి పారిస్‌కు బయలుదేరిన ఒక ఎయిర్ ఫ్రాన్స్ విమానాన్ని అది బయలుదేరిన కాస్సేపటికే  నలుగురు పాలస్తానీయులు హైజాక్ చేసి, దారి మల్లించి, ఉగాండా రాజధాని కంపాలాకు సమీపంలోనున్న ఎంటెబ్బీ  విమానాశ్రయంలో దింపుతారు. అక్కడ మరో నలుగురు ఉగ్రవాదులు వీరికి తోడవుతారు. ఈ హైజాక్ టీమ్‌కి ఉగాండా అధ్యక్షుడు, నరరూప రాక్షసుడిగా పేరు గాంచిన ఇడీ అమీన్ ఆశీస్సులు ఉన్నాయన్న విషయం  జగద్విదితం.

విమానంలో ఉన్న 248 మంది ప్రయాణీకులలో నుండి యూదుల్ని, యూదులు కాని వారిని విడదీసి యూదులు కాని వారిని ఒక విమానంలో ఎక్కించి పంపేస్తారు. అయితే విమానం కెప్టెన్ మాత్రం తను ప్రయాణీకులందరికీ బాధ్యుడిని అని, అందర్నీ వదిలిపెట్టే వరకూ వారితోనే ఉంటానని బందీగా ఉండిపోతాడు. మిగతా సిబ్బందిలో అధికులు తమ కెప్టెన్‌తోనే ఉండిపోతారు. మొత్తం 105 మందిని బందీలుగా ఉంచుకుని హైజాకర్లు ఇజ్రయెల్ ప్రభుత్వానికి అల్టిమేటమ్ జారీ చేస్తారు. ఇజ్రాయెల్ జైళ్ళలో ఉన్న 40 మంది ఖైదీలని, కెన్యా, జర్మనీ, స్విట్జర్లాండ్ జైళ్ళలో ఉన్న మరొక 13 మందినీ విడుదల చేయాలి అన్నది వాళ్ళ డిమాండ్. లేదంటే బందీలనందరినీ చంపేస్తామని అల్టిమేటమ్ జారీ చేస్తారు.

ఇజ్రాయెల్ ప్రభుత్వం ఈ సమస్యని దౌత్యపరంగా పరిష్కరించడానికి అన్ని మార్గాలు వెతికింది. అప్పట్లో ఈజిప్టుకి అధ్యక్షుడిగా ఉన్న అన్వర్ సాదత్ ద్వారా ఇడీ అమీన్‌ని అప్రోచ్ అయింది. మరొక వైపు అమెరికా కూడా తన ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఫలితంగా జులై 4 వరకూ డెడ్ లైన్ దొరికింది గానీ హైజాకర్లు తమ డిమాండ్ మార్చుకోలేదు.

జులై 3 న ఇజ్రాయెల్ కేబినెట్ రెస్క్యూ మిషన్‌కి, Israel Defence Force (IDF) కి అనుమతి మంజూరు చేసింది. అప్పటికే ఇజ్రాయెల్ గూఢచారి సంస్థ ఎంటెబ్బీ విమానాశ్రయాన్ని నిర్మించిన సంస్థ నుండి బ్లూ ప్రింట్ సంపాదించి, ఒక మోడల్‌ని నిర్మించింది. హైజాకర్లు వదిలి పెట్టిన ప్రయాణీకులనుండి హైజాకర్లకు సంబంధించిన సమాచారాన్ని సేకరించింది. వారిలో మిలిటరీ ట్రైనింగ్ ఉన్న ఒక వ్యక్తి హైజాకర్ల గురించి, వారి వద్దనున్న ఆయుధాలగురించి పూర్తి సమాచారమందించాడు.ఆపరేషన్‌లో పాల్గొనే టీమ్ విమానాశ్రయం మోడల్‌లో తమ అస్సాల్ట్‌ని ప్రాక్టీసు చేసి మిషన్‌కి సిద్ధమయ్యారు.  ఆపరేషన్ థండర్‌స్టార్మ్ అని కోడ్‌నేమ్ పెట్టారు ఈ మిషన్‌కి.

మొత్తం నాలుగు పెద్ద C-130 విమానాలలో కమాండో టీమ్, వాళ్ళకి శత్రు సైనికుల నుండి ఆటంకం కలిగితే వాళ్ళతో పోరాడడానికి ఒక సైనిక దళం, వాళ్ళకి అవసరమైన వాహనాలతో బయలుదేరాయి. ఈ విమానాలననుసరించి మరో రెండు బోయింగ్ విమానాలు వెళ్ళాయి. ఒక దానిలో మెడికల్ టీమ్ ఉంది. మరొక విమానం కింద ఆపరేషన్ జరిగినంత సేపు విమానాశ్రయం మీద చక్కర్లు కొడుతూ కింద జరుగుతూ ఉన్న ఆపరేష‌న్‌కి కాపలా కాసింది..

ఈజిప్టు, నైరోబి,కెన్యా,సోమాలియా, ఇథియోపియాల మీదుగా తక్కువ ఎత్తులో ఎగరడం ద్వారా వాళ్ళ రాడార్లకి అందకుండా రాత్రి 11 గంటల సమయంలో ఎంటెబ్బీని చేరుకుంది ఈ దాడి బృందం.

Rescue Operation

విమానం లాండయ్యే సమయానికే దాని కార్గో బే తెరిచి అందులోంచి అచ్చు ఇడీ అమీన్ వాడే నలుపు రంగు మెర్సిడెస్ బెంజ్ ఒకటి, అతని కేన్వాయ్‌లో ఉండే వాహనాలని పోలిన మరో రెండు వాహనాలలో ఇజ్రాయెల్ కమాండోలు విమానాశ్రయం టెర్మినల్ వైపు దూసుకెళ్ళారు. ఆ సమయానికి అమీన్ విదేశీ పర్యటనలో ఉండడంతో, స్వయానా ఇడీ అమీనే విమానం దిగి వెళ్తున్నాడని విమానాశ్రయంలో సెక్యూరిటీ గార్డులు భావిస్తారని ఇజ్రాయెలీల అంచనా. అయితే అంతకు కొన్నాళ్ళ క్రితమే నలుపు బెంజ్ స్థానంలో తెల్ల బెంజ్ కొన్నాడు. వీళ్ళ నల్ల బెంజ్‌ని ఇద్దరు గార్డులు ఆపడంతో వాళ్ళిద్దరినీ సైలెన్సర్ బిగించిన తుపాకులతో కాల్చారు. అయితే వాళ్ళు కింద పడ్డారే గానీ చావలేదు. అది గమనించిన వెనక వాహనంలో వచ్చే కమాండో ఒకడు తన అటోమేటిక్ తుపాకితో వాళ్ళిద్దరినీ కాల్చి చంపాడు. ఆ చప్పుడుకి హైజాకర్లు అలర్టవుతారేమోనని భావించిన కమాండోలు వేగంగా టెర్మినల్ వైపు దూసుకెళ్ళారు.

లోపలికెళ్ళడానికి ఎలాంటి ఆటంకం ఎదురవలేదు. మధ్యలో ఉన్న హాలులో బందీలందరూ కూర్చుని ఉన్నారు. వాళ్ళకి కాపలాగా నలుగురు హైజాకర్లు ఉన్నారు. ఇలాంటి ఆపరేషన్‌ని ఊహించకపోవడంతో వాళ్ళు చాలా రిలాక్స్‌డ్‌గా ఉండడం కమాండోలకు బాగా కలిసి వచ్చింది. లోపలికి వెళ్ళగానే, "ఎవరూ పైకి లేవద్దు. అందరూ కూర్చోండి. మేము ఇజ్రయెలీ సైనికులం" అని మెగాఫోన్‌లో ఒక కమాండో హీబ్రూ అరిచాడు. ఏం జరుగుతుందో తెలిసే లోపలే ఇద్దరు హైజాకర్లని మట్టుబెట్టారు. ఇలోగా మిగతా ఇద్దరు హైజాకర్లు అలర్టయి ఎదురు కాల్పులు జరిపారు.

ఈ సంఘటనలో కన్ఫ్యూజయి ఒక వ్యక్తి పైకి లేవడంతో, అతన్ని హైజాకర్‌గా భావించి కమాండోలు కాల్చి చంపారు. కాల్పులు ఎదురు కాల్పులలో మరో ఇద్దరు బందీలు మరణించారు. మిగిలిన ఇద్దరు హైజాకర్లని కూడా చంపాక, " మిగిలిన వాళ్ళెక్కడ?" అని బందీల నడిగాడు ఒజ కమాండో. బందీలు లోపలి గది వైపు చూపించడంతో ఆ గది తలుపులు తెరిచి లోపలికి గ్రనేడ్లు విసిరారు. బయటకి పరుగెత్తుకొచ్చిన మిగిలిన హైజాకర్లని కాల్చి చంపడంతో ఒక ఘట్టం పూర్తయింది.

బందీలని అందర్నీ బయటకి నడిపించి విమానాలలోకి ఎక్కించారు. అప్పటికి జరుగుతున్న సంగతి పసిగట్టిన విమానాశ్రయ సిబ్బంది కాల్పులు జరపడంతో బయట అలాంటి పరిస్థితి ఎదురవచ్చని వేచి చూస్తున్న ఒక బృందం వారి మీదకి కాల్పులు జరిపి వారిని అంతం చేసింది. ఈలోగా మరొక బృందం విమానాశ్రయంలో ఉన్న ఉగాండాకి చెందిన మిగ్ విమానాలని ధ్వంసం చేసి, మిగిలిన రన్‌వేల పైన బాంబులు వేసి నాశనం చేసి, తమ విమానాలని అవి వెంబడించే అవకాశం లేకుండా చేసింది.

క్షణాలలో బందీలందర్నీ విమానాలలో ఎక్కించారు. ఉగాండా సైనికుల కాల్పులలో కమాండో బృందానికి నాయకత్వం వహిస్తున్న యోనాధన్ నెతన్యాహు మరణించాడు. అతని మృత దేహాన్ని కూడా విమానంలో ఎక్కించి ఇజ్రాయెల్ విమానాలు గాల్లోకి లేచాయి. ఈ విమానాలు గాల్లోకి ఎగరగానే వాటి వెంట వచ్చిన యుద్ధ విమానాలు మరొక రౌండు బాంబులేసి విమానాశ్రయాన్ని నేలమట్టం చేశాయి. వచ్చిన దారిలోనే, మధ్యలో ఎలాంటి ఆటంకం లేకుండా టెల్ అవీవ్ చేరుకోవడంతో మిషన్ పూర్తయింది.

ఈ మిషన్ జరగడానికి ముందు బందీలలో ఒక మహిళ అనారోగ్యానికి గురవడంతో ఆమెని ఒక స్థానిక ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. దానితో ఆపరేషన్ పూర్తయినా ఆమె ఉగాండాలో ఉండిపోవల్సి వచ్చింది. ఆపరేషన్ వివరాలు తెలిశాక అగ్గి మీద గుగ్గిలమైన ఈడీ అమీన్ ఆదేశాల మేరకు ఉగాండా పోలీసులు ఆమెని కాల్చి చంపారు.

ఈ ఆపరేషన్‌లో కమాండో బృందానికి నాయకత్వం వహించి, ఆ పనిలో మరణించిన యోనాధన్ నెతన్యాహు సోదరుడు బెంజమిన్ నెతన్యాహు తరువాత ఇజ్రాయెల్ ప్రధాని అయ్యాడు.

ఊహించినట్లుగానే అరబ్ ప్రపంచం, సోవియట్ రష్యాలు ఈ ఆపరేషన్ ఉగాండా సార్వభౌత్వాన్ని ఉల్లంఘించడం అని ఖండిస్తే, అమెరికా తదితర పాశ్చాత్య దేశాలు సమర్ధించాయి.

ఈ ఆపరేషన్ గురించి చదివినప్పుడల్లా హైజాక్ చేసి ఖాందహార్‌లో దింపబడ్డ మన విమానం, దాన్ని విడిపించడానికి ఉగ్రవాదులని సగౌరవంగా ఒక విమానంలో తీసుకెళ్ళి విడిచిపెట్టిన జశ్వంత్ సింగూ అలా విడిపించమని నిrణయం తీసుకున్న ఉక్కు మనిషి అద్వానీ గుర్తుకొస్తారు.