నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Friday, May 27, 2011

రికార్డింగ్ డాన్సులా, బాడ్మింటన్ ఆటలా??


జూన్ 1 నుంచి మహిళా బాడ్మింటన్ ప్లేయర్లు విధిగా స్కర్టులు ధరించి మాత్రమే కోర్టులోకి దిగాలని ప్రపంచ బాడ్మింటన్ ఫెడరేషన్ ఒక నిబంధన పెట్టింది. ఈ రూల్ ఎందుకయ్యా అంటే మహిళల బాడ్మింటన్‌ని మరింత ఆకర్షణీయంగా చేసి మరింత ఎక్కువ స్పాన్సర్‌షిప్ రాబట్టడానికట. Badminton World Federation ఉపాధ్యక్షుడు పైసాన్ రంగసికితిపో దృష్టిలో మహిళా క్రీడాకారిణులు పొట్టి స్కర్టులు వేసుకుని ఆడితే, ఆటకి మరింత ఆదరణ లభించడంతో బాటు స్పాన్సర్షిప్‌ల రూపంలో మరింత ఆదాయం వస్తుంది కాబట్టి కురచ స్కర్టులు వేసుకుని ఆడడం తప్పనిసరి అట.


  
స్కర్టుల సైజుకీ డబ్బుకీ ముడి పెట్టడం చూస్తుంటే నాకు చిలకలూరిపేట రికార్డింగు డాన్సు ట్రూపులు గుర్తుకొస్తున్నాయి. వాళ్ళకి డాన్సు చేసే సమయంలో వాళ్ళు వేసుకొనే గుడ్డల సైజు బట్టి పేమెంటు ఉంటుంది. చీర, జాకెట్టుతో డాన్సు చేసినప్పటికన్నా లంగా జాకెట్టుతో చేస్తే ఎక్కువ ఇస్తారు. అవి కూడా విప్పేసి డ్రాయరు, బ్రాతో డాన్సాడితే మరింత ఎక్కువ ఇచ్చుకోవలసి ఉంటుంది. అక్కడక్కడా అవి కూడా విప్పేసి చేసే డాన్సులు కూడా ఉంటాయట. వాటికి ఇంకా ఎక్కువ ఫీజు ఉంటుంది. ఇదే పద్ధతిలో ప్లేయర్లు మ్యాచ్‌లో గెలిచారా లేదా అని కాకుండా వాళ్ళు ఎంత పొట్టి గుడ్డలతో ఆడితే అంత ఎక్కువ డబ్బు అని కొత్త రూల్సు వస్తాయేమో?!

 
ఎంత పొట్టి గుడ్డలేసుకొని ఆడినా ఆడేవాళ్లలో అందం లేకపోతే చూడ్డానికి బావుండదు. అందుకని ప్రతి టూర్నమెంటులో కొంతమంది మాంచి కసక్కనిపించే మోడల్సుని కూడ రంగంలోకి దించి వాళ్లకి పాంటీలు, బ్రాలు వేయించి ఆడిస్తే ప్రేక్షకులు విరగబడి చూస్తారేమో అధికారులు అలోచించాలి. వీళ్ళకి ఆటలో గెలుపు ఓటములతో నిమిత్తం లేకుండా అప్పియరెన్సు మనీ అని కొంత ముట్టచెబితే సరిపోతుంది.


 
అయినా లింగ వివక్షత లేకుండా ఆడ ప్రేక్షకులని ఆకర్షించడం కోసం మగ ఆటగాళ్ళకి కూడా చొక్కాలు విప్పి కేవలం డ్రాయర్లతో ఆడిస్తే ఆడియెన్స్ పెరిగే అవకసం ఉంటుందేమో అదీ అలోచించాలి మరి.

5 comments:

Apparao Sastri said...

నేను సెవెంత్ క్లాసు చదివే తప్పుడు , మా బావ టెన్నిస్ ని తెగ చూసే వాడు
నాకు టెన్నిస్ రూల్స్ చెప్పా మంటే చెప్పే వాడు కాదు
నేను కొంచెం పెద్ద అయ్యాక తెలిసింది టెన్నిస్ ఎందుకు చూస్తారో :)

Anonymous said...

moorkhudaa.. mee lekka prakaram cheera kaTTukoni aaDaalaa?

Praveen Sarma said...

చూసేవాళ్లకి సిగ్గుండాలి కానీ వేసుకునేవాళ్లకి కాదు. మగవాళ్లు నిక్కర్ వేసుకుని ఉదయం పూట కూరగాయల దుకాణాలకి వెళ్లడం లేదా? హైదరాబాద్‌లోనే కాదు, ఆముదాలవలస లాంటి చిన్న పట్టణాలలోనూ మగవాళ్ళు అలా వేసుకుంటారు. మగవాళ్ళకి లేని కట్టుబాట్లు ఆడవాళ్ళకే ఎందుకు?

Anonymous said...

naayanaa praveenu kadupu ki annam tintunnaava gaddi tintunnaava, em cheppaavu, nikkarlesukoni maga vaallu kuragaayalu konadaaniki velthunnaaraaa, orey neeyankammaa, eppudu choosaav ekkada choosaav raa. notiki vachindi vaagi janaalanu torture pedutunnaav

@blogowner: ee comment ni andariki kanapadela publish cheyakapoyinaa parledu, vishayam praveen ki teliyaayi, tanaki mailcheyandi ee comment ni plz

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

ప్రవీణ్, సారీ! నీతో ఏకీభవించలేకపోతున్నాను. చాలామంది కూలీలు పని చేసేటప్పుడు పంచె లేదా లుంగీ మాత్రమె ధరించి మరే ఆచ్చాధనా లేకుండా పని చేస్తారు. కానీ ఆడకూలీలు వాళ్ళతో పోటీకి పోకుండా చీరె ధరించి పని చేస్తారు. వాళ్లకి లేనిది మాకెందుకని రవికలు విప్పి పారేస్తే బావుండదు కదా?