నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Thursday, May 19, 2011

బూతు చిత్ర కథానాయకుడిగా ఒసామా బిన్ లాడెన్


ఒసామా బిన్ లాడెన్‌ని చంపి ఆ శవాన్ని సముద్రంలో పడేసినా లాడెన్‌ని అమెరికన్లు ఇంకా మర్చి పోలేదు. లాడెన్‌పై అమెరికన్లకున్న క్రేజ్‌ని క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు లాడెన్ హీరోగా ఓ సినిమా నిర్మిస్తున్నారు. ఇదేదో హాలీవుడ్ వాళ్ళు నిర్మించే చిత్రమని, అందులో లాడెన్‌ని టెర్రరిస్టుగా చూపిస్తారని అనుకొంటే పొరబాటే. ఈ సినిమాని తీస్తున్నది హజ్లర్(HUSTLER) అనే ఓ బూతు సాహిత్య సంస్థ. అందులో లాడెన్‌ని బూతు చిత్ర నాయకుడిగా చూపించబోతున్నారు.
 


Hustler అనేది అమెరికాలో ఓ బూతు పత్రిక. అయిదు లక్షల సర్క్యులేషన్ ఉన్న ఈ పత్రిక ప్లేబాయ్, పెంట్ హౌస్‍ల తరహా పత్రికె అయినా అవి క్లాస్ అయితే ఇది మాస్ పత్రిక. అవి బాల్కనీ ప్రేక్షకుల కోసం అయితే ఇది నేల క్లాసు కోసం.


 
Navy SEALS  దాడిలో లాడెన్ ఇంట్లో కంప్యూటర్ డిస్కులూ, పత్రాలు మొదలయిన వాటితో బాటు న్యాచులర్ వయాగ్రా మాత్రలూ బూతు పత్రికలూ, బూతు చిత్రాల తాలూకూ డీవీడీలు కూడా దొరికాయి. ఆ పత్రికలు, డీవీడీలు ఈ Hustler సంస్థ ప్రచురించినవీ, చిత్రించినవీ. దానితో తమ ఉత్పత్తులంటే ఎంతగానొ ఇష్టపడే ఒసామా బిన్ లాడెన్‌ని హీరోగా పెట్టి ఓ XXX బూతు చిత్రాన్ని నిర్మించాలని ఈ సంస్థ వాళ్ళు తలపెట్టారు. ఈ సంవత్సరం ఆఖరులొ మార్కెట్లో రిలీజవబోయే ఈ చిత్రంలో లాడెన్‌ రూపురేఖలతో ఉన్న వ్యక్తి హీరోగా ఉంటాడనీ, అలాంటి వ్యక్తిని ఎన్నుకోవడం కూడా పూర్తయిందనీ వాళ్ళు చెప్పారు.ఒసామా బిన్ లాడెన్ అమెరికా అమ్మాయిలపైన స్వారీ చేస్తూ శృంగారం చేస్తూ ఉంటే ఆల్ ఖైదా వాళ్ళు గానీ, అరబ్ ప్రపంచం గానీ పెద్దగా అభ్యంతరాలేవీ వ్యక్తం చేయరని Hustler ధీమా కాబోలు.

No comments: