నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Friday, May 27, 2011

జగన్ లోకేష్ మధ్య పోటీ గురించి ఆరు నెలల క్రితమే నేను రాశాను.


ఇప్పుడు చంద్రగిరి నుంచి నారా లోకేష్ రాజకీయ రంగ ప్రవేశం చేయనుండడంతో అందరూ జగన్ లోకేష్‌ల మధ్య పోటీ గురించి మాట్లాడుతున్నారు. ఈ విషయమై నేను గత నవంబరులోనే రాశాను. చూడండి.


Monday, November 22, 2010

సాక్షి కథనం-స్టూడియో-N కి ఇంధనం-అసలు కారణం జగన్ లోకేష్ ల మధ్య పోటీయా?

సాక్షి టీవీలో ప్రసారమైన హస్తం గతం కథనం సోనియా గాంధీలో కానీ ఆమె విధేయులలో కాని ఎంత రియాక్షన్ తెప్పించిందో తెలియదుకానీ స్టూడియో N లో మాత్రం చాలా స్టిములేషన్ తెప్పించింది. నిన్నా,మొన్నా ఆ చానల్ అదే పనిగా ఆ స్టోరీని రిపీట్ చేసి, దాని పైన వెల్లువెత్తిన నిరసనల్ని,ఖండనల్ని పదే పదే చూపించింది. ఒక వైపు బాక్స్ కట్టి సాక్షి కథనం తప్పు అన్న వాక్యం, దానికి ఇటు వైపు కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఫోటోలు మార్చి మార్చి చూపించింది.
 
స్టూడియో-N టీడీపీ చానల్ అని అందరికీ తెలుసు కాబట్టి జగన్ చానల్ ని దుమ్మెత్తి పోసింది అనుకొంటే, ఆ రియాక్షన్ వెనక కొచెం సోనియాని సమర్ధిస్తున్నట్లు, సానుభూతి చూపుతున్నట్టు కూడా అనిపించింది. దీని వెనక అసలు కారణం నా ఉద్ధేశ్యంలో జగన్ కి లోకేష్ (చంద్రబాబు తనయుడు, స్టూడియో-N కి సీఈఓ గా వ్యవహరిస్తున్నాడు)కి మధ్య ఉన్న peer pressure అయ్యుండవచ్చు.
 

చంద్రబాబు, వైఎస్సార్ ఎలా సమకాలీనులో, వాళ్ళ కొడుకులు కూడా అలాగే సమ వయస్కులు. జగన్ ఎప్పుడూ లైమ్ లైట్ లో ఉంటే లోకేష్ స్టాన్ ఫోర్డ్ లో చదువుకొంటూ గడిపేశాడు. మొన్నీ మధ్యనే బాలకృష్ణ కూతుర్ని పెళ్ళి చేసుకొని వార్తల్లో కొచ్చాడు. గత ఎన్నికలలో తెలుగుదేశానికి నగదు బదిలీ పథకం అనే ఆయుధాన్ని అందించింది లోకేషే. అది అనుకొన్నట్లుగా పని చేయలేదు. అది వేరే సంగతి.

చంద్ర బాబు మిగతా కుటుంబ సభ్యుల్ని రాజకీయాలకు దూరంగా పెట్టినట్లే కొడుకుని కూడా పార్టీకి, రాజకీయాలకు దూరంగా పెట్టాడు. మరో వైపు జగన్ తండ్రి వర్గాన్ని వైఎస్ బతికున్నపుడే మానేజ్ చేస్తూ, తనకంటూ బలమైన వ్యాపార, రాజకీయ సామ్రాజ్యాన్ని, సమాచార సామ్రాజ్యాన్ని నిర్మించుకొన్నాడు. ఇప్పుడిప్పుడే లోకేష్ తమ దగ్గరి బంధువులకి చెందిన(ఇందులో బాబుగారి పెట్టుబడి ఉందేమో నాకు తెలియదు) స్టూడియో-N చానల్ ని నిర్వహిస్తూ మీడియాలో అడుగు పెట్టాడు.


తరగతిలో ఇద్దరు విద్యార్ధుల మధ్య, ఒకే కుటుంబంలోని ఇద్దరు సమవయస్కుల మధ్యా పోటీ ఉన్నట్లు సహజంగానే జగన్ లోకేష్ ల మధ్య కూడా అంతర్లీనంగా పోటీ ఉండి ఉంటుంది. ఆ పోటీలో భాగమే ఆ మధ్య స్టూడియో-N లో వచ్చిన జగన్ రాజ ప్రాసాదాల కథనాలు అని నేననుకొంటున్నాను. ఇప్పుడు జగన్ ని దుమ్మెత్తి పోయడానికి స్టూడియో-N కి హస్తం గతం కథనం, దాని పైన వెల్లువెత్తిన నిరసనలు మరొక బంగారం లాంటి అవకాశాన్ని అందించాయి. దాన్ని లోకేష్ పూర్తిగా వాడుకొంటున్నాడు అని నా అభిప్రాయం. 


ఎవరైనా మానసిక విశ్లేషణా నిపుణులు దీన్ని మరింత లోతుగా పరిశీలించాల్సి ఉంది.  

3 comments:

Anonymous said...

meru KEKA

Anonymous said...

లోకేష్ బాబుకి జగన్ తో పోటీ పడే అంత బొమ్మ లేదు లెండి. సత్యం రామలింగ రాజు గారి డబ్బులతో స్టాన్ఫోర్డ్ లో పేమెంట్ సీట్ ద్వారా చదువుకున్నాడు.

లోకేష్ ప్రచారంకి వెళ్తే ఉన్న వోట్లు పోతాయి.లోకేష్ ఇంకో వంద జన్మలు ఎత్తాలి జగన్ తో పోటీ పడాలి అంటే.

Anonymous said...

అనానిమస్, the most corrupt YSR family supporters కూడా ఎదుటివాడి అవినీతిని వేలెత్తి చూపేవాళ్ళేనా? పోటీ పడలేడు అను చాలు, అవినీతి గురించి మాట్లాడి మీ బఫూనరీ చూపించుకోవద్దు.