నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Friday, March 2, 2012

సత్యం గెలిస్తే తమరు సంక నాకిపోతారు కదా సార్!


ఒక ఉదాత్త ఆశయం కోసం పోరాడిన యోధులు జైలు కెళ్ళాల్సి వచ్చినా, చివరికి ఉరికంబం ఎక్కాల్సి వచ్చినా చిరునవ్వుతో తమ అనుచరులవైపు చూస్తూ చేతులు ఉపుతూ కనిపిస్తే ఆ సన్నివేశం వారిని అనుచరించే వారిని ఎంతగానో ఉత్తేజపరుస్తుంది. ఇప్పుడు అంత గొప్ప ఆశయాలకోసం పోరాడే పోరాట యోధులు ఎక్కడా కాన రావడం లేదు. 
   
చివరికి హింసే మార్గంగా ఎంచుకున్న నక్సలైట్లు అయినా, పరమ మూర్ఖ శిఖామణులు ఉగ్రవాదులయినా(మన చిదంబరం చెసిన వర్గీకరణననుసరించి కాషాయ తీవ్రవాదులయినా, ఆకుపచ్చ తీవ్రవాదులయినా సరే) జైలుకి వెళ్తున్నప్పుడు చేతులూపుతూ, చిరునవ్వులు చిందిస్తే "భేష్" అనవచ్చు. మంచో చెడో తాము నమ్మిన మార్గంలో ధైర్యంగా పోతున్నారు అనుకోవచ్చు. అయితే దేశాన్ని, సమాజాన్ని దోపిడీ చేసేవాళ్ళు కూడా పెద్ద హీరోల లెవెల్లో ఫోజులు కొడుతూ ఉంటే ఏమనుకోవాలి. 
 


ఆ మధ్య జగన్ కేసులో ఆయన ఆడిటర్ విజయ సాయి రెడ్డిని పోలీసులు జీపు ఎక్కిస్తుంటే ఆయన చిరునవ్వులు చిందిస్తూ చేయి ఊపుతూ ఎక్కారు. ఎవరిని చూసి ఊపినట్టు, ఎందుకోసం ఊపినట్టు. "మరేం ఫర్లేదు. వెంటనే వచ్చేస్తాను. వీళ్ళు మనల్నేం పీకలేరు" అని తన మనుష్యులకు ధైర్యం చెప్పడానికా.
 
నిన్న బళ్ళారి వీరప్పన్ గాలి జనార్ధన్ రెడ్డిని హైదరాబాద్ నుంచి బెంగళూరు తరలించడానికి చంచల్ గూడా జైలు వెలుపలికి తీసుకొచ్చినప్పుడు మీడియా వాళ్ళని చూసి ఆవేశం వచ్చి సత్యమేవ జయతే అని నినాదం చేశాడు. 
   
జనార్ధనా, ఎంత మాట! ఎక్కడో ఓ చోట తధాస్తు దేవతలు ఉంటే,వాళ్ళు నీ కూత విని పొరబాటుగా తధాస్తు అని ఉంటే, అది ఫలించి సత్యం గనుక గెలిస్తే మన బతుకూ, మన వాళ్ళ బతుకులూ జైలు గోడల మధ్యనే తెల్లారి పోతాయి కదా? ఎందుకీ అనవసర నినాదాలు. 

6 comments:

Bhaskar said...

భగత్ సింగ్, చంద్ర శేఖర్ ఆజాద్‌ల సరసన సావర్కార్‌ని పెట్టడం భావ్యమేనా, కృష్ణా?

Mohan said...

సావర్కార్‌గారికి ఏం తక్కువ బాబూ?

Anonymous said...

సావర్కార్‌కీ జాతి పిత హత్యకీ గల సంబంధం గురించి ముందు తెలుసుకోండి. ఆ ఇద్దరూ దేశ భక్తులయితే ఇతను ఒక మత మౌఢ్యుడు. అదీ తేడా.

Anonymous said...

Savarkar is a great nationalist. those who read biased and marxist cooked histories are unable to really appreciate . this is the saddest part of free India, which was subverted by the Congress and its "tottus" like communists right from selfish and short sighted power-mongering leaders like Nehru.True desabhaktas are always relegated to the background. He is the one who called the so-called mutiny as "First War of Independence" and ignited the people of India.

sreerama

yuddandisivasubramanyam said...

truth is bitter

gksraja said...

చచ్చిపోతున్నామండి బాబూ! ఈ దొంగల పోజులు చూడలేక. చక్కటి విషయం చర్చకు పెట్టారు.