నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Friday, March 30, 2012

బూతుని సెన్సార్ చేసినందుకు ఆ దర్శకుడికి కోపమొచ్చింది


విక్రమ్ భట్ నిర్మాతగా, వివేక్ అగ్నిహోత్రి దర్శకుడిగా, బెంగాలీ నటి పయోలీ డామ్ నటిస్తున్న హేట్ స్టోరీ అన్న హిందీ చిత్రం ఇప్పటికే సంచలనాలు సృష్టిస్తోంది. పయోలీ బెంగాలీ నటి. ఈ అమ్మడు ఇప్పటికే చత్రక్ లాంటి బెంగాలీ సినిమాలలో ఏ మాత్రం సంకోచం లేకుండా బట్టలిప్పేసి వార్తల్లోకెక్కింది. బూతునీ, బూతు తారలనీ ప్రోత్సహించడంలో భట్‌లు ముందుంటారు. మహేష్ భట్, పూజా భట్‌లు సన్నీ లియోన్‌తోజిస్మ్ -2 సినిమా తీస్తూండడం అందరికీ తెలిసిందే.
 
ఈ హేట్ స్టోరీలో కథ మొత్తం సెక్స్ చుట్టూ తిరుగుతుంది. తనకి అన్యాయం చేసిన వ్యక్తుల మీద తన అందాన్ని వాడుకొని ఒక అమ్మాయి ప్రతీకారం తీర్చుకోవడం ఈ సినిమాలో కథ. పయోలీ వీపు మీద ఒక కేప్షన్‌తో పోస్టర్ రిలీజ్ చేసి సినిమా ప్రారంభంలోనే వేడి రగిలించారు దర్శక నిర్మాతలు.http://www.youtube.com/watch?v=4wyAIdYRTPg ఇప్పుడు యూ ట్యూబ్‌లో ఈ సినిమా తాలూకూ ట్రెయిలర్ రిలీజయింది. పయోలీ ఈ సీన్లలో రెచ్చిపోయి నటించింది.
 
అంతే కాక, "నేను ఈ నగరంలో కల్లా పెద్ద లం** కావాలనుకొంటున్నాను", "నన్ను *ఽ%న వాళ్ళని నేను *ఽ%తాను" అని కొన్ని ఆణిముత్యాల్లాంటి డైలాగులు కూడా ఉన్నాయి. ఈ డైలాగులు విని సెన్సారు బోర్డు వీటిని బీప్ చేస్తే కానీ ట్రెయిలర్‌ని అనుమతించమని చెప్పింది. ఇది విక్రమ్ భట్‌కి, వివేక్ అగ్నిహోత్రికీ కోపం తెప్పించింది.
  
"సెన్సారు బోర్డులో ఉండేవాళ్ళందరూ పాతకాలం మనుషులు. ఈ డైలాగులు తీసేస్తే సినిమాలో ఉన్న బోల్డ్ నెస్ అర్ధం కాదు. స్పోర్ట్స్ కారు కొనుక్కుని ట్రాఫిక్‌లో మెల్లగా ప్రయాణిస్తున్నట్టు ఉంటుంది" అని తమ ఆవేదన వెల్లడించుకుంటున్నారు. అయితే యూట్యూబ్‌లో ఉన్న ట్రెయిలర్ మాత్రం అలాగే ఉంటుందట. అందులో సెన్సారు ఉండదు కదా.
  
అయినా ఆ మాత్రం సెన్సార్ లేకపోతే మీరు పచ్చి బూతు సినిమాలు తీస్తారు కదా వివేక్ భయ్యా?

2 comments:

Anonymous said...

Very hot post,sir.

More Entertainment said...

hii.. Nice Post Great job. Thanks for sharing.

Best Regarding.

www.ChiCha.inMore Entertainment