నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Saturday, March 10, 2012

బానిసలుగా మనం భలే రాణిస్తాం కదా?!


ఒక అమెరికన్ కొత్త చోటుకి వెళ్తే ఎవడైనా భాగస్వామి దొరికితే బావుణ్ణు , వాడితో కలిసి వ్యాపారం చేసుకోవచ్చు అనుకుంటాడట. అదే బ్రిటీష్ వాడైతే ఎవడైనా కనిపిస్తే వాతావరణం గురించి మాట్లాడుకోవచ్చు అనుకుంటాడు. ఇటాలియన్ అయితే ఒక లవర్ కనిపిస్తే బావుణ్ణు అనుకుంటాడు. కమ్యూనిస్ట్ అయితె మరో ఇద్దరుంటే ఒక సంఘం పెట్టొచ్చు అనుకుంటాడు. అదే భారతీయుడయితే ఎవరయినా యజమాని దొరికితే బావుణ్ణు, వాడికి సేవ చేసుకుంటూ బతికేయవచ్చు అనుకుంటాడని జోకు చెప్తుంటారు. 
 
ఇది చదవగానే జాతి అభిమానం పెల్లుబికి నామీద కోపం తెచ్చుకోకండి. ఈ బానిస మనస్తత్వం మనలో తరతరాలుగా జీర్ణించుకుపోయింది అనేది ఎవరూ కాదనలేని వాస్తవం. కావాలంటే మన సినీ వారసుల పట్ల అభిమానుల వెర్రి అభిమానం చూడండి. ఒక హీరోకి కొడుకో, అల్లుడో అయినంతమాత్రాన ఆ అభిమానులకి అతడు నచ్చాలని ఉందా? యువ హీరోలకి మొదటి సినిమా రిలీజ్ నాటికే అభిమాన సంఘాలు, యువ సేనలూ పుట్టుకు రావడం, ఆ హీరోల  మొదటి సినిమాలని కూడా ఈ వెర్రి అభిమానులు ఎగేసుకొని చూడడం బానిస మనస్తత్వం కాదా? 
       
మరొక ఉదాహరణ రాజకీయ వారసులు. ఏమాత్రం, అనుభవం లేకుండా, అసలు మన సమాజం పట్ల కనీస అవగాహన లేకుండా ఎక్కడో విదేశాల్లో పెరిగి అక్కడే చదువుకొని వస్తున్న ఈ వారసులని ప్రజలు వెర్రిగా ఆదరించడం, అంతవరకూ ప్రజల మధ్య ఉండి, వారి బాగోగులు తెలిసిన నాయకులని వెనక్కి నెట్టి ఈ యువ కిశోరాలు అందలాలు ఎక్కుతున్నారంటే మన జనం బానిస మనస్తత్వానికి ఉదాహరణ కాక మరేమిటి?

9 comments:

Anonymous said...

You are 100% correct
: venkat

Anonymous said...

మీ మొదటి జోక్ తో 100% ఏకీభవించనప్పటికీ, మీ వాదనలో అవాస్తవం లేదని మాత్రం చెప్తాను సర్...

sharma said...

meeru cheppindi 100% correct.. baanisatwam mana rakthamlo nara naraallo jeerninchukupoyindi!!

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

నంద గారూ, మీరు మరింకా ఏదో చెప్పాలని అనుకున్నట్లుంది. కాస్త విడమరిచి చెప్పండి.

Vivek said...

Asalu Nandamuri vasamnunu maricharemi sir,
Asalu adhyulu vaale kada, valla photo hi. emantaru

Vivek said...

Asalu Nandamuri vasamnunu maricharemi sir,
Asalu adhyulu vaale kada, valla photo ni ela marcharu

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

ప్రతి దానికీ నేతులు తాగిన తాతల మూతులు వాసన చూసే నందమూరి వంశస్థులని మర్చి పోవడం క్షమార్హం కాని పొరపాటు. సరిదిద్దుకున్నాను. తప్పు చూపినందుకు మీకు థాంక్స్ vivek.

yuddandisivasubramanyam said...

exceptional

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

Thank you sir, yuddandisivasubrahmanyam.