నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Wednesday, March 21, 2012

బాబాలకు బ్యాడ్ టైమ్. తరువాత స్పాట్ చిన్న జుట్టు పోలిగాడికేనా?


బాబాలు, స్వాములు, దైవ స్వరూపులు అని తమకు తాము బిరుదులు ఇచ్చుకొని అమాయకులని మోసం చేస్తూ విర్ర వీగుతున్న వారికి స్పాట్ పెడుతున్నాడు నిజమైన దేవుడు. ఈ అభినవ దేవుళ్ళు జస్ట్ లైక్ దట్ అలా అవతారం చాలించి పరమపదించడం లేదు. నెలలకు నెలలు ఇంటెన్సివ్ కేర్‌లో ఉంటూ నోట్లో, ముక్కులో పైపులతో వెంటిలేటర్ల పైన ఉన్నారో పోయారో తెలియని స్థితిలో కొట్టుమిట్లాడి డాక్టర్ల చేతుల్లో తమ పాపాలకు ఇక్కడే శిక్ష అనుభవించి మరీ చస్తున్నారు.
  

ఇదంతా చూస్తుంటే వీళ్ళ పాపాలని లెక్క కట్టి ఆ యమ ధర్మ రాజు ఇక్కడే శిక్ష పూర్తి చేసి తీసుకు వెళ్తున్నట్టు అనిపిస్తూంది. మొన్న సత్య సాయి బాబా, నిన్న కాళేశ్వర్... ఇలా ఈ గాడ్ మెన్ కి బ్యాడ్ టైమ్ మొదలయినట్లు జనానికి అనిపిస్తూంది.
  

వీళ్ళే దేవుళ్ళు అని నమ్ముతున్న జనానికి బుద్ధి రావడానికా అన్నట్టు జరుగుతున్న ఈ సంఘటనలు గమనిస్తే ఆ దేవుడు వేలు లక్షల్లో ఉన్న అమాయకులని ఒక్కొక్కడినీ కలిసి చెప్పలేక ఈ అమాయక వెర్రి బాగుల భక్తులకి హోల్ సేల్‌గా పాఠం చెప్పడానికి, ఈ దొంగల చేతుల్లో భ్రష్టు పట్టిపోతున్న హిందూ మతాన్ని కాపాడ్డానికి  పూనుకున్నాడా అని అనిపిస్తుంది. 
 

"వెధవల్లారా, దేవుడొక్కడే. ఆ ఒక్కడూ సర్వ శక్తి సంపన్నుడు. ఆ ఒక్కడిని చేరుకోవడానికి మీకు ఎవ్వరూ దళారీలు అవసరం లేదు. నిస్వార్ధంగా పూజిస్తే చాలు. జుట్టు పెంచుకొని, గాల్లోంచి ఉంగరాలు, లింగాలు తీసే వాళ్ళూ, లింగాలని, ఆ లింగాలు ఉన్న గుడులనీ మింగే వాళ్ళూ, ఆశ్రమాలు కట్టి కోట్లు కోట్లు దిగమింగే వాళ్ళు దేవుళ్ళు కాదురా శుంఠల్లారా" అని ఆ దేవ దేవుడు లౌడ్ స్పీకర్లోంచి కేకలేస్తున్నట్టు ఉంది.
  

ఇక నెక్స్ట్ స్పాట్ చిన్న జుట్టు పోలిగాడికా, కలికాలం స్వామికీ, అమ్మ దెయ్యానికా అన్నది తెలియాలి.

14 comments:

gksraja said...

బాగా చెప్పారు. ఇలాంటి దొంగ బాబాలకు, అమ్మలకు బుద్ధి చెప్పడానికి సాక్షాత్తూ ఆ అంతర్యామికి పని పెట్టడం మనదే తప్పు. దొంగ స్వాముల పని పట్టడం మన వంతే! జుట్టుపోలిగాళ్ళకు, దొంగ సాములకు, బలిసిన అమ్మలకు ఎక్కడికక్కడే, ఎప్పటికప్పుడే బుద్ధి చెప్పాలి. వాళ్ళను మూర్ఖంగా అదే పనిగా స్పాన్సరు చేస్తున్న బడా వ్యాపారస్తుల్ని, నాయకుల్ని కూడా పనిలో పనిగా 'పని' బట్టాలి. మీరూ ఇదే కంటిన్యూ అయిపోండి.
ఇదే విషయం పై, నా బ్లాగు లోని ఈ లింకు చూడండి.
http://www.blogger.com/blogger.g?blogID=1336288982299472760#editor/target=post;postID=669177851558179057
gksraja.blogspot.com

డా. వెంకట సుబ్బారెడ్డి ఆవుల said...

Very good post....
Meru titles kevvu mani pinchela pedathaaru

Anonymous said...

Adirindi boss.

Anonymous said...

This post is an insult to Hinduism. It is because of people like you the great Hindu religion has become a laughing stock.

వనజవనమాలి said...

kalki vijayakumar,padmavati.. mosaalu chaalaa unnaayi.maaku sameepamlo choosina anubhavaalu chaalaa unnaayi Krishna gaaru. Ilaati vaarini poojinche vaallake buddi ledu. yenta cheppinaa yem prayojanam..? well said..andee .

Anonymous said...

Why don't you write about Christian *$*$€**%€£?

Pardha said...

You call yourself Krishna and insult Hinduism, shame on you.

Praveen Mandangi said...

ఈ లింక్ చదవండి: https://plus.google.com/111113261980146074416/posts/52mPJwb9Q94

durgeswara said...

ధనం ఎక్కడచేరితే అక్కడ వినాశకర బుధ్ధులు పుట్టుకొస్తాయి. తద్వారా జరగాల్సిన అధర్మక్షయం కూడా పరమాత్మ ప్రణాళిక లో భాగమే.

Anonymous said...

Pardha garu,
Krisha garu is a theist... and a real hindu,No doubt at all.....!!

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

రాజా గారూ,సుబ్బా రెడ్డి గారూ ధన్యవాదాలు. వనజా గారూ నేను కల్కి సాములోరిని చూడ లేదు గానీ ఆ ఆశ్రమంలో కొన్నాళ్ళు సెక్యూరిటీ గార్డుగా పని చేసిన ఒక వ్యక్తిద్వారా ఆ మహా కార్యాలు విన్నాను. దుర్గేశ్వర గారూ మీలాంటి ఆధ్యాత్మిక భావాలు కల వాళ్ళు ఈ వెధవల అకృత్యాలను ఖండిస్తే భక్తులు కళ్ళు తెరుస్తారేమో చూడండి.

హిందూ మతోద్దారక ఎనోనిమస్ గార్లకి నేను చెప్పేదేమంటే ఈ దొంగ స్వాములవల్ల ఉన్నతమయిన హిందూ మతం భ్రష్టు పట్టి పోతూంది. వీళ్ళని ఎంత త్వరగా వదిలించుకొంటే మనకి అంత మంచిది.

నేను లోగడ క్రిస్టియన్ మత పెద్దల అకృత్యాలపైన నిప్పులు చెరగడం మీరు చూడలేదల్లే ఉంది. ఒక సారి గమనించండి.

చివరి ఎనోనిమస్, నా తరఫున వకాల్తా పుచ్చుఇకున్నందుకు థాంక్స్. నేను a thiest ని కాదు. మీరు మధ్యలో స్పేస్ పొరబాటుగా ఇచ్చినట్లయితే ఓకే. నేను athiestని. కానీ నా మతాన్ని గొప్పగా భావించి, గర్వించే హిందువుని. అందుకే ఈ దొంగ బాబాలంటే నా కంత మంట.

Anonymous said...

Nice post Krishna garu. Aa photos ni chooste andulo unna okkari meeda kooda kaneesa gouravam kalagadam ledu. let alone, bhakthi bhaavam. may be, naa paapishti kallaki vaalla mahathyam ardham kaavadam ledemo ;-)

Hindu matam gurinchi maatladina itara anonymous laki, ilanti swamulu bhujaana vesukuni nilabetta valasina duravastha hindu mataaniki ledu. in fact, ilanti donga sannasula valla unna gouravam kooda oodchipettuku potundi. Manaki mukkoti devathalu unnaru. vallani poojiddaamu chaalu. vaallu yemi chepparo chadivi achariddaamu. ante kaani devudiki / mataaniki manaki madhya ilanti broker la avasaram ledu. oka vela meeru vellaani guruvulu gaa poojinchaali antaaremo. guruvu ane vaadu tana bodhanala dwaarane kaadu, tana chetala dwaara kuda maargadarsi gaa undaali. ante kaani cheppevi sri ranga neetulu, doorevi d****ri gudesalu annattu undakoodadu. mimmalni hurt chesi unte mannichandi. kaani oka orthodox hindu gaa meeru aa donga swamulu ni matoddhaarakulu anattu maatladadam nachaka react ayyanu. Hindu matam chaala goppadi. ippudu yevaru kottaga uddarinchakkarledu.

More Entertainment said...

hii.. Nice Post Great job. Thanks for sharing.

Best Regarding
.
More Entertainment

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

Well said, last anonymous.