నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Tuesday, March 27, 2012

ప్రజలు నిజంగా విశ్వసనీయతకు పట్టం కడుతారా?


రాజకీయ నాయకులకి తరచుగా వాళ్ళూ, వీళ్ళూ ఇచ్చే సలహా విశ్వసనీయత పెంచుకోండి అని. ఇటీవల కాలంలో ఈ సలహా తరచుగా తీసుకున్న నాయకుడు చంద్రబాబు. ఆయన రైతు యాత్రలంటూ నానా యాగీ చేస్తూ ఉంటే ముందు నువ్వు నీ విశ్వసనీయత పెంచుకోవయ్యా అని అందరూ చెప్పేవారే. ఇక యువనేత అయితే చనిపోయిన తన తండ్రి మహానేతని ఉదహరిస్తూ అలా మారి చూపించు ముందు, ఆ తరువాతే ప్రజల్లోకి రా అని తన ఓదార్పు యాత్రలో, సాక్షి పత్రిక చానల్ సాక్షిగా చెప్తూ వచ్చాడు. అయితే ప్రజలు నిజంగా విశ్వసనీయతకు పట్టం కడుతారా అంటే అది సందేహాస్పదమే.
   

మొన్న జరిగిన ఉపఎన్నికలలో తెలంగాణాలో ఆ సెంటిమెంట్ పని చేసిందనుకుంటే, ఏ సెంటిమెంట్ లేని కోస్తాలోని నెల్లూరు జిల్లాలో కోవూరు నియోజక వర్గంలో కూడా ఉప ఎన్నిక జరిగింది.


ఇక్కడ పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్ధి పోలంరెడ్డి శ్రీనివాస రెడ్డి 2004 లో గెలిచి 2009లో ఓడిపోయాడు. ఈయన పెద్దగా జనానికి తెలిసిన నాయకుడు కాకపోయినా మొదటిసారి పోటీ చేసినప్పుడు కాంగ్రెస్ అనుకూల వాతావరణంలో గెలిచాడు. అయితే గెలిచాక రెండు చెప్పుకోదగ్గ పనులు చేశాడు. చాలా కాలంగా మూతపడ్డ షుగర్ ఫాక్టరీ తెరిపింఛాడు. పెన్న బ్యారేజీ మంజూరు చేయించి నిర్మాణం జరిపించాడు. అయితే ప్రజల్లో లేకపోవడం వల్ల తరువాతి ఎన్నికలలో ఓడిపోయాడు. పట్టుబట్టి సీటు తెచ్చుకొని ఉపఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయాడు.


2004, 2009, 2012 ఎన్నికలలో తెలుగు దేశం తరఫున పోటీ చేసి 2009,2012 లో గెలిచిన నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి 2009లో గెలిచి సరిగా నెల తిరక్క ముందే   చంద్ర బాబు మీద తిట్ల పురాణం ఎక్కుపెట్టి రాజ శేఖర్ రెడ్డికి దగ్గరయ్యే ప్రయత్నం చేశాడు. అయితే ఆయన మరణానంతరం నెలకొన్న పరిస్థితులలో తెలివిగా జగన్ వైపు చేరాడు. ఉప ఎన్నికలో అవలీలగా గెలిచాడు.


ఇక్కడ చూడండి. ఒక పార్టీ తరఫున గెలిచి, ఆ పార్టీ నాయకుడినే తిట్టి, గెలిచిన వెంటనే ప్లేటు ఫిరాయించిన నాయకుడికి ప్రజలు పట్టం కట్టారు. నియోజక వర్గానికి రెండు ముఖ్యమైన పనులు చేసిన నాయకుడిని వరుసగా రెండు సార్లు తిరస్కరించారు. కాబట్టి విశ్వసనీయత పెంచుకోవడం కాదు, అలా నటించాలి అంతే. ప్రజల కోసం బతుకుతున్నట్టు, వారి కోసమే తిరుగుతున్నట్టు అనిపించాలి. అంతే.

3 comments:

Anonymous said...

:-)

surendra babu said...

yes neevu cheppindhe correct. ee janam mararu .nayakulu kuda alage thayaru autharu. cheemu netthuru leni ee jananni nammadam kante nuthilo dhuki chavadam melu.

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

అవునండీ కొన్ని సార్లు అలానే అనిపిస్తోంది.