ఓ పదిహేను ఇరవై సంవత్సరాల క్రితం తిరుపతిలో అనుకుంటాను అరసం లేదా విరసం రచయితల సమ్మేళనం జరిగినప్పుడు గొడ్డు మాంసం గురించి ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో జరిగినట్లుగానే చిన్నపాటి వివాదం వచ్చింది. కొందరు మాదిగ రచయితలు గొడ్డు మాంసం మా జన్మ హక్కు. అది ఉండాల్సిందే అంటే, గొడ్డు మాంసం కావాలంటే బయట తినండి. ఇక్కడ మాత్రం ఏం పెడితే అదే తినండి అని మిగిలిన వాళ్ళు చెప్పారు. అందరూ కొంచెం వివేకం ఉన్న వారు కాబట్టి ఆ గొడవ అక్కడితో సద్దు మణిగింది.
అసలు గొడ్డు మాంసాన్ని అసహ్యించుకొనే చాలా మంది అగ్ర కులాల వారు కూడా పంది మాంసాన్ని తింటారు. గొడ్డు మాంసం, పంది మాంసం రెండూ తిన్న వారిలో కొంతమంది పంది మాంసమే సూపర్ అని అంటారు. ఇవి రెండే కాకుండా కుందేళ్ళనీ, దుప్పులని కూడా లొట్టలేసుకుని తింటారు చాలా మంది.
అలాంటప్పుడు రిలేటివ్‌గా ఎక్కువ మందికి ఆమోదయోగ్యమైన పంది మాంసాన్ని వండి పెట్టి పోర్క్ ఫెస్టివల్ పెట్టొచ్చుగా? పోర్క్ ఫెస్టివల్ పేరుతో ముస్లిములని కెలికే ధైర్యం లేకపోవడమే అందుకు కారణమా?