నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Monday, April 16, 2012

వారసుల సినిమాలన్నింటిలో మొదట్లో ఈ సీన్లు ఉండాలి


ఒక మంచి సినిమా కుటుంబంలో వారసుడిగా పుడితే సినిమా పరిశ్రమలో ప్రవేశించడం గానీ నిలదొక్కుకోవడం గానీ తేలిగ్గా ఉంటుందని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ అది పూర్తిగా నిజం కాదు. వారి కష్టాలు వారికి ఉంటాయి. తాము ఎవరి కొడుకులో ప్రతి సారీ పాటల్లోనో, సన్నివేశాల్లో  వచ్చే డైలాగుల్లోనో వారికి వారు గుర్తు చేసుకుంటూ ఉండాలి. విలన్‌తో మాంచి ఆవేశంతో కూడుకున్న సీన్ వచ్చినప్పుడల్లా తమ వంశం ఎలాంటిదో, దాని గుణ గణాలు ఏపాటివో వల్లె వేయాల్సి వస్తుంది. ఇదంతా కొంచెం out of place అనిపించి చూసే వారికి (అభిమానుల్ని మినహాయించి) ఎబ్బెట్టుగా తోచవచ్చు.


   
ఈ సమస్యకి ఒక తేలికయిన పరిష్కారముంది. తమ కుటుంబం తాలూకూ డబ్బా కొట్టుకోవడం చెస్తూనే, మాంఛి పట్టున్న సీన్ వచ్చినప్పుడు "నేను సన్నాఫ్ సొ అండ్ సో" అని వల్లె వేయకుండా ఉండాలంటే సినిమా మొదట్లోనే హీరోతో తన కుటుంబ చరిత్రనూ, దాని తాలూకూ గుణగణాలను ఏక పాత్రాభినయం రూపంలో చెప్పిస్తే అటు కుటుంబ చరిత్రను చాటినట్లు ఉంటుంది. మధ్యలో అన్నంలో వచ్చే పంటికింద రాయిలాంటి స్వీయ వంశ స్వోత్కర్ష తప్పినట్లు ఉంటుంది. 

6 comments:

Anonymous said...

:)

Anonymous said...

Nowadays its too irritating...alage perlu pade mundi kuda konni family slides vesthe inka super....

కిరణ్ said...

సినిమా మొదలయ్యే ముందు ..మెడలో ఒక పలక పై పేరు, తండ్రి, తాత, వంశం పేరు తో ఒక ఫోటో పడేస్తే ?

Anonymous said...

నిజమే నండీ బాబు ,వీళ్ళ వంశ చరిత్రలు ,ఆ తొడలు కొట్టుకోవడాలు అబ్బ ,భరించలేక చస్తున్నాము .అక్కడికి వాళ్ళేదో చాల గొప్ప చారిత్రిక పురుషులు ,మనం పిచ్చి మేళాలం అయినట్టు వుంటుంది కలరింగ్

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

ఈ వంశ వారస మర్కటాల చిత్ర రాజాలని మనం వెలి వేయగలిగితే దెబ్బకి దెయ్యం దిగి తీరుతుంది.

Anonymous said...

alaganette yelaageti? tenugu cinemaalaki hero la karuvochcheegaldu.