నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Friday, April 20, 2012

గొడ్డు మాంసం కోసం కాదు ఎస్సీ వర్గీకరణ కోసం ఉద్యమించండి


ఎక్కడ ప్రొఫెషనల్ కాలేజీలలో చూసినా ప్రభుత్వ కార్యాలయాలలో చూసినా ఎస్సీ కేటగిరీలో సీట్లూ, ఉద్యోగాలు పొందే వారు అధిక భాగం మాలవాళ్ళే ఉంటారు. వీరితో పోటీ పడి సీట్లూ, ఉద్యోగాలూ పొందలేక మాదిగలు వెనకపడి పోతున్నారు. ఎస్సీ వర్గీకరణ అంటూ ఆ మధ్య హడావిడి చేసిన మందా కృష్ణ మాదిగ తరువాత కొన్నాళ్ళు టీఆరెస్ తో కలిసి తెలంగాణా అంటూ తిరిగాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలియదు.
 


ఎస్సీ వర్గీకరణ సాధిస్తే మాదిగలకి విద్య, ఉద్యోగ అవకాశాలు గణనీయంగా పెరుగుతాయి. ఇలాంటి దాన్ని వదిలేసి ఈ సో కాల్డ్ మాదిగ మేధావులు, విద్యార్ధులు ఉస్మానియా యూనివర్సిటీలో గొడ్డు మాంసం వండడం, అందరికీ తినిపించండం తమ జీవితాశయంగా ఎందుకు భావిస్తున్నారో? గొడ్డు మాంసమే తినాలని అనుకుంటే బయట అది వండి పెట్టే హోటళ్ళు ఎన్ని లేవు. దర్జాగా వెళ్ళి తిని రావొచ్చు కదా? దాని కోసం ఇంత గొడవ, హడావిడీ, కత్తి పోట్లు, యూనివర్సిటీలో పోలీస్ పికెటింగ్ ఇన్ని అవసరమా?
  
కాబట్టి మాదిగ విద్యార్ధులారా మీ నాయకులకి, కేసీఆర్ బాషలో చెప్పాలంటే, బొంద పెట్టి ఉద్యమాన్ని మీ చేతుల్లోకి తీసుకొని ఎస్సీ వర్గీకరణ కోసం ఉద్యమించండి. మీరు, మీ తరువాతి తరాల వాళ్ళూ బాగు పడుతారు. గొడ్డు మాంసం కోసం కాదు. గొడ్డు మాంసమే కావాలని అనిపిస్తే హోటల్‌కి వెళ్ళండి.

3 comments:

Anonymous said...

చాలా బాగా చెప్పారు !

puranapandaphani said...

True.

Praveen Mandangi said...

I wrote "కేవలం ఆవుని గోమాతలా పూజించమని చెపితే సరిపోదు. మనుషులని మనుషులుగా చూడమని కూడా చెప్పాలి" in Durgeswara's blog. He didn't dare to publish my comment.
Read this link: http://www.flonnet.com/fl1923/stories/20021122003703800.htm