నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Thursday, May 31, 2012

చదరంగపు రారాజుకి జేజేలు


 లైట్నింగ్ కిడ్‌గా పేరు గాంచిన విశ్వనాధన్ ఆనంద్ తనని అలా ఎందుకు పిలుస్తారో మరోసారి ప్రపంచానికి చూపించాడు. బోరిస్ గెల్ఫాండ్‌తో జరుగుతున్న ప్రపంచ చాంపియన్‌షిప్ పోటీలో రెగ్యులర్ ఫార్మాట్‌లో జరిగిన పన్నెండు గేమ్‌లూ సరిసమానంగా ముగిశాక నాలుగు రాపిడ్ గేమ్‌లలో చాంపియన్‌షిప్ తేలుతుంది అనగానే ఆనంద్ అభిమానులు ఇక చాంపియన్షిప్ ఆనంద్‌కే అని డిసైడై పోయారు. వేగంగా ఎత్తులు వేయడంలో సిద్ధహస్తుడైన ఆనంద్ మామూలు గేమ్‌లని కూడా వేగంగా అడుతుంటాడు. కాబట్టి ఇక ఆనందే విజేత అని ఆయన అభిమానులు అనుకున్నారు. వారి ఆశలను వమ్ము చేయకుండా ఆనంద్ విజేతగా నిలిచాడు.
  
అయితే ఆనంద్ మీద రష్యన్ చెస్ మాఫియా ఈ మ్యాచ్ మొదలయినప్పటినుండీ విషాన్ని చిమ్ముతూనే ఉంది. ఆనంద్‌లో మోటివేషన్ తగ్గిందనీ, మునుపటిలా ఎత్తులు వేయలేకపోతున్నాడని, ఈ మ్యాచ్‌లో విజయం సాధించి బోరిస్ గెల్ఫాండ్ ఆనంద్‌ని ఖంగు తినిపిస్తాడని అంటూ వచ్చారు. చివరికి పూర్వపు చాంపియన్ గ్యారీ కాస్పరోవ్ కూడా ఇదే పల్లవి వినిపించాడు. కార్పోవ్, కాస్పరోవ్‌ల తరువాత రష్యన్ అధిపత్యానికి గండి కొట్టి చదరంగంలో తిరుగులేని రారాజుగా వెలుగుతున్న ఆనంద్ పైన రష్యన్ చదరంగం అధికారులకీ, వ్యాఖ్యాతలకీ కడుపుమంట కొత్తేమీ కాదు. కార్పోవ్, కాస్పరోవ్‌ల తరువాత ఆ స్థాయి ఆటగాడని వాళ్ళు డబ్బా కొట్టిన మరొక బిగ్ K, వ్లాదిమిర్ క్రామ్నిక్ ఆనంద్ చేతిలో పరాజయం పాలయ్యాక ఈ కడుపు మంట మరింత ఎక్కువయింది గానీ తగ్గ లేదు.
 
అయితే నిజమైన చాంపియన్లు వయసు వచ్చే కొద్దీ కొంచెం నిదానం అవ్వవచ్చేమో గానీ వారిలో ఆ మెరుపు ఎక్కడికీ పోదని తన వందవ సెంచరీతో నిరూపించిన సచిన్ టెండూల్కర్‌లాగా విషీ ఆనంద్ చదరంగంలో మరొక సారి చూపించాడు.


ఆయన మరెన్నో విజయాలు సాధించి, ఇప్పుడు నాలుగవ స్థానంలో ఉన్న తన రేటింగ్‌ని మెరుగు పరుచుకొని మొదటి స్థానంలో నిలవాలని ఈ బ్లాగ్ ఆకాంక్షిస్తోంది.

మళ్ళీ వందేళ్ళకి గానీ రాని ఆకాశంలో అద్భుతం శుక్ర గమనంTransit of Venus) జూన్ 6 న తప్పక చూడండి


జూన్ 6 ఉదయం ఆకాశంలో ఒక అద్భుత దృశ్యం సాక్షాత్కారమవుతుంది. Transit of Venus అని పిలిచే ఈ దృగ్విషయాన్ని శుక్ర గ్రహణంగా చెప్పుకోవచ్చు. భూమికి, సుర్యుడికీ మధ్య శుక్రుడు రావడం వలన ఇది ఏర్పడుతుంది. ఆ సమయంలో సూర్యుడి మీద శుక్ర గ్రహం ఒక నల్లటి మచ్చలాగా ఒక అంచు నుండి మరొక అంచుకి కదుల్తూ కనిపిస్తుంది. దీనినే Transit of Venus లేదా శుక్ర గమనం అంటారు. సూర్యుడికీ, భూమికీ మధ్య చంద్రుడు వచ్చినప్పుడు ఏర్పడే సూర్య గ్రహణం లాంటిదే ఇది కూడా. చంద్రుడి కన్నా శుక్ర గ్రహం నాలిగు రెట్లు పెద్దది అయినా చాలా దురంగా ఉండడం వలన సూర్యుడి మీద చిన్న చుక్కలా మాత్రమే కనిపిస్తుంది. కానీ సూర్య గ్రహణం కన్నా ఎక్కువ సేపు పడుతుంది ఈ శుక్ర గమనానికి. ఇంచు మించు ఆరు గంటల సమయం ఉంటుంది. ఈ శుక్ర గమనం జతలుగా వస్తుంది. ఇంతకు ముందు 2004 లో వచ్చింది. తరువాతిది డిసెంబర్ 2117లోనూ, డిసెంబర్ 2125లోనూ వస్తుంది. కాబట్టి మనకు ఈ అద్భుతాన్ని వీక్షించడానికి ఇదొక్కటే అవకాశం.
    
ఇది ప్రపంచంలో అన్ని చోట్లా ఒకేలా కనిపించదు. మన దేశంలో సూర్యోదయం నుంచి ఉదయం 10:30 వరకు కనిపిస్తుంది. కళ్ళతోనూ, ఎక్స్ రేలతోనూ, రేబాన్ లాంటి కళ్లద్దాలతోనూ చుస్తే కళ్ళకు ప్రమాదం జరుగుతుంది. ఈ అద్భుతాన్ని చూడ్డానికి మైలార్ ఫిల్టర్ కళ్ల జోళ్ళనే వాడాలి. ఇవి ఒక్కోజత పాతిక రూపాయలకే దొరుకుతాయి. 
  
Astronomy india సంస్థ వారు వీటిని సప్లై చేస్తున్నారు.astronomyindia.org అన్న వెబ్ సైట్‌లో ఇతర వివరాలు ఉంటాయి. లేదంటే 09440082627 నంబర్‌కి ఫోన్ చేసి శ్రీనివాస్ జావార్ అని వీరి ప్రతినిధితో మాట్లాడి నేరుగా వివరాలు తెలుసుకోవచ్చు. వీరికి ICICI,SBI,ఆంధ్రా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడాలలో అకౌంట్లు ఉన్నాయి. మనకి ఎన్ని కళ్ల జోళ్ళు కావాలో చెబితే మన ఆడ్రస్ ప్రకారం కొరియర్‌లో పంపడానికి ఎంత అవుతుందో చెబుతారు. ఆ ప్రకారం వీరి ఖాతాలో డబ్బు జమ చేస్తే మనకి కొరియర్ చేస్తారు. 

మన జీవిత కాలంలో ఒక సారి మాత్రమే వచ్చే ఈ అద్భుత దృశ్యాన్ని మిస్ చేసుకోవద్దు.

Tuesday, May 29, 2012

ఈసారి విప్పి చూపిన పూనమ్ పాండే


పోయిన సంవత్సరం భారత క్రికెట్ జట్టు ప్రపంచ కప్ గెలిస్తే బట్టలు విప్పేస్తానని చేసిన ఒక్క ప్రకటనతో అప్పటి వరకూ అనామకురాలుగా ఉన్న పూనమ్ పాండే ఒక్కసారిగా వార్తలలోకి ఎక్కింది. The most downloaded model on the internet  అని తన గురించి తాను చెప్పుకుంటూ ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేసింది. ఆమెకి ఇప్పుడు ట్విట్టర్‌లో 1,72,298 మంది ఫాలోయర్లు ఉన్నారు. పాప్ సింగర్లు లేడీ గాగా, అకోన్‌లు కూడా తన ఫాలోయర్లలో ఉన్నారని అంటుంది ఈ అమ్మడు. అయితే తీరా ఇండియా కప్పు గెలిచాక బట్టలు విప్పి చూపించే కార్యక్రమాన్ని ఏదో ఒక నెపం చూపించి వాయిదా వేస్తూ వచ్చింది. అర్ధ నగ్నంగా, ముప్పావు నగ్నంగా ఫోటోలు ట్విట్టర్‌లో పెట్టి వీటితో సర్దుకోండి అని చెప్తూ వచ్చింది.
    
ఇప్పుడు ఐపీఎల్ 5 లో షారూఖ్ ఖాన్ జట్టు కొల్‌కతా నైట్ రైడర్స్ గెలిస్తే బట్టలు విప్పేస్తానని మళ్ళీ ఒక ప్రకటన ఇచ్చింది ఈ ముద్దు గుమ్మ. ఇదంతా ఒకసారి అయ్యిందే కదా అని అందరూ పెదవి విరిచారు. కానీ వాళ్ళందర్నీ షాక్‌కి గురి చేస్తూ ఈ సారి తన నగ్న చిత్రాన్ని ట్విట్టర్‌లో పెట్టింది పూనమ్.
 
 త్వరలో తను నటించబోయే హిందీ సినిమాలో ఇంతకు మించి చూపిస్తానని ఒక ట్వీట్ పెట్టి అందరూ ఆ సినిమా కోసం వేచి చూడండి అని నోరు ఊరించింది.

యధా బాస్, తధా మన్ మోహన్ సింగ్.


ఆర్ధిక వేత్తగా బాగా పేరు గడించిన మన్ మోహన్ సింగ్ రాజకీయాల్లో రెండు అవతారాలు ఎత్తాడు. ఒకటి ఆర్ధిక మంత్రిగా, రెండవది ప్రధాన మంత్రిగా. ఆర్ధిక మంత్రి అవతారంలో ఆయన సూపర్ అని పేరు గడించాడు. సరళీకృత ఆర్ధిక విధానం ద్వారా, ఆర్ధిక సంస్కరణల ద్వారా దేశ ఆర్ధిక స్థితిని సమూలంగా మార్చి వేశాడు. బంగారం తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి నుంచి దేశ గతిని మెరుగు పరిచి భళా అనిపించుకున్నాడు. ఇలా "అద్భుతం" అనిపించుకున్న కాలంలో ఆయన బాస్‌గా ఉన్నది ఆనాటి ప్రధాని పీవీ నరసింహా రావు. ఆయన నేతృత్వంలో, గైడెన్స్‌లో మన్‌మోహన్ సింగ్ మంచి పేరు తెచ్చుకున్నాడు.
   
ఇక రెండవ అవతారం ప్రధానిగా. అయితే మొదటి అవతారం నుంచి ప్రమోషన్ తెచ్చుకొని ప్రధాని అయ్యాక ఆయనకి అన్నీ ప్రతికూలం అయ్యాయి. అందరూ ఆయన్ని రబ్బర్ స్టాంప్ అన్నారు. ఎవరినీ వ్యక్తిగతంగా విమర్శించని అద్వానీ సైతం వెన్నెముక లేని ప్రధాని అని అన్నాడు. ఎన్నడూ లేని విధంగా అవినీతి మచ్చ సైతం అంటించుకోవల్సి వచ్చింది. అన్నా హజారే మన్‌మోహన్‌ని కూడా ఇతరులతో కలిపి అవినీతి పరుడు అని అనేశాడు. ఆర్ధిక మంత్రిగా సూపర్ అనిపించుకున్న ఈయన ప్రధానిగా ఇలా దిగజారిపోయాడు ఎందుకా అని ఆలోచిస్తే ప్రధానిగా ఉన్న కాలంలో మ‌న్‌మోహన్ గారి బాస్ సోనియా గాంధీ కారణమేమో అనిపిస్తుంది.
   
బాస్ సూపర్ అయితే ఈయన కూడా సూపర్ అనిపించుకున్నాడు. బాస్ మారిపోయాక కొత్త బాస్ వచ్చాక ఆమె అవలక్షణాలన్నీ ఈయనకి కూడా సంప్రాప్తించి ఆహా, ఒహో నుంచి చీ..చీ..స్థాయికి దిగిపోవల్సి వచ్చింది. 

Monday, May 28, 2012

రేపటి నుండి ఎన్ని గుండెలు ఆగి పోతాయో, వాటికి ఓదార్పు ఎవరు ఇస్తారో?


అనుకున్నంతా జరిగిపోయింది. అందరూ భయపడిన ఉత్పాతం రానేవచ్చింది. యువనేత అరెస్టయ్యారు. ఆయన అరెస్ట్ కావచ్చు అన్న వార్తలు టీవీల్లో, పత్రికలలో చూసి తట్టుకోలేక అయిదారుగురు చనిపోయారంటారు. కొందరు గుండె ఆగి, మరికొందరు ఆత్మహత్యలు చేసుకొని చనిపోయారని భోగట్టా. అరెస్టయ్యే అవకాశం ఉందని అన్నందుకే అన్ని గుండెలు ఆగి పోతే, ఇప్పుడు తీరా అరెస్టు అయిపోయారని తెలిస్తే రేపటినుండీ ఇంకెన్ని గుండెలు ఆగిపోతాయో, ఎన్ని ప్రాణాలు టప టపా రాలిపోతాయో తలుచుకోవడానికే భయంగా ఉంది.
  
ఇంకా బాధ కలిగించే సంగతి ఏమిటంటే ఆ కుటుంబాలని ఓదార్చి, వారితొ కలిసి నేల మీద కూర్చుని వారిచ్చింది తిని, తాగి, సాక్షి కెమెరాలకి ఫోజులిచ్చి, వారి బుగ్గలు నిమిరి, వీపులు పామి ఓదార్చే చేతులు ఇప్పుడు కటకటాల వెనక ఉన్నాయే అని. భగవంతుడా ఏమిటీ వైపరీత్యం. బ్రదర్ అనిల్ ఇక ఈ బాధ్యత నీదే.





Sunday, May 27, 2012

సెక్స్ ఎలా చేయాలో ఎక్కడ చేయాలో తెలియకుండానే సంవత్సరాల తరబడి కాపురం చేస్తున్న జంటలు-ప్రముఖ సెక్సాలజిస్ట్ డా.నారాయణ రెడ్డి గారి మొదటి కేసు


చెన్నైలో ప్రాక్టీస్ చేస్తున్న సెక్సాలజిస్ట్ డా.నారాయణ రెడ్డిగారు డా.ప్రకాష్ కొఠారి తరువాత దేశంలోనే నంబర్ టూ సెక్సాలజిస్ట్‌గా పేరు తెచ్చుకున్న నిపుణుడు. ఇప్పుడు అయన అప్పాయింట్‌మెంట్ కావాలంటే ఒకటి రెండు వారాలు వెయిట్ చేయాలి. కానీ ఆయన ప్రాక్టీసు మొదలు పెట్టాక తన మొదటి పేషంట్ కోసం ఆయన ఆరు నెలలు వేచి చూశారట.
  
1982లో సెక్సాలజిస్ట్‌గా ప్రాక్టీస్ మొదలు పెట్టాలని నిర్ణయించుకున్నాక ఆయనని చేలా మంది నిరాశపరిచారు. ఈ బ్రాంచిలో నీకు పేషంట్లె ఎవరూ ఉండరు, పైసా ఆదాయం రాదు అని నిరాశ పరిచారు. కానీ తను తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి రెడ్డిగారు ఒక క్లినిక్ తెరిచారు. "ఇలా సెపరేట్‌గా క్లినిక్ ఉంటే రావడానికి పేషంట్లు వెనుకాడుతారు. ఏదైనా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌లో కూడా ప్రాక్టీసు చేయి" అని కొందరు ఇచ్చిన సలహాతో చెన్నైలోని ఒక హాస్పిటల్‌లో కూడా ప్రాక్టీసు పెట్టారు. "సెక్సాలజిస్ట్ అని కాకుండా మరేదైనా పేరుతో ప్రాక్టీస్ పెట్టాలని ఆ హాస్పిటల్ మేనేజ్‌మెంట్ ఆయనకి ఒక నిబంధన విధించింది. "అదేదో మీరే చెప్పండి" అని అన్నారు ఈయన. Reproductive Biolgist అన్న బిరుదు ఇచ్చి ఒక గైనకాలజిస్ట్ పక్కన చాంబర్ కేటయించారు. ఆ గైనకాలజిస్ట్ ఈయనకి మెడికల్ కాలేజీలో ప్రొఫెసరే కాకుండా, వీరి ఇద్దరు పిల్లలని డెలివరీ చేసిన ఫామిలీ డాక్టర్ కూడా.
  
ఆరు నెలలు ఒక్క పేషంట్ కూడా రాలేదు. రోజూ పొద్దున్నే వచ్చి తన చాంబర్‌లో కూర్చోవడం మధ్యాహ్నందాకా పేషంట్ల కోసం ఎదురు చూసి వెళ్లడం ఇలా ఆరు నెలలు గడిపేశారు.  పుస్తకాలో, మేగజైన్లో చదివి నాలుగయిదు కప్పులు టీ తాగి సాయంత్రం తన క్లినిక్‌కి వెళ్ళేవారు నారాయణ రెడ్డి. అలా ఆరు నెలలు గడిచాక ఒక వ్యక్తి ఈయన తలుపు కొట్టాడు. "అతనికి పూల దండ వేసి లోపలికి పిలవాలనిపించింది నాకు అప్పుడు" అని గుర్తు చేసుకుంటారు రెడ్డి. "ఏమిటి నీ సమస్య" అని అడిగారు అతన్ని. "నాకు ప్రాబ్లమేమీ లేదు. నా భార్యని గైనకాలజిస్ట్ దగ్గర చూపించడానికి వచ్చాను. తలుపు బయట రీప్రొడక్టివ్ బయాలజిస్ట్ అన్న పేరు చుసి అదేమిటా అని కనుక్కోవడనికి వచ్చాను" అని చెప్పాడ వ్యక్తి.

కొంత నిరాశ చెందినా చేయడానికి పనేమీ లేక పోవడంతో అతనితో కలిసి టీ తాగుతూ అతన్ని మాటల్లో పెట్టారు రెడ్డిగారు. ఆ వ్యక్తి ఒక ఉన్నత తరగతికి చెందిన ముస్లిమ్. పెళ్ళయి చాలా సంవత్సరాలయినా పిల్లలు లేరు. ఎన్నో పరీక్షలు చేయించారు. వాటిలో లోపమేమీ లేదు. సింగపూర్, బొంబాయిలో కూడా వైద్యులని సంప్రదించారు. చివరికి ఇక్కడ గైనకాలజిస్ట్(రెడ్డిగారి ప్రొఫెసర్) హస్తవాసి మంచిదని ఎవరో చెప్పడంతో ఇక్కడకి వచ్చారు. ఆమె ఈ వ్యక్తి భార్యకి లోపల అవయవాలు అన్నీ సరిగా ఉన్నాయో లేవో చూడడానికి ఆపరేషన్ చేయాలని ఎప్పడంతో ఆపరేషన్ కోసం తీసుకొచ్చాడు.
  
రిపోర్టులుఅన్నీ చూశారు రెడ్దిగారు. అన్నీ సరిగానే ఉన్నాయి. రెగ్యులర్‌గా మీ ఇద్దరూ సెక్సులో పాల్గొంటారా అనడితే, పాల్గొంటున్నామని చెప్పాడు ఆ వ్యక్తి. ఎక్కడో ఏదో తేడాగా ఉన్నట్టు అనిపించింది డాక్టర్‌గారికి. ఒక సారి ఆమెతో మాట్లాడవచ్చా అని అడిగారు. ఆమె పరదా వేసుకున్న సంప్రదాయా ముస్లిమ్ యువతి. ఆమెని పక్క రూమ్‌లో ఉంచి ఇంటర్‌కమ్‌లో ఒక నర్సుతో డాక్టరుగారు మాట్లాడి ఈయన అడిగే ప్రశ్నలని ఆ నర్సు పేషంటుని ఆడిగి ఆమె ఇచ్చిన సమాధానాలని ఆ నర్సు డాక్టర్‌గారికి చెప్పేది. అన్నీ సరిగానే ఉన్నాయి. కానీ ఎక్కడో ఏదో మిస్సవుతున్నట్లు అనిపిమ్చింది రెడ్డిగారికి. వాళ్ళు సెక్స్ చేసే విధానంలో ఏదో తేడా ఉందేమో, అసలు యోని మార్గం ద్వారా సెక్స్ చేస్తున్నారో లేదో తెలుసుకొమ్మని గైనకాలజిస్ట్ గారిని అడిగారు. ఈ వయసులో నేనెలా అడుగుతాను అని ఆమె నిరాకరించింది.

రాక రాక వచ్చిన కేసుని వదులుకోవాలని అనిపించలేదు ఈయనకి. తన అనుమానాన్ని నివృత్తి చేసుకోవడానికి మార్గంకోసం అమెరికాలోని తన టీచర్‌కి ఒక టెలిఫోన్ కాల్ బుక్ చేశారు. వజైనల్ స్వాబ్ తీసి చూడమని ఆయన ఒక సలహా ఇచ్చారు. ఆ సలహా పాటించడానికి ఆపరేషన్ వాయిదా వేయమని గైనకాలజిస్ట్‌ని రిక్వెస్ట్ చేశారు రెడ్డిగారు. ఒక ముప్పావు గంట వాయిదా వేస్తాను, ఆ తరువాత రాహుకాలం వస్తుంది కాబట్టి అంత కన్నా వాయిదా వేయలేను అని ఆవిడ అన్నారు. ఆ దంపతులకి ఒక రూమ్ చూపించి అందులో సెక్స్ చేయమని, ఆపరేషన్ లేకుండా వారి సమస్య తీరుతుందని చెప్పారు రెడ్డిగారు వారితో. ఆ తరువాత ఒక సీనియర్ పాథాలజిస్ట్‌తో ఆమె యోని మార్గంలో శుక్ర కణాలు ఉన్నాయో లేవో పరీక్ష చేశారు. అందులో శుక్ర కణాలు లేనే లేవు. అప్పుడు ఆ భర్తని ప్రశ్నిస్తే అసలు విషయం తెలిసింది. అతను లైంగిక కార్యం అంటే భార్య పైన పడుకొని కాస్సేపు ఊగి, ఆమె తొడల మధ్య స్ఖలించేవాడు. దానినే సెక్స్ అని భావిస్తూ వచ్చారు వాళ్ళు. ఆపరేషన్ రద్దు చేసి అతనికి సెక్స్ ఎలా చేయాలో చెప్పి పంపించారు నారాయణ రెడ్డి.
  
మూడు నెలల తరువాత అతను స్వీట్స్ పట్తుకొని ఆనందంగా వచ్చి రెడ్డిగారిని కలిశాడు. అతని భార్య గర్భం దాల్చింది అన్న వార్త చెప్పడానికి వచ్చాడు. ఆ విషయం చెప్పడానికి నారాయణ రెడ్డి పక్కనే ఉన్న గైనకాలజిస్ట్ చాంబర్‌లోకి వెళ్ళారు. అక్కడ పరదా ధరించిన ఆ యువతి ఒక పాకెట్‌లో పట్టు చీర, పండ్ల బుట్టతో గైనకాలజిస్ట్ దగ్గర కూర్చుని ఉంది. అప్పట్నుంచి అల్లాంటి కేసులని ఆ గైనకాలజిస్ట్ నారాయణ రెడ్డిగారికి రెఫర్ చేయడం మొదలు పెట్టారు. ఆ తరువాత రెడ్డిగారు వెనుతిరిగి చూడలేదు. 

Saturday, May 26, 2012

YSR పేరు FIR లో ఉండడం మహా పాపం, ఘోరాతి ఘోరం అని రాజీనామాలు చేసిన వాళ్ళు ఇప్పుడేమంటారో?!


జగన్ ఆస్తుల కేసులో దివంగత నేత, ప్రియతమ నాయకుడు రాజ శేఖర్ రెడ్డి పేరు చేర్చడం అన్యాయం అని. అదేదో చేయరాని నేరమైనట్టు రాజీనామాలు చేసి ఉప ఎన్నికలకు కారణమై, కోట్ల రూపాయల ప్రజా ధనం, ప్రజల కాలం వృధా చేస్తున్న నాయకులు ఇప్పుడు మోపిదేవి వెంకట రమణ తనని వాన్‌పిక్ ఫైలు మీద సంతకం పెట్టమని అప్పటి ముఖ్యమంత్రి చెబితేనే సంతకం చేశానని చెప్పాక ఏమంటారో. 
   


దివంగత నేత సాక్షాత్తూ దైవ స్వరూపుడు కాబట్టి ఇలాంటి పాపాలు ఆయనకి అంటవని, వీటన్నిటికీ ఆయన అతీతుడు అని, పులి కడుపున పుట్టేది పులే కాబట్టి, దేవుడి కడుపున పుట్టిన పిల్ల దేవుడు జగన్‌కి కూడా ఈ పాపాలు అంటవు కాబట్టి సీబీఐ విచారణలోంచి జగన్ పేరు తొలగించాలని అంటారేమో? 

Friday, May 25, 2012

ఆహా, ఏం ముద్దు గురూ!


సాధారణంగా ఇద్దరు ముద్దు పెట్టుకుంటే కూర్చునో, నించునో, పడుకునో పెట్టుకుంటారు. అమ్మాయిని వంచి ముద్దు పెట్టుకోవడం మరో స్టైల్, రిచర్డ్ గెరె శిల్పా శెట్టిని పెట్టుకున్నట్లు.
  
  
కానీ ఇద్దరు యోగా మాస్టర్లు ముద్దు పెట్టుకుంటే మాత్రం ఈ లెవెల్లో ఉంటుంది ఆ ముద్దు.

 

Saturday, May 19, 2012

ఇంటర్నేషనల్ హోమియో అంటే ఆ మాత్రం బాదుడు లేకపోతే ఎలా?


మొన్నీమధ్య నాకు బాగా తెలిసిన ఒకామె ఫోన్ చేసి తన మోకాళ్ళ నొప్పుల గురించి బాధను చెప్పుకొచ్చింది. అల్లోపతి డాక్టర్ ట్రీట్ మెంట్‌లో ఉందామె. "ప్రతి సారీ నెల రోజులు వాడమని రెండు వేల రూపాయలు మందులు రాస్తున్నారు. అంత పవర్‌ఫుల్ మందులు వాడడం వల్ల నా శరీరానికి ఏమవుతుందో అన్న భయం ఉంది. పైగా పూర్తిగా తగ్గుతాయన్న నమ్మకం నాకే కాదు, ఆ డాక్టర్‌కి కూడా ఉన్నట్టు లేదు. హోమియో ట్రై చేద్దామనుకుంటున్నాను. నీ అభిప్రాయం చెప్పు" అనడిగింది. నాకు డాక్టర్ ఫ్రెండ్స్ ఎక్కువమంది ఉండడం వలన మా బంధువులు, సన్నిహితులు ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్తే జేబులకి పడే చిల్లులు తక్కువగా ఉంటాయో అని తెలుసుకోవడానికి నన్ను సంప్రదిస్తుంటారు. నేనూ నా యధాశక్తి సలహాలో, సూచనలో ఇస్తూ ఉంటాను.


 
"పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడినందువలన కడుపులో అల్సర్స్, కిడ్నీలు పాడవడం లాంటివి జరుగుతాయి. హోమియోలో ఇలాంటి కాంప్లికేషన్స్ ఉండవు. పైగా చాలా చవకయిన విధానం. ఒకసారి ప్రయత్నించి చూడండి. తప్పు లేదు" అని చెప్పాను. తరువాత ఒక నెల రోజులకి ఆమె మళ్ళీ పోన్ చేసింది. "హోమియో సెంటర్‌కి వెళ్ళాను. అక్కడ ఫ్రీ కన్సల్టేషన్ అన్నారు. కానీ ట్రీట్‌మెంట్ మొదలు పెట్టాలంటే ఇరవై వేలు కట్టాలని చెప్పారు. మళ్ళీ వస్తానని చెప్పి వచ్చేశాను" అని చెప్పింది ఆమె. నేను అవాక్కయ్యను. ఇదేదొ ఆపరేషన్‌కి అయ్యే అమౌంట్. సాధారణంగా హోమియోలో అంత బాదుడు ఉండదు. "ఇంతకీ మీ హోమియో డాక్టర్ ఎవరు" అనడిగాను. రోజూ పేపర్లలో, టీవీ చానళ్లలో ఊదరగొడుతున్న ఒక ఇంటర్నేషనల్ హోమియో చైన్ పేరు చెప్పింది.


"అదేనమ్మా మీరు చేసిన తప్పు. హోమియో పట్ల ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని క్యాష్ చేసుకోవడానికి పుట్టిన పుట్టగొడుగుల్లాంటివి ఇవి. అయినా ఊరు ఊరునా బ్రాంచిలు పెట్టి అన్ని బ్రాంచిల్లో ఒకేలాంటి హోమియో వైద్యం అందిస్తామంటే వీలుకాదు. మారుతీ కారు ఎక్కడ కొన్నా ఒకేలా ఉంటుంది. కానీ వైద్యం అలా కాదు. వైద్యుడిని బట్టి మారుతూ ఉంటుంది. కాబట్టి ఈ ఇంటర్నేషనల్ వైద్యాన్ని వదిలి పెట్టి మీ ఊరిలో లోకల్‌గా ఉండే ఎవరైనా మంచి హోమియో డాక్టర్‌ని కలిసి వైద్యం మొదలు పెట్టండి. ఫలితం కనిపిస్తుంది" అని చెప్పాను.
 
ఈ మధ్య ఈ హోమియో చైన్ ఆఫ్ హాస్పిటల్స్ ఎక్కువ అయి టీవీ చానల్స్‌లో, పేపర్లలో అన్ని రకాల జబ్బులకీ తమ దగ్గర తిరుగు లేని వైద్యం లభిస్తుందని ఉదేస్తున్నాయి. హోమియో వైద్యం అన్నది ఒక బ్రాండ్ కాదు. అది పేషంటుతో మాట్లాడి, లక్షణాలను బట్టి చేసే వైద్యం. డాక్టరు డాక్టరుకీ మారుతూ ఉంటుంది. ఇరవై ముప్పై బ్రాంచిలు పెట్టి అన్ని చోట్లా ఒకే వైద్యం అందిస్తామని ఎలా చెప్తారో అర్ధం కాదు. తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉన్న వైద్యం హోమియో అన్న అభిప్రాయం ఈ చైన్ల వల్ల మారిపోయింది.