నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Monday, May 28, 2012

రేపటి నుండి ఎన్ని గుండెలు ఆగి పోతాయో, వాటికి ఓదార్పు ఎవరు ఇస్తారో?


అనుకున్నంతా జరిగిపోయింది. అందరూ భయపడిన ఉత్పాతం రానేవచ్చింది. యువనేత అరెస్టయ్యారు. ఆయన అరెస్ట్ కావచ్చు అన్న వార్తలు టీవీల్లో, పత్రికలలో చూసి తట్టుకోలేక అయిదారుగురు చనిపోయారంటారు. కొందరు గుండె ఆగి, మరికొందరు ఆత్మహత్యలు చేసుకొని చనిపోయారని భోగట్టా. అరెస్టయ్యే అవకాశం ఉందని అన్నందుకే అన్ని గుండెలు ఆగి పోతే, ఇప్పుడు తీరా అరెస్టు అయిపోయారని తెలిస్తే రేపటినుండీ ఇంకెన్ని గుండెలు ఆగిపోతాయో, ఎన్ని ప్రాణాలు టప టపా రాలిపోతాయో తలుచుకోవడానికే భయంగా ఉంది.
  
ఇంకా బాధ కలిగించే సంగతి ఏమిటంటే ఆ కుటుంబాలని ఓదార్చి, వారితొ కలిసి నేల మీద కూర్చుని వారిచ్చింది తిని, తాగి, సాక్షి కెమెరాలకి ఫోజులిచ్చి, వారి బుగ్గలు నిమిరి, వీపులు పామి ఓదార్చే చేతులు ఇప్పుడు కటకటాల వెనక ఉన్నాయే అని. భగవంతుడా ఏమిటీ వైపరీత్యం. బ్రదర్ అనిల్ ఇక ఈ బాధ్యత నీదే.

8 comments:

durgeswara said...

mee ru baadhyata brother in law kichcaaraa ?

idimkoka talaneppi kadaa jaganku ? imkedannaa pratyaamnaayam chudamdi raastrapjalamdaru gumdejabbulato hospitals ku cherakamumde

మధు said...

పొద్దున్న సాక్షి చుడలేదా?
18 మంది పొయారు గుందెపోటుతో
https://lh4.googleusercontent.com/-W2R-_v5UhH0/T8MRNC3oHAI/AAAAAAAAAuo/sFdByZVymJg/s912/D26298378.JPG

Praveen Mandangi said...

ఇందిరా గాంధీ చనిపోయినప్పుడు ఒక్క గుండె కూడా ఆగలేదు కానీ జగన్మోహనాసురుడి కోసం గుండెలు ఆగుతున్నాయంటే నమ్మడానికి మనం చెవుల్లో పువ్వులు పెట్టుకున్నాం కదా.

SNKR said...

గుండెపోటుగాళ్ళలో క్రిస్టియన్లు ఎంతమంది? రెడ్లెంతమంది? రెడ్డి కిరస్థానులెంత మంది? ఓదార్పు ఎప్పుడు చేస్తారు? ఎంతిస్తారు? లేటుగా జరిగే ఓదార్పులకు పావులా వడ్డి ఇస్తారా?
తెలంగాణా గుండెపోటు గుమ్మడీలను అమరుల లిస్టులోనూ, జగన్ లిస్టులోనూ చేరుస్తారని గ్యారంటీ ఎవరైనా ఇస్తారా? :))

Praveen Mandangi said...

తెలంగాణా మరణాలు గుండె పోటు మరణాలు కాదు. అవి పెట్రోల్ పోసుకున్న ఆత్మహత్యలు. జగన్ కోసం ఒక్కడు కూడా పెట్రోల్ పోసుకోడు. కేవలం గుండె పోట్లు వస్తాయి, అంతే.

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

బ్రదర్ అనిల్ అయితే ఇంగ్లీషులో ఓదారుస్తారని ఆయన భుజాల మీద ఈ బాధ్యత పెట్టాను. ఆయన వెంట అంబటి రాంబాబు, రోజా, లక్ష్మీ పార్వతి, విజయ చందర్, వాసిరెడ్డి పద్మ ...ఇలా బెటాలియన్ మొత్తం కదిల్తే ఉంటుంది చూడండి. నా సామి రంగా!! 18 చాలా తక్కువ. ఒక నెలా, రెండు నెలలు గడిచే సరికి అద్ అయిదారు వందలు దాటుతుంది చూసుకోండి. ఇందిరా గాంధీకి స్వంత పేపరు, చానలూ లేవు కదండి.ఒక్కో ఫామిలీకి ఓదార్పులో ఎంతిస్తారు, ఎప్పుడిస్తారు త్వరలో చెబుతారు.

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...
This comment has been removed by the author.
మధు said...

https://lh3.googleusercontent.com/-yfjx9opzaKY/T8RTDUhlP7I/AAAAAAAAAvA/LCuNTScMN40/s912/D192498366.JPGtoday 48.