నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Sunday, May 27, 2012

సెక్స్ ఎలా చేయాలో ఎక్కడ చేయాలో తెలియకుండానే సంవత్సరాల తరబడి కాపురం చేస్తున్న జంటలు-ప్రముఖ సెక్సాలజిస్ట్ డా.నారాయణ రెడ్డి గారి మొదటి కేసు


చెన్నైలో ప్రాక్టీస్ చేస్తున్న సెక్సాలజిస్ట్ డా.నారాయణ రెడ్డిగారు డా.ప్రకాష్ కొఠారి తరువాత దేశంలోనే నంబర్ టూ సెక్సాలజిస్ట్‌గా పేరు తెచ్చుకున్న నిపుణుడు. ఇప్పుడు అయన అప్పాయింట్‌మెంట్ కావాలంటే ఒకటి రెండు వారాలు వెయిట్ చేయాలి. కానీ ఆయన ప్రాక్టీసు మొదలు పెట్టాక తన మొదటి పేషంట్ కోసం ఆయన ఆరు నెలలు వేచి చూశారట.
  
1982లో సెక్సాలజిస్ట్‌గా ప్రాక్టీస్ మొదలు పెట్టాలని నిర్ణయించుకున్నాక ఆయనని చేలా మంది నిరాశపరిచారు. ఈ బ్రాంచిలో నీకు పేషంట్లె ఎవరూ ఉండరు, పైసా ఆదాయం రాదు అని నిరాశ పరిచారు. కానీ తను తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి రెడ్డిగారు ఒక క్లినిక్ తెరిచారు. "ఇలా సెపరేట్‌గా క్లినిక్ ఉంటే రావడానికి పేషంట్లు వెనుకాడుతారు. ఏదైనా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌లో కూడా ప్రాక్టీసు చేయి" అని కొందరు ఇచ్చిన సలహాతో చెన్నైలోని ఒక హాస్పిటల్‌లో కూడా ప్రాక్టీసు పెట్టారు. "సెక్సాలజిస్ట్ అని కాకుండా మరేదైనా పేరుతో ప్రాక్టీస్ పెట్టాలని ఆ హాస్పిటల్ మేనేజ్‌మెంట్ ఆయనకి ఒక నిబంధన విధించింది. "అదేదో మీరే చెప్పండి" అని అన్నారు ఈయన. Reproductive Biolgist అన్న బిరుదు ఇచ్చి ఒక గైనకాలజిస్ట్ పక్కన చాంబర్ కేటయించారు. ఆ గైనకాలజిస్ట్ ఈయనకి మెడికల్ కాలేజీలో ప్రొఫెసరే కాకుండా, వీరి ఇద్దరు పిల్లలని డెలివరీ చేసిన ఫామిలీ డాక్టర్ కూడా.
  
ఆరు నెలలు ఒక్క పేషంట్ కూడా రాలేదు. రోజూ పొద్దున్నే వచ్చి తన చాంబర్‌లో కూర్చోవడం మధ్యాహ్నందాకా పేషంట్ల కోసం ఎదురు చూసి వెళ్లడం ఇలా ఆరు నెలలు గడిపేశారు.  పుస్తకాలో, మేగజైన్లో చదివి నాలుగయిదు కప్పులు టీ తాగి సాయంత్రం తన క్లినిక్‌కి వెళ్ళేవారు నారాయణ రెడ్డి. అలా ఆరు నెలలు గడిచాక ఒక వ్యక్తి ఈయన తలుపు కొట్టాడు. "అతనికి పూల దండ వేసి లోపలికి పిలవాలనిపించింది నాకు అప్పుడు" అని గుర్తు చేసుకుంటారు రెడ్డి. "ఏమిటి నీ సమస్య" అని అడిగారు అతన్ని. "నాకు ప్రాబ్లమేమీ లేదు. నా భార్యని గైనకాలజిస్ట్ దగ్గర చూపించడానికి వచ్చాను. తలుపు బయట రీప్రొడక్టివ్ బయాలజిస్ట్ అన్న పేరు చుసి అదేమిటా అని కనుక్కోవడనికి వచ్చాను" అని చెప్పాడ వ్యక్తి.

కొంత నిరాశ చెందినా చేయడానికి పనేమీ లేక పోవడంతో అతనితో కలిసి టీ తాగుతూ అతన్ని మాటల్లో పెట్టారు రెడ్డిగారు. ఆ వ్యక్తి ఒక ఉన్నత తరగతికి చెందిన ముస్లిమ్. పెళ్ళయి చాలా సంవత్సరాలయినా పిల్లలు లేరు. ఎన్నో పరీక్షలు చేయించారు. వాటిలో లోపమేమీ లేదు. సింగపూర్, బొంబాయిలో కూడా వైద్యులని సంప్రదించారు. చివరికి ఇక్కడ గైనకాలజిస్ట్(రెడ్డిగారి ప్రొఫెసర్) హస్తవాసి మంచిదని ఎవరో చెప్పడంతో ఇక్కడకి వచ్చారు. ఆమె ఈ వ్యక్తి భార్యకి లోపల అవయవాలు అన్నీ సరిగా ఉన్నాయో లేవో చూడడానికి ఆపరేషన్ చేయాలని ఎప్పడంతో ఆపరేషన్ కోసం తీసుకొచ్చాడు.
  
రిపోర్టులుఅన్నీ చూశారు రెడ్దిగారు. అన్నీ సరిగానే ఉన్నాయి. రెగ్యులర్‌గా మీ ఇద్దరూ సెక్సులో పాల్గొంటారా అనడితే, పాల్గొంటున్నామని చెప్పాడు ఆ వ్యక్తి. ఎక్కడో ఏదో తేడాగా ఉన్నట్టు అనిపించింది డాక్టర్‌గారికి. ఒక సారి ఆమెతో మాట్లాడవచ్చా అని అడిగారు. ఆమె పరదా వేసుకున్న సంప్రదాయా ముస్లిమ్ యువతి. ఆమెని పక్క రూమ్‌లో ఉంచి ఇంటర్‌కమ్‌లో ఒక నర్సుతో డాక్టరుగారు మాట్లాడి ఈయన అడిగే ప్రశ్నలని ఆ నర్సు పేషంటుని ఆడిగి ఆమె ఇచ్చిన సమాధానాలని ఆ నర్సు డాక్టర్‌గారికి చెప్పేది. అన్నీ సరిగానే ఉన్నాయి. కానీ ఎక్కడో ఏదో మిస్సవుతున్నట్లు అనిపిమ్చింది రెడ్డిగారికి. వాళ్ళు సెక్స్ చేసే విధానంలో ఏదో తేడా ఉందేమో, అసలు యోని మార్గం ద్వారా సెక్స్ చేస్తున్నారో లేదో తెలుసుకొమ్మని గైనకాలజిస్ట్ గారిని అడిగారు. ఈ వయసులో నేనెలా అడుగుతాను అని ఆమె నిరాకరించింది.

రాక రాక వచ్చిన కేసుని వదులుకోవాలని అనిపించలేదు ఈయనకి. తన అనుమానాన్ని నివృత్తి చేసుకోవడానికి మార్గంకోసం అమెరికాలోని తన టీచర్‌కి ఒక టెలిఫోన్ కాల్ బుక్ చేశారు. వజైనల్ స్వాబ్ తీసి చూడమని ఆయన ఒక సలహా ఇచ్చారు. ఆ సలహా పాటించడానికి ఆపరేషన్ వాయిదా వేయమని గైనకాలజిస్ట్‌ని రిక్వెస్ట్ చేశారు రెడ్డిగారు. ఒక ముప్పావు గంట వాయిదా వేస్తాను, ఆ తరువాత రాహుకాలం వస్తుంది కాబట్టి అంత కన్నా వాయిదా వేయలేను అని ఆవిడ అన్నారు. ఆ దంపతులకి ఒక రూమ్ చూపించి అందులో సెక్స్ చేయమని, ఆపరేషన్ లేకుండా వారి సమస్య తీరుతుందని చెప్పారు రెడ్డిగారు వారితో. ఆ తరువాత ఒక సీనియర్ పాథాలజిస్ట్‌తో ఆమె యోని మార్గంలో శుక్ర కణాలు ఉన్నాయో లేవో పరీక్ష చేశారు. అందులో శుక్ర కణాలు లేనే లేవు. అప్పుడు ఆ భర్తని ప్రశ్నిస్తే అసలు విషయం తెలిసింది. అతను లైంగిక కార్యం అంటే భార్య పైన పడుకొని కాస్సేపు ఊగి, ఆమె తొడల మధ్య స్ఖలించేవాడు. దానినే సెక్స్ అని భావిస్తూ వచ్చారు వాళ్ళు. ఆపరేషన్ రద్దు చేసి అతనికి సెక్స్ ఎలా చేయాలో చెప్పి పంపించారు నారాయణ రెడ్డి.
  
మూడు నెలల తరువాత అతను స్వీట్స్ పట్తుకొని ఆనందంగా వచ్చి రెడ్డిగారిని కలిశాడు. అతని భార్య గర్భం దాల్చింది అన్న వార్త చెప్పడానికి వచ్చాడు. ఆ విషయం చెప్పడానికి నారాయణ రెడ్డి పక్కనే ఉన్న గైనకాలజిస్ట్ చాంబర్‌లోకి వెళ్ళారు. అక్కడ పరదా ధరించిన ఆ యువతి ఒక పాకెట్‌లో పట్టు చీర, పండ్ల బుట్టతో గైనకాలజిస్ట్ దగ్గర కూర్చుని ఉంది. అప్పట్నుంచి అల్లాంటి కేసులని ఆ గైనకాలజిస్ట్ నారాయణ రెడ్డిగారికి రెఫర్ చేయడం మొదలు పెట్టారు. ఆ తరువాత రెడ్డిగారు వెనుతిరిగి చూడలేదు. 

No comments: