నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Thursday, May 31, 2012

మళ్ళీ వందేళ్ళకి గానీ రాని ఆకాశంలో అద్భుతం శుక్ర గమనంTransit of Venus) జూన్ 6 న తప్పక చూడండి


జూన్ 6 ఉదయం ఆకాశంలో ఒక అద్భుత దృశ్యం సాక్షాత్కారమవుతుంది. Transit of Venus అని పిలిచే ఈ దృగ్విషయాన్ని శుక్ర గ్రహణంగా చెప్పుకోవచ్చు. భూమికి, సుర్యుడికీ మధ్య శుక్రుడు రావడం వలన ఇది ఏర్పడుతుంది. ఆ సమయంలో సూర్యుడి మీద శుక్ర గ్రహం ఒక నల్లటి మచ్చలాగా ఒక అంచు నుండి మరొక అంచుకి కదుల్తూ కనిపిస్తుంది. దీనినే Transit of Venus లేదా శుక్ర గమనం అంటారు. సూర్యుడికీ, భూమికీ మధ్య చంద్రుడు వచ్చినప్పుడు ఏర్పడే సూర్య గ్రహణం లాంటిదే ఇది కూడా. చంద్రుడి కన్నా శుక్ర గ్రహం నాలిగు రెట్లు పెద్దది అయినా చాలా దురంగా ఉండడం వలన సూర్యుడి మీద చిన్న చుక్కలా మాత్రమే కనిపిస్తుంది. కానీ సూర్య గ్రహణం కన్నా ఎక్కువ సేపు పడుతుంది ఈ శుక్ర గమనానికి. ఇంచు మించు ఆరు గంటల సమయం ఉంటుంది. ఈ శుక్ర గమనం జతలుగా వస్తుంది. ఇంతకు ముందు 2004 లో వచ్చింది. తరువాతిది డిసెంబర్ 2117లోనూ, డిసెంబర్ 2125లోనూ వస్తుంది. కాబట్టి మనకు ఈ అద్భుతాన్ని వీక్షించడానికి ఇదొక్కటే అవకాశం.
    
ఇది ప్రపంచంలో అన్ని చోట్లా ఒకేలా కనిపించదు. మన దేశంలో సూర్యోదయం నుంచి ఉదయం 10:30 వరకు కనిపిస్తుంది. కళ్ళతోనూ, ఎక్స్ రేలతోనూ, రేబాన్ లాంటి కళ్లద్దాలతోనూ చుస్తే కళ్ళకు ప్రమాదం జరుగుతుంది. ఈ అద్భుతాన్ని చూడ్డానికి మైలార్ ఫిల్టర్ కళ్ల జోళ్ళనే వాడాలి. ఇవి ఒక్కోజత పాతిక రూపాయలకే దొరుకుతాయి. 
  
Astronomy india సంస్థ వారు వీటిని సప్లై చేస్తున్నారు.astronomyindia.org అన్న వెబ్ సైట్‌లో ఇతర వివరాలు ఉంటాయి. లేదంటే 09440082627 నంబర్‌కి ఫోన్ చేసి శ్రీనివాస్ జావార్ అని వీరి ప్రతినిధితో మాట్లాడి నేరుగా వివరాలు తెలుసుకోవచ్చు. వీరికి ICICI,SBI,ఆంధ్రా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడాలలో అకౌంట్లు ఉన్నాయి. మనకి ఎన్ని కళ్ల జోళ్ళు కావాలో చెబితే మన ఆడ్రస్ ప్రకారం కొరియర్‌లో పంపడానికి ఎంత అవుతుందో చెబుతారు. ఆ ప్రకారం వీరి ఖాతాలో డబ్బు జమ చేస్తే మనకి కొరియర్ చేస్తారు. 

మన జీవిత కాలంలో ఒక సారి మాత్రమే వచ్చే ఈ అద్భుత దృశ్యాన్ని మిస్ చేసుకోవద్దు.

1 comment:

Anonymous said...

Useful info. Right more such posts. Not about Poonam Pandey or Sunny Leone.