నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Friday, April 8, 2011

సత్య సాయిబాబా ఏ స్థితిలో ఉన్నాడు? నిజం ఎందుకు బయటకి రావడం లేదు?


ರಾష్ట్రంలో గత పది పన్నెండు రోజులుగా అందరినీ వేధిస్తున్న సమస్య సత్య సాయి బాబా అరోగ్యం. ఆయన భక్తులకీ, విమర్శకులకీ, తఠస్థంగా ఉండే వారికీ ఎవరికీ సత్య సాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ICU  లో ఏం జరుగుతోందో అంతు బట్టడం లేదు. మీడియాని, సాయి బంధువులనీ, భక్తులనీ,పోలీసులని, చివరికి VIP లని ఎవరిని ఆయన్ని చూడ్డానికి సాయి ట్రస్టు వారు అనుమతించడం లేదు. 
 
వాజ్‌పాయి ప్రధానిగా ఉన్నప్పుడు నిర్వహించిన పోఖ్రాన్ అణు పరీక్షని భారత ప్రభుత్వం ఎంత గోప్యంగా ఉంచిందో ఇప్పుడు ఈ ట్రస్టు వాళ్ళు సాయి బాబా ఆరోగ్యాన్ని అంతకన్నా రహస్యంగా ఉంచుతున్నారు.


సోవియట్ యూనియన్ ముక్కలుగా విడిపోకముందు, ప్రచ్చన్న యుద్ధం తీవ్ర స్థాయిలొ ఉన్నప్పుడు సోవియట్ ప్రీమియర్ ఎవరైనా జబ్బుపడితే ఆయన చనిపోయినా ఆయన వారసుడిని ఎంపిక చేశాక గానీ ప్రపంచానికి ఆ సంగతి తెలిసేది కాదు. ఒక దేశాధినేత, అణు క్షణం యుద్ధం ముంగిట్లో ఉన్న పరిస్థితిలో దేశం నాయకుడు లేకుండా ఉందీ అంటే ఇబ్బందులు ఎదురవుతాయేమో అని భావించి వాళ్ళు అలా చేసి ఉండవచ్చు. ఇది అర్ధం చేసుకోదగ్గ విషయమే.
 
అమెరికాలో ఇటాలియన్ మాఫియా కుటుంబాలలో కూడా ఈ పద్ధతి పాటిస్తారట. ఒక కుటుంబానికి నాయకుడిగా ఉన్న వ్యక్తి ఏ రూపంలో అయినా మరణిస్తే తరువాతి నాయకుడిని ఎన్నుకొనేదాకా ఆ విషయం బయటకు తెలియదట. దీన్ని కూడా అర్ధం చేసుకోవచ్చు. నాయకుడు లేడని తెలిస్తే అవతల గ్రూపువాళ్ళు తమ వాళ్లని ఏమైనా చేయవచ్చు, లేదా తమ గ్రూపులోని వాళ్ళకు వల వేసి తమ వైపు తిప్పుకోవచ్చు.
 
కానీ సత్య సాయి బాబా కమ్యూనిస్టు దేశాధినేత కాదు, మాఫియా డాన్ కాదు. మరి ఎందుకింత రహస్యం. మీడియాని దూరంగా పెట్టడం ఆహ్వానించదగ్గ, హర్షించ దగ్గ విషయమే. కానీ ఆయన స్వంత కుటుంబీకులను బంధువులను ఆయనను చూసేందుకు అనుమతించక పోవడమేమిటి?


అంతకు మించి బాబాని దైవ స్వరూపంగా ఆరాధించే ఆయన భక్తులను కూడా దూరం పెట్టడం భావ్యమా? ఏ భక్తుల మూలంగా అల్లరి చిల్లరగా తిరిగే ఒక మామూలు వ్యక్తి బాబాగా, దైవంగా మారాడో, ఏ భక్తుల వాలన లక్షల కోట్లు( ఒకటిన్నర లక్ష కోట్లు అని పత్రికల కథనం) ఆర్జించాడో అలాంటి భక్తులక్కూడా వాస్తవాలు చెప్పక పోవడం ఎంతవరకూ సమంజసం. 

అసలు బాబా బతికే ఉన్నాడా? లేక వెజిటేటివ్ స్టేట్‌లో యంత్రాల సాయంతో అలా అలా లాక్కొస్తున్నారా? అలా అయితే ఎంతకాలం? ట్రస్టులో సభ్యులు తమ తమ వాటాలు పంచుకొని అన్ని విషయాలు సెటిల్ చేసుకొని అప్పుడు బాబా ఆరోగ్యం గురించిన అసలు సమాచారం అందిస్తారా?

2 comments:

Sree said...

ఇన్నాళ్ళూ ఆయన్ని ట్రస్టు చేసిన భక్తులు ఇప్పుడతని ట్రస్టును ట్రస్ట్ చెయ్యాలి తప్పదు మరి.

chandra sekhar p said...

yes ,its is very serious matter. theymust show baba tous at least in video . how ever indian culture taught us to have belief of elders and babas'along with their socalled followers who work for their wealth .