నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Friday, April 29, 2011

లక్షన్నర కోట్లు సంపాదించడానికి నాలుగు మార్గాలు


లక్షన్నర కోట్లు అంటే అందులో ఎన్ని సున్నాలున్నాయో చెప్పడం కూడా కొంచెం కష్టమే,లెక్కల్లో నిష్ణాతులైతే తప్ప. అయితే ఈ మధ్య ఈ సంఖ్య చాలా తరచుగా వినిపిస్తోంది. ఇంత పెద్ద మొత్తం ఈ మధ్య తరచుగా వినిపిస్తోంది. మామూలు మానవుడికి ఊహకి సైతం అందని ఇంత పెద్ద మొత్తాన్ని సంపాదించడం ఎలా అన్నదే ఈ పోస్టు టాపిక్

.1. తండ్రి కష్టపడి, కొండొకచో అడ్డ దారులు తొక్కి, అవసరమైన వారిని లంచం తోనో, బెదిరింపులతోనో లొంగదీసుకొని, మరీ అవసరమైతే ప్రత్యర్ధులని భయపెట్టడానికి మాఫియా అండ తీసుకొని మూడు నాలుగు దశాబ్ధాలు శ్రమించి ఒక వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మిస్తే, ఆయన వారసులు అదే దారిలో అంతే సామర్ధ్యంతో ఆ సామ్రాజ్యాన్ని నడిపిస్తే లక్షన్నర కోట్లకి అధిపతి కావచ్చు. ఉదా:ముఖేష్ అంబానీ

2. ప్రభుత్వంలో మంచి గిట్టుబాటు ఉన్న శాఖకి మంత్రి అయితే, సంకీర్ణ ధర్మం పుణ్యమా అని ఆ మంత్రిని గట్టిగా అదిలించడానిక్కూడా ప్రభుత్వాధినేతలు భయపడే స్థితిలో ఉంటే, దాన్ని ఆసరాగా చూసుకొని వాటంగా మాంఛి స్కాము చేసిపారేస్తే ఈ మొత్తాన్ని ఒకటో రెండో సంవత్సరాలలో నొక్కేయొచ్చు. ఉదా: స్పెక్ట్రమ్ రాజా.

3. తండ్రి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఆ పదవిని అడ్డుపెట్టుకొని అడ్డగోలుగా కావలసిన వాళ్ళకి భూములు పందేరం చేసి, వాళ్ళ చేత తన వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టించి తన కంపెనీల షేర్ విలువని ఆకాశానికి పెంచి, వాటిని అమ్మి అమాంతం లక్షన్నర కోట్లీశ్వరుడై పోవచ్చు. ఉదా: జగన్ మోహన్ రెడ్డి.

4. అల్లరి చిల్లరగా తిరుగుతూ, ఎందుకూ పనికి రాడని అనిపించుకొని ఒక సుముహూర్తాన కాషాయం ధరించి బాబా అవతారమెత్తి, కనికట్టు, గారడీ విద్యలతో భక్తులను ఆకర్షించి, ఆశ్రమాలు కట్టి ఒక జీవిత కాలంలో దీన్ని సాధించవచ్చు. ఉదా: భగవాన్ శ్రీ సత్య సాయి బాబా.

వీళ్ళు కాకుండా ఈ లిస్టులో నారా చంద్ర బాబు నాయుడుని, కే సీ ఆర్ ని కూడా చేర్చ వచ్చు అని నా ఉద్ధేశ్యం. కాకపోతే బాబుని ఎంత మంది విమర్శించినా రెండెకరాల అసామీ పాతిక వేల కోట్లు ఎలా సంపాదించగలిగాడు అని విమర్శిస్తారే గానీ ఎవరూ లక్షా యాభయి వేల కోట్లు అన్న ఫిగర్ వాడలేదు కాబట్టి ఈ లిస్టులో ఎక్కించలేదు. ఇక తెలంగాణా ఉద్యమం ఊపందుకున్నాక కేసీఆర్ అండ్ ఫ్యామిలీ తమ స్థిర చరాస్తుల విలువ లక్షన్నర కోట్లు దాటించి ఉంటారని నాకనిపించినా తగిన ఆధారాల్లేవు కాబట్టి మినహాయించాల్సి వచ్చింది.

ఈ లిస్టులో ముఖేష్ అంబానీ, సాయి బాబాలె తమ దగ్గరున్న డబ్బుతో నలుగురికీ కొంచెం ఉపయోగపడే పనులు చేశారేమోననిపిస్తుంది.

4 comments:

Anonymous said...

well said.

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

Thank you,sir.

Anonymous said...

మంచి పాయింట్ తీశారు. బాగుంది. కానీ ఈమధ్య జగన్ గాడి భజన బ్లాగులు(జైజై నాయకా, లాహిరి, మన జగన్, మయూఖ మొ..వి) ఎక్కువైపోయాయి బ్లాగులోకంలో(వాడి దగ్గర డబ్బులు తీసుకుని రాస్తున్నవారయినా ఉండాలి...లేదా కులపిచ్చిరెడ్లయినా అయి ఉండాలి). వాళ్ళ దాడిని ఎదుర్కోడానికి సిద్ధమై ఉండండి.

Anonymous said...

"కానీ ఈమధ్య జగన్ గాడి భజన బ్లాగులు(జైజై నాయకా, లాహిరి, మన జగన్, మయూఖ మొ..వి) ఎక్కువైపోయాయి బ్లాగులోకంలో(వాడి దగ్గర డబ్బులు తీసుకుని రాస్తున్నవారయినా ఉండాలి...లేదా కులపిచ్చిరెడ్లయినా అయి ఉండాలి)."

Good observation. You can add the following reasons also. 1) kirastaani పిచ్చి 2) political పిచ్చి

YSR, Jagan and Anilkumar were the three most corrupt persons for the last 100 years. Anilkumar uses Helicopters regularly.