నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Friday, April 8, 2011

అంటరాని వాళ్ళని అంటరాని వాళ్ళగానే చూడాలి


ప్రపంచ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్ తరువాత డిప్లొమాటిక్‌గా మాట్లాడి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తిన షాహిద్ ఆఫ్రిదీ పాకిస్తాన్‌కి పోగానే తను తగిలించుకున్న ముసుగుని తొలగించి భారత జట్టు మీద , భారత మీడియా మీద, గౌతమ్ గంభీర్ మీద విషం కక్కి తన అసలు రూపాన్ని ప్రదర్శించాడు. అయితే ఇంతలో IPL మొదలు కావడం అందులో తమ దేశానికి చెందిన ఆటగాళ్ళెవరూ లేక పోవడం చూసి కడుపులో మంట రేగి జరిగిన నష్టాన్ని తగ్గించే ప్రయత్నాలు మొదలు పెట్టాడు.
 
2008 లో జరిగిన IPL-1 లో ఆఫ్రిదీని డెక్కన్ చార్జర్స్ జట్టు 675,00 డాలర్లు పోసి కొనుక్కుంది. ఆ సంవత్సరం మరొక పది మంది పాక్ ఆటగాళ్ళు IPL లో ఆడడం ద్వారా బాగానే డబ్బు సంపయింఛారు. అయితే ముంబాయి దాడుల తరువాత జనంలో వ్యతిరేకత వస్తుందేమోనన్న భయంతో పాక్ ఆటగాళ్ళని ఆడించడానికి అన్ని ఫ్రాంచైజీలు భయపడ్డాయి. 
 
రెండవ రౌండ్ వేలంలో వీళ్ళు ఉన్నప్పటికీ ఒక్క జట్టు కూడా వీళ్ళ కోసం బిడ్ చేయలేదు. ఇది అన్యాయమని షారుఖ్ ఖాన్ ఒక స్టేట్‌మెంట్ ఇవ్వగానే శివసేన విరుచుకు పడడంతో షారుఖ్ సైలెంటయి పోయాడు. IPL లో ఆడి సంపాయించిన డబ్బు గుర్తొచ్చిందేమో ఇప్పుడు ఆఫ్రిదీ మమ్మల్ని అంటరాని వారిగా చూడొద్దు. మమ్మల్ని కూడా IPL లో ఆడించండి అని ప్రాధేయపడుతున్నాడు. 


కానీ వీళ్ళని అంటరాని వాళ్ళగా చూడకుండా ఎలా ఉండాలో నాకర్ధం కావడం లేదు. ఆనాడు వాజ్‌పేయి లాహోర్‌కి బస్సు యాత్ర చేసినందుకు ప్రతిఫలంగా కార్గిల్‌ని కానుకగా ఇచ్చారు. మళ్ళీ కొన్నాళ్ళకి ఆ గాయాలు మర్చిపోయి పొన్లే పాపం ఎంతైనా మన దాయాదులు కదా అనే స్థితికి వచ్చేలోపే ముంబయి దాడులతో మళ్ళీ తమ నైజం చాటుకున్నారు. క్రీడలు, రాజకీయాలు వేరు వేరు అని ఎవరైనా వాదించవచ్చు. వీళ్ళూ ఆ తానులో ముక్కలే కదా?


పోనీ వీళ్ళు ఆ క్రీడనైనా సక్రమంగా ఆడుతారా అంటే అదీ లేదు. బాల్ ట్యాంపరింగ్ దగ్గర్నుండీ మ్యాచ్ ఫిక్సింగ్ వరకూ అన్ని అవలక్షణాలు ఉన్నాయాయె. సాక్షాత్తూ ఆ దేశానికి చెందిన క్రీడల మంత్రే, బాబ్బాబూ, మ్యాచ్ ఫిక్సింగ్ చేయకుండా ఆట మీద దృష్టి పెట్టండి అని వీళ్ళని అడుక్కొనే దశకి వచ్చాడంటే ఈ వీరుల క్రెడిబిలిటీ ఎంత మాత్రమో తెలిసి పోవట్లేదూ?
 
 
కాబట్టి ఆఫ్రిదీ భయ్యా, మేమే కాదు, మరి కొన్నేళ్ళ పాటు మిమ్మల్ని క్రికెట్ ప్రపంచం మొత్తం అంటరాని వాళ్ళగానే చూస్తుంది. అందులో తప్పేమీ లేదు.

4 comments:

Anonymous said...

"ఎంతైనా మన దాయాదులు కదా"....

ha!..ha!.. ha!..

What a joke. Did they ever think like this?

Relationship(s) can only be maintained when two sides agree for that. But they think that we are their enemy no. 1.

Saahitya Abhimaani said...

Allowing Pakistan to play in world Cricket itself is a mistake. Like South Africa was banned from playing in any world event for their apartheid policy during 1970s and 80s, Pakistan should be banned from any world event for their role in world terrorism.

రవి said...

క్రితం సారి ప్రపంచకప్పులో కోచ్ ను ఎవరు చంపారో అందరూ కన్వీనియంట్ గా మర్చిపోయారు. ఆ కోచ్ పాకిస్తాన్ కోచ్ అవడం యాదృచ్చికమేనా?

CHANDRA SEKHAR P said...

EXACTLY IT IS TRUE . ENTIRE WORLD CRICKET LOVERS AND PLAYERS SHOULD IMPOSE BAN ON PAK CRICKET TEAM LIKE SOUTH AFRICA.
PAKISTAN IS EVERYTIME HAVING UNWANTED QUARREL WITH INDIA IN ALL MATTERS .
WE LEFT PAK AT TIME OF LAL BAHADUR SASTRY 'S TIME . WE WOULD HAVE SMASHED IT PERMANANTLY EVEN THE WORLD MAY NOT ACCEPT IT.
HOW EVER SOME OF PAK LOVERS WHO ARE LIVING IN COUNTRY THEY MUST OPEN THEIR EYES AT LEAST NOW THAT PAK PLAYS ALWAYS A WORST ROLL IN OUR COUTRY'S MATTER