నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Friday, April 22, 2011

ముగ్గురు సాయి బాబాలు; మరి నాలుగో ఆయన ఎప్పుడొస్తాడో, ఎలా ఉంటాడో?


ఇది ముగ్గురు సాయి బాబాల కథ. రెండు శతాబ్ధాల కాలంలో వేద భూమిగా పిలవబడే భారత దేశంలో జరిగిన జరుగుతున్న కథ. 


మొదటి బాబా శిర్దీలో వెలసి, ఎలాంటి బిరుదులూ లేకుండా, కేవలం తన ఊరి పేరుతోనే శిర్దీ సాయి బాబాగా పిలవబడే ఒక నిరాడంబర సన్యాసి. ఆయన తనకి మహిమలున్నాయని చెప్పుకోలేదు. ఆయన వల్ల తమ కష్టాలు, రోగాలు రొష్టులూ తగ్గాయని నమ్మిన జనమే ఆయన్ని దేవుడిని చేశారు, ఆరాధించారు. ఆయన గాలిలోంచి విభూది పుట్టించలేదు, శూన్యంలోంచి ఉంగరాలు, నోట్లోంచి లింగాలూ తీయలేదు. Miracles are my visiting cards అని మార్కెటింగ్ చేసుకోలేదు. నిరాడంబరంగా జీవించి అలానే మరణించాడు. ఆయన చనిపోయాక ఆయన కోసం ఆయన భక్తులు పాలరాతి మందిరాలు, విలాసవంతమైన గుళ్ళూ,గోపురాలు కట్టారు అంతే.
 
ఇక బాబా నంబర్ టూ మన రాష్ట్రంలోనే పుట్టపర్తిలో ఉన్న సత్య సాయి. ఈయన మొదట్లో పాపం డబ్బులూ, కానుకలు ఇచ్చే భక్తులు లేక సింపుల్‌గా ఇన్నింగ్స్ మొదలు పెట్టినా అవి సమకూరేకొద్దీ లావిష్ స్వామీజీ అయ్యాడు. ఈయన చేయి గాల్లో తిప్పితే విభూధి పుట్టేది. శూన్యంలోంచి ఉంగరాలు. బంగారు గొలుసులూ, వాచీలూ పుట్టుకొచ్చేవి.
 


 కొంతమంది దుర్మార్గులు, రాక్షస అంశతో భూమ్మీద పుట్టిన వాళ్లు స్లో మోషన్ కెమెరాలతో వీడియో తీసి అదంతా చీప్ ట్రిక్ అని తేల్చినా స్వామి వారి ప్రభ ఏమాత్రం తగ్గ లేదు. అయితే ఈ స్వామి వారి మీద ఎన్నో అపవాదులు, నీలాపనిందలు, ఆరోపణలు వచ్చినా ఏవి కూడా నిరూపణ కాలేదు. అయినా ఈ దేశంలో స్వామీజీలను శిక్షించే ధైర్యం ఎవరికి ఉంటుంది?


ఇక నంబర్ త్రీ బాల సాయిబాబా.  ఈయన కూడా పెద్ద సాయి లాగానే విభూధి, ఉంగారాలు, గొలుసులు, వాచీలు, శివరాత్రి నాడు నోట్లోంచి లింగాలు తీసి ఫక్టు డూప్లికేటు అనిపించుకున్నా ఈయనకి కూడా మంచి మార్కెట్ తయారయింది. భూ ఆక్రమణలూ, చెక్ బౌన్స్ ఇత్యాది ఆరోపణలెన్ని ఉన్నా, కోర్టు మెట్లెక్కి నిందితుడు అనిపించుకున్నా స్వామి వారి ప్రభ ఏమాత్రం తగ్గలేదు. మేడ్ ఇన్ చైనా డూప్లికేటు వస్తువులకు మార్కెట్లో మంచి గిరాకీ ఉన్నట్లే, డూప్లికేటు స్వామీజీలకి కూడా మార్కెట్ ఉంటుందని నిరూపించిన మార్కెటింగ్ మాంత్రికుడీయన.
 ఇక సత్యసాయి సెలవు తీసుకొనే క్రమంలో ఉన్నందున ఆయన స్థానాన్ని భర్తీ చేయడానికి మరొక స్వామి తెర పైకి రావలసిన అవసరం ఎంతైనా ఉంది. జుట్టు పెంచుకొని, కాషాయం గుడ్డలేసుకొని, బుల్లి సాయిబాబా అని పేరు పెట్టుకొని ఓ నాలుగు వేదాంతం ముక్కలు చెప్పగలిగిన వారికి ఎమ్తైనా డిమాండ్ ఉంటుంది. చూద్దాం.

22 comments:

Anonymous said...

meeru karnataka nundi monna 'puttaparthi'ki vachi hungama chesina "siva sai baba" ni marchipoyaru :-) ante ippatike iddaru ready gaa unnaru. benga padakandi, veellu poye sariki inko naluguru puttukostaaru :-)

శరత్ కాలమ్ said...

నన్ను ప్రయత్నంచి చూడమంటారా?

Praveen Mandangi said...

చేతి నుంచి విభూతి తీసే టెక్నిక్ 2006లో నేర్చుకున్నాను. నేనూ నా పేరుని ప్రవీణానంద స్వామి అనో, ప్రవీణాచార్య అనో మార్చుకుని దొంగ సన్నాసి అవతారం ఎత్తగలను.

Anonymous said...

SARATH &PRAVEEN ,
BAVA AND BAAVAMARIDI .DO IT IMMEDIATELY .ALL THE BEST FOR U.

Praveen Mandangi said...

గేగాడు నాకు బావెలా అవుతాడు? నీ లాంటి చిలిపిగాళ్ళకే అవ్వొచ్చు.

Anonymous said...

ప్రవీణ్

కె వ్వ్ వ్వ్ వ్వ్ వ్వ్ ...

ఆ అజ్నాత ఇక ఉరి పోసుకోవాల్సి౦దే నీ వ్యాఖ్య కి

Anonymous said...

ఆయన రావలను కొన్నపుడు వస్తాడు. ఎమీ రాబోయే వారిని కూడా తిట్టాలనుకొని ప్రిపేర్ అయిపోయినట్లున్నరు.
---------------------------
ఒకప్పుడు పిసి సర్కార్ అని ఒక ఒవర్ యాక్షన్ గాడు ఈయన మీద అనవసరం గా నోరు పారేసుకొన్నాడు. పోని పి సి సర్కార్ గారే ఈ వ్యాపారం మొదలు పెట్టవచ్చుకదా! బెంగాలి గాళ్ళ కి కొవ్వు ఎక్కువ, మింగడానికి మెతుకులులేక పోయినా, గొప్పవారమనుకొంటారు. తమిళుల పైత్యం తెలుగు వారికి ఎలా తెలుసో బెంగాలి వారితో కలసి పని చెస్తే వారి ఓవర్ కాంఫిడెన్స్ అర్థమౌతుంది.
----------------------------------
వీళ్ళకి మెతుకులు లేక పోవటానికి మొదటి కారణం ఎర్ర పార్టివారి రేషనల్ థింకింగ్! డిల్లీ లో వారిని చూడాలి నెత్తిన నూరు రూపాయలు పేడితే పైసా విలువ చేయని నార్త్ ఇండియా వారితో రాసుకొని పూసుకొని తిరుగుతూంటారు. ఎందుకంటే మొన్నటివరకు కలకత్తా లో ఒక్క ఉద్యోగం దొరికేది కాదు. అందరు డీల్లీ , బెంగలూరు మీద పడి పోట్ట పోసుకొనే వారు. ఇక వీరికి తమ బెంగాలి కల్చర్ ముందర దేశాంలో ఏ కల్చర్ గొప్పది కానట్లు మాట్లాడుతారు. ఒకడు అమేరికాలో బిక్రం యోగా పెట్టి పేటంట్ తీసుకొన్నాడు. అతని ఇంతర్వ్యు చదివితే గర్వం, పొగరు అంటే ఎమీటో అర్థమౌతుంది. బాబా ఎంత సౌమ్యుడో తెలుస్తుంది.

Ram

Anonymous said...

వీళ్ళకి మెతుకులు లేక పోవటానికి మొదటి కారణం ఎర్ర పార్టివారి రేషనల్ థింకింగ్! ఆపార్టిని చదువుకొన్న వారి అధికారమిచ్చి, వారీ బ్రతుకులను అక్కడ గడపలేక దేశం మీద పడ్డారు. ఆరేషనల్ పార్టి వారు చాలా అంతా రేషనల్ గా ప్రతి పరిశ్రమని మూసుకొంటూ చదువుకొన్న వారిని బయటకు నేట్టారు. ఇది అందరికి తెలిసిందే కదా!

Praveen Mandangi said...

నువ్వు చెప్పేదేమిటి? దొంగతనాలని విమర్శించేవాడు చేతనైతే దొంగతనాలు చేసుకుని బతకాలనా?

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

సారీ.శివ సాయి బాబా గారి గురించి మర్చిపోయినందుకు. నిజాయితీగా చెప్పాలంటే నిన్నటి వరకూ ఆ మహనీయుడి గురించి నాకు తెలియదు. శరత్, నాకెందుకో ఈ పదవికి నువ్వు అన్ని విధాలా అర్హుడివనిపిస్తుంది. కొంచెం ట్రై చేసి చూడరాదూ. ప్రవీణ్, విభూధితో బాటు వాచీలు, గొలుసులు, ఉంగరాలు తీసిననాడు మీకు అన్ని విధాలా అర్హత లభిస్తుంది.

ఇక బెంగాలీల గురించి ఎనోనిమస్ చెప్పింది తప్పేమో అనిపిస్తుంది. మన స్వాతంత్ర పోరాట చరిత్ర చదివితే ఎక్కడ చూసినా వాళ్ళే కనిపిస్తారు. అయినా ఒక వివేకానందుడు, సుభాస్ చంద్ర బోస్ చాలరూ ఈ వ్యాఖ్య తప్పు అని నిరూపించడానికి.

Anonymous said...

కృష్ణగారు, మీరు బాబా వలన మోసపోయారా? మోసపోతే ఎలా మోసపోయారో రాయండి. ఆయనకు డబ్బులు ఇచ్చినవారిలో కనీసం 0.05% మంది కూడా మేము బాబాకు డబ్బులిచ్చి మోసపోయామని ఎక్కడ ఫిర్యాదు చేయలేదు. ఇక మీరేందుకు రోజు ప్రజలను కళ్ళు తెరవాలి, మేలుకోవాలి అని తెగ వర్రి అవుతున్నారు. ముందర కళ్ళు మీరు తెరవండి. మీరే మైన మోసపోయి ఉంటే దాని గురించి రాయండి. వీలైతే పోలిస్ స్టెషన్ లో కంప్లైంట్ ఇవ్వండి. ఊరకనే ఇలా గాసిప్ పేపర్ "తెలుగు వెలుగు" చదివి మీరు మరింత గాసిప్ రాయకండి. సాక్ష్యాలు లేకుండా ఇతరుల నెత్తిన బురద చల్లడానికి మీకున్న అర్హత ఎమీటీ? మీరేంత వరకు నిజాయితి పరులు?
-----------------------------------
ప్రవీణ్ నీ సంగంతి బ్లాగ్ లోకం లో అందరికి తెలుసుకనుక నేను నీ వ్యాఖ్యలను పట్టించుకోను. నేను అడిగిన ప్రశ్న కు సమాధానం తెలియని ఈ బ్లాగు రచయిత నిజాయితి అందరికి ఈ పాటికే అర్థమైఉంట్టుంది. ఇతనికి తెలుగు వెలుగు పేపర్ వారికి పెద్ద భేదమేమి లేదు. ఇక మీ రాతలు చదివేవారికి స్పష్ట్టంగా అర్థమయ్యేది ఇతరులకు ఎమీటంటే మీలో ఉన్నా ఈర్ష్యా, అసూయలు. అది ఒక్కొకరి కి ఒక్కొవిధంగా ఉంటాయి. నా కాలేజి రోజుల్లో ఒక మిత్రుడు ఇలాగే బాబాని దుమ్మెత్తి పోస్తూండేవాడు. నాకైతే బాబా మీద అభిమనం లేవు. కాని హద్దులు దాటి తీవ్ర విమర్శలు చేసేవాడు. అతనికి కనీసం పుట్టపర్తి ఎలా ఉంట్టుందో, ఎక్కడ తెలియను కూడా తెలియదు. తరువాత కొన్ని రోజులకు నాకు తెలిసినది ఎమీటంటే అతను ఎర్ర, హేతువాద సాహిత్యం ఎక్కువగా చదివి, బాబాని ద్వేషించటం మొదలుపేట్టాడు అంతే. కట్ చేస్తే వ్యక్తిగతం గా ఎన్నో మంచి గుణాలు ఉన్న ఇతను ఇప్పుడు జీవితంలో ఎక్కడో ఉండవలసిన వాడు ఇప్పుడు పెళ్ళాం పిల్లలను పోషించుకోవటానికి కష్ట్టపడుతున్నాడు. కారణం ఎర్ర, హేతువాద పుస్తకాలు చదివినపుడు ఎంతో తార్కికం గా కనిపిస్తాయి కాని జీవితంలో ఇతరులపై తెలియని ద్వేషాన్ని కలిగిస్తాయి. ఆ పుస్తకాలు చదివి బాగు పడిన మధ్యతరగతి వ్యక్తి లేదు, రాసిన రచయిత తప్ప. ఇప్పుడు విమర్శించే వారి వెనుకకుడా ఆ సైకాలిజి వుంది.
Ram

Anonymous said...

*మన స్వాతంత్ర పోరాట చరిత్ర చదివితే ఎక్కడ చూసినా వాళ్ళే కనిపిస్తారు. అయినా ఒక వివేకానందుడు, సుభాస్ చంద్ర బోస్ చాలరూ ఈ వ్యాఖ్య తప్పు అని నిరూపించడానికి. *

నాకు బెంగాలీల మీద సరి అయిన అవగాహన లేదు అని మీరేలాచెప్పగలరు. మీరు నెల్లూరి పెద్దారెడ్డి లాగ(బ్రహ్మనందం) మాటాల్డుతున్నారు. మీరు చెప్పిన రేండు పేర్లు 1900 సం||కాలం వారివి. నేను రాసినది 2010 పరిస్థితులను గురించి. ఇక స్వాతంత్ర పోరాటం లో పాల్గొన్న సుభాస్ చంద్ర బోస్ మీద వివేకానందుడి ప్రభావం ఎంతో ఉంది. కావాలంటే శ్యాం బెంగళ్ తీసిన సుభాస్ చంద్ర బోస్ సినెమా చూడండి. ఈ మేధావులందరు వివేకనందుడు చెప్పినదానిని నియో హిందూ భావజాలం అని పేరు పెట్టటం జరిగింది. హేతు,ఎర్ర పార్టిల వారు బెంగాల్లో గెలిచిన తరువాత వారి భావజాలం నింపడం కోసం పైన చెప్పిన వారిని నియో హిందూ భావజాలం పేరుతో వెనుకకు నేట్టారు. అది మీకు తెలిసినట్ట్లు లేదు. ఈ చదువుకొన్న పేద, మధ్యతరగతి ప్రజలు వీరిని సమర్దించారో, వారికి 30సం|| ఎర్ర పార్టి పాలించిన తరువాత మిగిలింది చేతీలో చిప్ప. స్వంత రాష్ట్రం లో అభివృద్ది ఉండదు, వున్న ఫాక్టరిలను మూసి వేశారు. బెంగాల్ నుంచి అభివృద్ది అంతా మొదట్లొ బాంబే కి,తరువాత గుజరత్ కి తరలి పోయింది. ఆర్ధికా అభివృద్ది ఎటూ లేదు. దినదినం దిగజారటం. ఈ పరిస్థితిల లో ఇతరులతో పోల్చుకొని వారు తమదంటూ గొప్పగా ఉంది అని చెప్పుకోవటానికి మిగిలింది వారికి వారి సాహిత్యమే. తమ చరిత్రను చూసుకొని గర్వించాలంటే ఇక వారికి మిగిలింది రవీందృని ,శరత్ చంద్ర చటర్జి మొదా||సాహిత్యం. వేరే ఊరికి వచ్చిన వారు ఈ సాహిత్య, ఆర్ట్ మొ|| కళాసేవ మటుకు మరచి పోరు. ఎలాగు డిల్లీ, బెంగలూరు లాంటి సిటిలలో కొంతకాలం పనిచేసి డబ్బులు సంపాదిస్తారు, వారి భాషకు గొప్ప చరిత్ర ఉంది ఈరేండూ చూసుకొని మళ్ళి అహంకారం మొగ్గతోడుగుతుంది. తమీళ పైత్యం వారి ఊరికి వేళితేనే తెలుస్తుంది. బయట ఊరిలో భాష (హింది) రాక నోరు తెరవరు. బెంగాలి వారు హింది చాలా బాగా మాట్లాడుతారు.

నేను రాసిన దానివేనుక ఇంత అర్థం ఉంది. మీరు చూడబోతే నెల్లురి పెద్దారెడ్డి లాగా "అదేట్టా అబ్బయా? బెంగాల్ గురించి నీకే తెలవనట్లుండాదే " అని నన్నంటారా?

Ram

Praveen Mandangi said...

http://telugu.stalin-mao.in/50502248

Anonymous said...

కృష్ణగారు,
బ్లాగులోకం లో వ్యక్తిగత వివరాలు తెలియవుకనుక కొన్నిసార్లు జావాబులిచ్చేటప్పుడు చాలా చీకాకు వెస్తుంది. వయసు,చదువు, హాబ్ మొద|| తెలిసితే జావాబిచేట్టపుడు ఇతరులకు అర్థమయ్యేవిధం గా ఇవ్వటానికి ప్రయత్నించవచ్చు. మీరడిగిన ప్రశ్నలు ఒక 7వ తర్గతి చదివేవాడు కొత్త బ్లాగు పెట్టుకొని ఎక్కడినుంచో సమాచారం కాపి పేస్ట్ వేశాడనుఒండి. పైన రాసిన నా సమాధానం ఎన్నో పుస్తకాలు, దశాబ్దపుకాలం నా పరీసీలన తో ఆ 7వ తరగతి చదివే వాడికి ఇవ్వవలసిన అవసరం లేదు కదా! చర్చ అnTTuu జరిగితే అభిప్రాయాలు మార్చు కొవాలను కొనే ఉద్దేశం ఉండేవారికి ఇంత పెద్ద సమాధానం ఇచ్చినా ఒక అర్థం ఉంట్టుంది. మీ లాంటి వారి అతి తెలివి ప్రశ్నలకు గొల్లపూడి గారు ఒక కాలం రాశారు. శంఖంలో పోసినది తీర్థం కనుక, అనటటి పెద్ద వ్యక్తి రాసినదాని చదివితే ఐనా మీలో ఎదైనా మార్పు వస్తుందేమో! ఈ క్రింది లింక్ ను చదవండి.
ఓ గుండయ్య కథ గొల్లపూడి మారుతీరావు

http://www.koumudi.net/gollapudi/041811_gundayya_katha.html

ఇతరుల కొరకు బాధ పడి మీది చాలా పెద్ద హృదయమని భ్రమపడకండి. బాబా కి డబ్బులిచ్చిన వారికి లేని బెంగ మీకేందుకు? ఎవరైనా డబ్బులు ఇచ్చినవారు ఆయనను నిలదీయాలి గాని మీలాగా ఆయనకు పైసా విదల్చనివారు రోజు బాబాల స్వాముల అసలు రూపం తెలుసుకోండి అని గొంతుచించుకోవటంలో అర్థం మీకు తెలియక పోయినా చదివే వారికి సుస్పష్ట్టం గా అర్థమౌతున్నది. దానికి ఒకటే కారణం ఈర్ష్యా, అసూయా, ఇతరులు సిద్దాంతాలు, వాదనలు,ఇజాలు లేకుండా ప్రేమతో ఇంకొకరికి సహాయం చేస్తుంటే చూడలేని కుళ్ళుమోతుతనం.

Ram

Praveen Mandangi said...

ఏ పనీ చెయ్యకుండా ఒక unproductive వ్యాపారం, అదీ మూఢనమ్మకాలూ & అజ్ఞానాన్ని పెంచిపోషించే వ్యాపారం చేసి కోట్లు విరాళాలు వసూలు చేసిన వ్యక్తి హాసిపిటల్‌లో ఉంటే మనం ఎందుకు జాలి పడాలి? ఈ ప్రశ్న గొల్లపూడి గారికి కలగలేదా? అజ్ఞానంతో వ్యక్తి పూజ చేసిన వాళ్ళ మీద జాలి పడాలి కానీ వాళ్ళ అజ్ఞానాన్ని క్యాష్ చేసుకున్న స్వయంప్రకటిత దేవుని మీద జాలి ఎందుకు? గొల్లపూడి గారి అభిమానుల్లో ఒక్కరికైనా ఈ డౌట్ రాలేదా? సైన్స్ విజ్ఞానం ఇంత అభివృద్ధి చెందిన తరువాత ఇంకా అజ్ఞానంతో సంతృప్తి పడడం ఎందుకు?

Anonymous said...

ప్రేమించి పెళ్ళిచేసుకొన్న పేళ్లాం ఇంట్లొ వుండగా మార్క్ గారు పనిమనిషి తో పిల్లలు ఎలా కన్నాడు? కన్నాడే పో దానిని ఎందుకు దాచి పెట్టాలని ప్రయత్నం చేశాడు? ఎంతో డబ్బులు, కుటుంబ హోదాను వదలుకొని ప్రేమించి పేళ్ళి చేసుకొన్నా మార్క్స్ భార్య అతనినిఏమని తిట్టాలి? అతని మిస్ బిహేవియర్ గురించి ఎవరిని ప్రశ్నించాలి? ముందరగా సమాధానం చెప్పు తరువాత ప్రశ్నలను అడుగుదువు గాని. నువ్వు దీనిని ఫాల్స్ ప్రాపగండా అని చెప్పకు. ఒకవేళ నీ దృష్ట్టిలో అది ఫాల్స్ ప్రాపగండా ఐనా ఈ ప్రశ్నకు ముందర సమాధానం చెప్పు. నువ్వు వడిగిన ప్రశ్నలకు జవాబిస్తాను.

Ram

Praveen Mandangi said...

సంబంధం లేని వ్యాఖ్యలు వ్రాయడానికి ఇది జురాన్ బ్లాగ్ కాదు. నువ్వు అరిగిపోయిన రికార్డ్‌లా ఎన్నిసార్లు ఆ పాట పాడినా నాకు వచ్చే నష్టం ఏమీ లేదు.

Anonymous said...

@ Pravin,
నీకు నష్టం రావటానికి నీ దగ్గర ఏమున్నదని పోగొట్టుకోవటానికి? తప్పెవరిదైనా వుంటే నీ లాటి వారి వ్యఖ్యలను ప్రచూరిస్తూ, పరోక్షం గా ఎంకరేజ్ చేసే బ్లాగు ఓనర్లన్లు పోగొట్టుకొంట్టున్నారు కొద్దొగొప్పో వారికి ఉండే పేరుని,గౌరవాన్ని.

Ram

Praveen Mandangi said...

ఏమీ తెలియనట్టు నటించకు. 2009లో మీరు జురాన్ బ్లాగ్‌లో అసంగత వ్యాఖ్యలు వ్రాసి టాపిక్‌లని డైవర్ట్ చెయ్యలేదా? నేను సినిమాల గురించి వ్రాస్తే మీరు అక్కడికి వచ్చి నేను వ్రాసిన వదిన-మరిది పెళ్ళి కథల గురించి ప్రస్తావించలేదా? నువ్వు ఎక్కడ అసంగత ప్రస్తావనలు తెచ్చినా భుజాలు తడుముకోవలసిన పని నాకు లేదు. ఇప్పుడేమో ఇన్నయ్య వ్రాసిన కట్టు కథని కాపీ & పేస్ట్ చేస్తున్నావు. మీకు అంత బైరాగి తెలివి ఉంటే మీరు పెట్టిన ప్రపీసస ఎందుకు మూతపడిందో మీ తలలోని జేజమ్మనే అడుక్కోండి. అంతే కానీ సమయం, సందర్భం లేకుండా అసంగత విషయాలు వ్రాయకు.

Sree said...

meerandaroo blagu bayataku velli kottukondra babu. chadavaleka chastunna.

Praveen Mandangi said...

ఇంతకు ముందు ఇదే వ్యక్తి జయహో అనే పేరుతో కామెంట్లు వ్రాసాడు. వేణూరాం (రాజ్ కుమార్ నీలం) అనే వ్యక్తి లాంగ్వేజ్‌కీ, ఇతని లాంగ్వేజ్‌కీ పోలిక కనిపించింది. గతంలో నేను రాజస్థాన్‌లో తీసిన ఫొటోలు పెట్టినప్పుడు వేణూరాం పేరుతో ఒక కామెంట్ వచ్చి 'నువ్వు తిరిగిన ప్లేసెస్ మాత్రమే నీకు తెలుసనుకోకు' అని అన్నాడు. చాలా రోజుల తరువాత పేరు మార్చి అదే స్టైల్‌లో కామెంట్ వ్రాసాడు 'నువ్వు తిరిగిన ఆంధ్రా, ఒరిస్సా, తమిళనాడు మాత్రమే నీకు తెలుసు అనుకోకు' అని. పేర్లు మార్చి వ్రాయడం, అజ్ఞాత పేర్లు పెట్టుకోవడం కొంత మందికి ఫాషన్.

ANALYSIS//అనాలిసిస్ said...

సాయిబాబా దేవుడా ? ...దెయ్యమా ?
see http://www.analysis-seenu.blogspot.com/ on 24-04-2011
ANALYSIS <<<>>> అనాలిసిస్