నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Friday, July 29, 2011

రాఖీ ప్యాంటీలతో తిప్పలు పడుతున్న ప్రొడ్యూసర్లు


షూటింగ్‌లో అవీ ఇవీ కావాలని నిర్మాతలని హీరోయిన్లు ముప్పు తిప్పలు పెట్టడం కొత్తేమీ కాదు. అయితే టీవీ షో ప్రొడ్యూసర్లకి ఈ కష్టాలు అంతగా ఉండవు. కానీ రాఖీ సావంత్ తన కొత్త రియాలిటీ షో "అజబ్ దేశ్ కీ గజబ్ కహానియా" నిర్మాతలని తనకి లేటెస్ట్ వెరైటీ ప్యాంటీలు తెచ్చి పెట్టమని తిప్పలు పెడుతుందట. ఈ షోకి సంబంధించిన షూటింగ్ మొదలయినప్పటినుంచీ రాఖీ చేస్తున్న డిమాండ్‌లతో, అవి తీర్చడానికి తమకి అవుతున్న ఖర్చులతో నిర్మాతల కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. 
 


రాఖీ అడుగుతున్నవి కొత్తగా మార్కెట్లోకి వచ్చిన C-స్ట్రింగ్ రకానికి చెందిన ప్యాంటీలు.  వీటికి, తాళ్ళు, బెల్టులు ఏమీ ఉండవు. C షేప్‌లో ఒక వైరు దాని చుట్టు ఒక గుడ్డ పీలిక ఉంటాయి అంతే. 


 
విదేశాల్లో కొత్తగా మార్కెట్‌లోకి వచ్చి హాలీవుడ్‌లో బాగా పాపులర్ అయిన ఈ రకం ప్యాంటీలను ధరించిన మొదటి సెలబ్రిటీ తనే కావాలని అమ్మడి పట్టుదల. ఎరుపు, పింక్, పర్పుల్ మూడు రంగుల్లో C-స్ట్రింగ్స్ వెంటనే తెప్పించాలని, లేకుంటే తను షూటింగ్ చేయనని అల్టిమేటమ్ పాస్ చేసింది రాఖీ. ఇప్పటికే అమ్మడి దుస్తుల ఖర్చు 70 లక్షలు అయింది అని నిర్మాతలు గుండెలు బాదుకుంటూ ఉంటే ఈ తాజా హెచ్చరిక వాళ్ళ నెత్తిమీద పిడుగు అయింది. కారణమేమిటంటే ఈ ముద్దు గుమ్మ మనసు పడ్డ ఈ పీలికలు మన దేశ మర్కెట్‌లో లభ్యం కాకపోవడమే. ఇక ప్యాంటీల షాపింగ్ కోసం  విదేశీ యాత్ర చేయడానికి నిర్మాతలు సిద్ధంగా లేరు. 





"అవున్నిజమే. నేను C- స్ట్రింగ్స్ కావాల్ని అడిగాను. పొట్టిగా, పల్చగా ఉండే డ్రస్సులు వేసుకున్నప్పుడు వాటి లొపల నుండి ప్యాంటీ కనిపించకుండా ఉండాలంటే C-స్ట్రింగ్స్ కావాలి. నేను వేసుకొనే డ్రస్సులకి C- స్ట్రింగ్స్ చాలా అవసరం. మన దేశంలో టెలివిజన్ తెర మీద C- స్ట్రింగ్స్ వెసుకునే మొదటి సెలబ్రిటీ నేనే అవుతాను" అంటూంది రాఖీ. 


"మేమేమైనా బ్లూ ఫిల్మ్ తీస్తున్నామా? లోపల ఏమి వేసుకున్నా బయటకి కనిపిస్తుందా ఏం? " అని లోలోపల సణుక్కుంటూ C- స్ట్రింగ్స్ వేటలో పడ్డారు ప్రొడ్యూసర్లు.

యెడ్యూరప్ప అనే అవినీతి వానపాముని పట్టేశారు. మరి అవినీతి అనకొండల మాటేమిటి?


మొత్తానికి యెడ్యూరప్ప పెట్టిన కండీషన్లు అన్నిటికీ ఒప్పుకొని, ఆయనని ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించి జబ్బలు చరుచుకుంటున్నారు కమలనాధులు. అయితే కర్ణాటకలో అవినీతికి మూలం కానీ, అంతం కానీ యెడ్డీ కానే కాదన్నది చిన్న పిల్లవాడికి కూడా తెలిసిన విషయం. అవినీతి మూల విరాట్టులూ, అవినీతి సామ్రాట్టులూ ఘనత వహించిన గాలి గార్లు అన్నది జగద్విదితం. ఆ గాలి జోలికి వెళ్ళే సాహసం బీజేపీ చేయగలదా? చేసి ఆ పెనుగాలి ప్రభావాన్ని తట్టుకొని నిలవగలదా?
   


గాలి బ్రదర్స్‌ని రాజీనామా చేయమనే ధైర్యం అద్వానీతో మొదలుకొని యెడ్డీ దాకా ఎవరికైనా ఉందా? అప్పుడెప్పుడో గాలి గారికి కోపం తెప్పించిన పాపానికి యెడ్యూరప్ప చావు తప్పి కన్ను లొట్టపోయి విలేఖరుల సమావేశంలో టీవీ కెమెరాల సాక్షిగా కన్నీరు పెట్టుకొన్న సన్నివేశం ఇంకా ఫ్రెష్‌గానే అందరి మనసుల్లో ఉంది కదా?
 
ఒక వేళ గాలి అండ్ కో జోలికి వెళ్ళే సాహసం లోటస్ బాసులు గనుక చేసినట్లయితే ఇక్కడ జగన్ చేస్తున్నకార్యక్రమం అక్కడ గాలి గార్లు పునరావృతం చేస్తారేమో? ఇప్పటికే చాలా దూరం వెళ్ళాము ఇంక చాలు అనుకొని సైలెంటయి పోతారు కానీ, దుస్సాహసంతో దక్షిణ భారతంలో అధికారంలో ఉన్న ఒకే ఒక రాష్ట్రాన్ని చేజార్చుకొనేంత అమాయకులా కమలనాధులు?

వయాగ్రాని కలిపి ఆయుర్వేదం పేరు చెప్పి అమ్ముతున్న కంపెనీలు


నపుంసకత్వం లేదా ఎరక్టైల్ డిస్‌ఫంక్షన్ అన్నది చాలా మగవారిని పీడించే చాలా సాధారణ సమస్య. డయాబెటీస్, అధిక రక్తపోటు లాంటి జబ్బుల వలన కానీ, ధూమ పానం, మద్య పానం లాంటి అలవాట్ల వలన కానీ, టెన్షన్, డిప్రెషన్ లాంటి మానసిక సమస్యల వలన కానీ ఇది అధిక శాతం మగవారిని వయసుతో సంబంధం లేకుండా పట్టి పీడిస్తూంది. అంగ స్థంభన కలిగించే సిల్డెనఫిల్, తడలాఫిల్, వర్డనాఫిల్ లాంటి మందులకి అనేక మిలియన్ డాలర్ల బిజినెస్ ఉంది. అయితే ఈ మందులు ఎక్కువగా వాడడం వలన సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయన్న భయం కూడా ఉంటుంది. ఈ భయాన్ని ఆయుర్వేద కంపెనీలు బాగా సొమ్ము చేసుకొంటున్నాయి.
 


అంగ స్థంభన కలిగించే అనేక మందులు మార్కెట్లో ఆయుర్వేద మందులుగా లభిస్తున్నాయి. అయితే అధిక శాతం ఆయుర్వేద మందులుగా చలామణి అవుతున్న వాటిలో సిల్డెనాఫిల్ లాంటి అల్లోపతీ మందులు కలిసి ఉంటున్నాయి. గుజరాత్ ఫుడ్ అండ్ డ్రగ్ కంట్రోల్ అధికారులు జీవన్ జ్యోతి కంపెనీ తయారు చేసే జోష్, జీవన్ జోష్ అనే మందులో, సన్ లాబొరేటరీ వారి, టైటానిక్ అనే మందులోనూ సిల్డెనాఫిల్ లేదా వయాగ్రా ఉన్నట్లు గుర్తించారు. 
   
హైదరాబాద్ కంపెనీ ఫిజికెమ్ లాబొరేటరీ తయారు చేసే ఓజోమెన్, ఓజోమెన్ ఫోర్ట్ అనే మందులలో కూడా సిల్డెనఫిల్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అలాగే ముస్లి పవర్ అన్న మందులో కూడా వయాగ్రా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఆయుర్వేదిక్ మందుల ముసుగులో సిల్డెనఫిల్, తడలాఫిల్ మందులు వాడడం వలన లైసెన్సింగ్ సమస్యలే కాదు, కొన్ని సార్లు ప్రాణాపాయం కూడా కలగవచ్చు. గుండె పోటు వచ్చి కొన్ని రకాల మందులు వాడే వారు ఈ మందులు తీసుకోకూడదు. అందు చేత ఆయుర్వేదిక్ మందులే కదా, అపాయమేమీ ఉండదు అని ఈ మందులు వాడితే అంతే సంగతులు.

బాబా రామ్‌దేవ్‌ని పెళ్ళాడుతానంటున్న రాఖీ సావంత్!


ఆక్సిజెన్ లేకపోతే ప్రాణులు ఎలాగైతే జీవించలేవో బాలీవుడ్ జీవులు వార్తల్లో లేకపోతే జీవించలేరు. నిత్యం ఏదో ఒకటి చేసో, వాగో వార్తల్లో ఉండాల్సిందే. మీడియా, ప్రింట్ కానీ విజువల్ కానీ ఎక్కువ అయ్యాక బాలీవుడ్ జీవుల దూల తీర్చే వాళ్ళు కూడా ఎక్కువయ్యారు. వార్తల్లోకి ఎక్కడం కూడా ఒక విధంగా లాభమే అని కనిపెట్టాక ఎదో ఒకటి చేసి సెన్సేషన్ క్రియేట్ చేసి దాన్ని తమకి లభించేలా చెసుకునే తెలివితేటలు కొంతమందికి వెన్నతో పెట్టిన విద్య అయింది. ఇందులో సిద్ధహస్తుడు మన రామ్ గోపాల్ వర్మ. ఈ బాపతు జీవి ఇంకొకటి ఉంది. దాని పేరు రాఖీ సావంత్. ముద్దుగా Motor mouth అని పిలుస్తారు ఈమె గురించి బాగా తెలిసిన వాళ్ళు. 

 
రాఖీ కా స్వయంవర్ అని ఒక ప్రోగ్రాం నడిపి అందులో సెలక్టయిన వాడిని పెళ్ళి చేసుకుంటానని చెప్పి చివరికి ఆ బకరాగాడికి హాత్ ఇచ్చి, ఆ పిమ్మట రాఖీ కా ఇన్సాఫ్ అనే ఇంకో ప్రోగ్రాంలో ఒక వ్యక్తిని నువ్వు నపుంసకుడివి అని అనుచితంగా మాట్లాడి అతని ఆత్మహత్యకి కారణమయిందని ఆ వ్యక్తి తల్లి కోర్టుకెక్కింది. ఇప్పుడు మళ్ళీ వార్తల్లోకెక్కింది రాఖీ. అయితే ఈ సారి ఎవరూ ఊహించలేని వ్యక్తిని టార్గెట్ చేసింది తన నోటితో. ఆయన బాబా రామ్‌దేవ్. అంతకు ముందు ముదురు బెండకాయ బ్రహ్మచారి రాహుల్ గాంధీని కూడా ముగ్గులోకి లాగింది. 


తన సరికొత్త టీవీ షో "గజబ్ దేశ్‌కీ అజబ్ కహానియా" ని ప్రమోట్ చేయడంలో భాగంగా మీడియాతో మాట్లాడుతూ తనకి రాహుల్ గాంధీ అంటే ఇష్టమని, కానీ బాబా రామ్‌దేవ్ అంటే పడి చస్తానని, స్వామి ఒప్పుకోంటే ఆయన్ని పెళ్ళి చేసుకుంటానని విలేఖరులతో చెప్పింది. బాబా రామ్‌దేవ్ అని పిలవనని ఆయన్ని తను స్వామి అనే పిలుస్తానని, ఈ సారి ఏ చానల్ అయినా తనతో స్వయంవర్ ప్రోగ్రామ్ పెడితే రామ్ దేవ్‌ని పిలవమని చెప్తానని, తనే స్వయంగా ఆయన్ని ఆహ్వానిస్తానని చెప్పింది రాఖీ. 

    
బాబాలో ఏమి నచ్చిందీ అని అడిగిన ప్రశ్నకి, రామ్‌దేవ్ చాలా సెక్సీగా ఉంటారు. అసలాయన పొట్టని చూశారా, ఎంత ఫ్లాట్‌గా ఉంటుందో? మాకు పెళ్ళయి మేము యోగా డీవీడీ రిలీజ్ చేస్తే అది శిల్పా శెట్టి డీవీడీ కన్నా బాగా సెక్సీగా ఉంటుంది, అని చెప్పి చివర్లో అసలు కారణం చెప్పింది. రామ్‌దేవ్ దగ్గర దండిగా డబ్బుంది. ఎప్పుడూ ఖరీదైన కార్లలో తిరుగుతూ ఉంటారు అని అసలు విషయం చల్లగా బయట పెట్టింది. 
 
బహుశా రామ్ దేవ్ బాబాని పెళ్లి చేసుకొంటే ఆయన తన ప్రైవేట్ ఐలాండ్‌లో తనని శోభనానికి తీసుకెళ్తాడని ఆశ పడుతుందేమో ఈ మోటార్ మౌత్. 


Monday, July 25, 2011

నీచ నికృష్ట పైశాచిక పరమ కిరాతక మగ ధీరలు


 భయమన్నది లేకుండా యుద్ధం చేసే వాడిని వీరుడు అంటారు. ఒకేసారి అనేక మందితో యుద్ధం చేసే వాడిని ధీరుడు అంటారేమో? మగధీర సినిమాలో కాలభైరవ వంద మందిని చంపికానీ చావడని సినిమాలో రెండు మూడు సార్లు చెప్పిస్తాడు దర్శకుడు. దానిని చివర్లో ఒక భీకర యుద్ధంలో చూపిస్తాడు. షేర్ ఖాన్‌ పంపిన సైతాన్ కి ఫౌజీలో వంద మందిని వీరోచితంగా చంపుతాడు కాల భైరవ. ఆ ధీరోచిత పోరాటం చూసి శత్రువు కూడా ముచ్చట పడుతాడు.

చేతిలో ఆయుధం లేని వాడిని చంపకూడదు అని చెప్తుంది హిందూ యుద్ధ ధర్మ శాస్త్రం. మహా భారతంలో చాలా చోట్ల నిరాయుధునితో యుద్ధం చేయనని చేతికి చిక్కిన శత్రువులని విడిచి పెట్టిన సందర్భాలు ఎన్నో. అభిమన్యుడిని నిరాయుధుణ్ణి చేసి, అందరూ చుట్టు ముట్టి చంపడం, శిఖండిని చూసి విల్లు పక్కన పడవేసిన భీష్ముడిపై అర్జునుడు బాణాలు వేయడం లాంటివి అసాధారణ సంఘటనలుగా లెక్క వేయాలి. అందర్నీ పోగొట్టుకొని మడుగులో దాక్కున్న దుర్యోధనుడు బయటకి వచ్చి, మాలో ఎవరితో యుద్ధం చేస్తావో చెప్పు అని పాండవులు అడిగినప్పుడు, గదా యుద్ధంలో ఒక్క భీముడు తప్ప వేరెవ్వరూ తనకి సమ ఉజ్జీలు కాదని తెలిసి కూడా భీముడినే యుద్ధానికి ఆహ్వానిస్తాడు. వీరుడి లక్షణమంటే అది.

 
నిరాయుధులనీ, సాధారణ పౌరులనీ వరుసలో నించోబెట్టి కత్తులతో నరకడంలో పోటీ పడి అది వీరత్వం అనుకునే వాళ్ళని ఏమనాలి. ఇద్దరూ సైన్యాధికారులు తమ వీరత్వానికి ఇలాంటి పైశాచిక పోటీ పెట్టుకొని ఆనందం పొందితే వాళ్ళని పశువులు అంటే అది ఆ మూగ జీవాలని అవమానించడం అవుతుంది. ఇది జరిగింది 1937 లో అప్పటి చైనా రాజధాని నాన్‌కింగ్‌లో. ఈ నీచ కార్యానికి ఒడబడింది చైనాని ఆక్రమించుకున్న జపాన్ సైన్యంలోని ఇద్దరు అధికారులు.


1937లో జరిగిన రెండవ చైనా జపాన్ యుద్ధంలో అప్పటి చైనా రాజధాని నాన్‌కింగ్‌ని జపాన్ ఆక్రమించుకొంది. ఈ ఆక్రమణలో భాగంగా జపాన్ సైనికులు నాన్‌కింగ్ ప్రజల మీద అంతులేని దురాగతాలకి పాల్పడ్డారు. జపనీయులు రాజధానిని ఆక్రమించుకోవడం తధ్యమని తెలుసుకున్న చైనా ప్రభుత్వం నాన్‌కింగ్‌ని ఖాళీ చేసి వెళ్తూ చివరి రక్తపు బొట్టు వరకూ పోరాడమని తన సైనికులకి ఆర్డర్ పాస్ చేసింది. అంతకు మునుపు షాంఘై నగరాన్ని ఆక్రమించుకొని జపాన్ సైనికులు అక్కడ చేసిన దురాగతాలు బాగా తెలిసిన సైనికులు తమ యూనిఫామ్ విప్పేసి సాధారణ ప్రజలలో కలిసి పోయారు. మరో వైపు ప్రజలు నగరాన్ని ఖాళీ చేయకుండా నగరం చుట్టూ సైనికులని కాపలాగా పెట్టింది చైనా ప్రభుత్వం.


ఇలాంటి పరిస్థితులలో జపాన్ ఇంపీరియల్ ఆర్మీకి చెందిన సైనికులు నాన్‌కింగ్‌లో ప్రవేశించారు. వచ్చీ రాగానే తమ రాక్షసత్వాన్ని ప్రదర్శించారు. సైనికులు, ప్రజలు అన్న తేడా లేకుండా కనిపించిన వారిని కనిపించినట్లు చంపడం, చిన్నా పెద్దా, ముసలీ ముతకా అన్న తేడా లేకుండా ఆడవారిని మాన భంగం చేయడం మొదలు పెట్టారు. ఈ అకృత్యాల గురించి తెలిసినా జపాన్ ప్రభుత్వం తన సైనికులని వీసమెత్తు మాట అనక పోవడం వారిని మరింత ప్రోత్సహించినట్లయింది. సైనికులు తమ ఇష్టమొచ్చినట్లు దోపిడీలు, మాన భంగాలు చేయవచ్చని సైన్యాధికారులు తమ సైనికులకి ఆగ్న ఇచ్చినందువల్లనే వారు షాంఘై నుండి నాన్‌కింగ్‌కి ఆఘమేఘాల మీద దాడి చేయడానికి వెళ్ళారు అని అప్పట్లో సైన్యం వెంబడి ఉన్న ఒక విలేఖరి రాశాడు.
  
ఈ అకృత్యాలు అన్నింటిలోకి మరీ దారుణమైనది ఇద్దరు జపాన్ సైన్యాధికారుల తమ మధ్య పెట్టుకున్న పోటీ. ఇందులో ఎవరు ముందుగా కత్తితో వంద మందిని చంపుతారు అన్నది పోటీ. ఈ పోటీ గురించి అప్పట్లో టోక్యో నిచి నిచి షింబున్ అన్న పత్రికలో, ఇంగ్లీషు భాషలో వచ్చే జపాన్ అడ్వర్టైజర్ అన్న పత్రికలోనూ  క్రీడల పోటీలకు ఇచ్చినట్లు కవరేజ్ కూడా ఇచ్చారు.
 
ఈ అమానుషమైన పోటీలో పాల్గొన్న అధికారులు తోషియాకి ముకాయి, తుసుయోషి నోడా అన్న ఇద్దరు రాక్షసులు. పోటీ ఏమంటే ఇద్దరిలో ఎవరు ముందుగా వంద మందిని కత్తితో నరికి చంపుతారు అని. వీళ్ళ కత్తులకి బలిగా సాధారణ ప్రజలని చేతులు వెనక్కి విరిచి కట్టి నించో బెట్టారు వీరి కింద పని చేసే సైనికులు. అయితే ఆ చంపడంలో ఇద్దరూ పూర్తిగా మునిగి పోయి ఆ రాక్షసానందం అనుభవించడంలో వంద మందితో ఆగకుండా చంపుకొంటూ పోవడం వల్ల పోటీలో ఎవరు నెగ్గారు అన్నది నిర్ధారణ చేయడం కష్టమయింది అని డిసెంబరు 13, 1937 నాటి టోక్యో నిచి నిచి షింబున్ పత్రిక రాసింది. అందుచేత మరొక రోజు ఈ పోటీని నిర్వహించాలని అయితే ఈ సారి లక్ష్యం వంద మంది కాకుండా నూట యాభయి మందికి పెంచాలని నిర్ణయించి అప్పటికి పోటీని డ్రాగా ముగించారని ఆ పత్రిక రాసింది.
తోషియాకి ముకాయి, తుసుయోషి నోడా


అయితే నూట యాభయి మందిని చంపే పోటీ నిర్వహించడానికి వీలు కాలేదు పాపం వీరికి. జపాన్ సైనికుల అకృత్యాలు తెలిసిన ఆ దేశస్థులు గగ్గోలు పెట్టడంతో చక్రవర్తి స్వయంగా జోక్యం చేసుకొవడంతో ఈ పోటీకి వీలు లేకుండా పోయింది. 

రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ఈ పోటీకి సంబంధించిన వివరాలు సేకరించిన అంతర్జాతీయ మిలిటరీ ట్రిబ్యునల్ ఈ ఇద్దర్నీ చైనాకి రప్పించి యుద్ధ నెరాలకి గానూ విచారణ జరిపి జనవరి 1948 లో ఇద్దర్నీ ఉరి తీసింది. 

ఏప్రిల్ 2003 లో  వీరి వారసులు అసలు 100 మందిని చంపే పోటీ అనేది జరగనే లేదని వీరిని అన్యాయంగా శిక్షించారని కోర్టుకెళ్ళారు. అసాహి షింబున్, మైనిచి షింబున్ అనే పత్రికల మీద నష్ట పరిహారం కోరుతూ దావా వేశారు. అయితే విచారణలో వంద మందిని తాము చంపింది నిజమేనని ఆ ఇద్దరు ట్రిబ్యునల్ ముందు ఒప్పుకొన్నారని, అందు చేత అది అబద్ధమని చెప్పడం సరి కాదని కోర్టు కేసు కొట్టేసింది. 






Thursday, July 21, 2011

పెద్ద ముక్కోళ్ళ సంఘం, దానికో చాంపియన్‌షిప్


ముక్కు మన శరీరంలో చాలా ముఖ్యమైన భాగం. వాసన చూడ్డానికే కాకుండా ముఖానికి అందాన్నివ్వడంలో కూడా ముక్కుకి చాలా ప్రాధాన్యత ఉంది. కావ్య నాయికలకి ముక్కు కోటేరేసినట్లు ఉంటుంది. కమేడియన్లకి గద్ద ముక్కు ఉంటుంది. గొల్లపూడి మారుతీరావు గద్దముక్కు పంతులుగా కొన్ని సినిమాల్లో నటించాడు. పినోచియో అనే కామిక్స్ కారెక్టరుకి అబద్దం చెప్పినప్పుడల్లా ముక్కు పొడవు పెరుగుతుంది. ఈ శాపం మన రాజకీయ నాయకులకి గనుక ఉన్నట్లయితే ఒక్కొక్కడికి పదేసి కిలోమీటర్ల పొడవునా ముక్కులు ఉండేవేమో!
 
ముక్కు షేపు బాగా లేకపోతే దేవుడ్ని తిడుతూ కూర్చోనే రోజులు కావు ఇప్పుడు. కాస్మెటిక్ సర్జన్ దగ్గరకు వెళితే కావలసిన సైజుకి, షేపుకి మన ముక్కుని మార్చి పారేస్తాడు. రైనోప్లాస్టి అని పిలిచె ఈ ఆపరేషన్‌ని క్రీస్తు పూర్వం 600 సంవత్సరంలోనే మన దేశంలో సుశ్రుతుడు చేశాడు. ఇప్పటికీ ఈ ఆపరేషన్‌ని ఇంచుమించు అదే పద్దతిలో చేస్తున్నారు. 
Thumbnail: 
          Figure 1: Sushruta (600 B.C.)
         Thumbnail: 
          Figure 2: The famous Indian Rhinoplasty (reproduced in the October 1794 issue of the Gentleman's Magazine of London)...
సినీ తారలు ఎక్కువగా ఈ ఆపరేషన్‌ని చేయించుకుంటారు. శ్రీదేవితో మొదలుపెట్టి కత్రినా కైఫ్, రాణీ ముఖర్జీ, కంగన రనౌత్, మినిషా లంబా, కరీనా కపూర్ లాంటి తారలందరూ తమ ముక్కుని కాస్మెటిక్ సర్జన్ కత్తి కింద పెట్టిన వారే.


post-12 post6  post5 post1
అయితే పెద్ద ముక్కు ఉండడం ఒక గొప్పగా బావించే వాళ్ళు ఒక క్లబ్ లాగా ఏర్పడి ప్రతి అయిదేళ్ళకీ ముక్కు సైజులో పోటీలు పెట్టి ప్రైజు ఇచ్చే ఆచారం జర్మనీలోని లాంగెన్‌బ్రుక్ అనే ఊరిలో ఉంది. గత యాభయి ఏళ్ళుగా ఇక్కడ ఈ  ఆచారం కొనసాగుతూ ఉంది. 1961 లో ఇక్కడి ఒక పబ్‌లో కొందరు తాగుబోతుల మధ్య సరదాగా మొదలయిన ఒక గొడవ ఈ ఆచారానికి నాంది.


1961 లో ఒక సాయంత్రం పబ్‌లో మందుకొడుతూ కొందరు ముక్కు సైజుల గురించి ఒకరినొకరు ఎత్తి పొడుస్తూ ఉండగా వారికి ఈ ఆలోచన వచ్చింది. ముక్కు పొడవులో పోటీ పెడితే ప్రైజు నీకొస్తుంది అంటే నీ కొస్తుంది అని అనుకొంటూ ఉండగా మాక్స్ రిచర్ట్, విలియమ్ హోఫ్లర్‌ అనే ఇద్దరికి ఈ ఆలోచన వచ్చి పెద్ద ముక్కు ఉన్న వారి సంఘం అని ఒక దాన్ని స్థాపించి పోటీలు పెట్టాలని నిర్ణయించారు.
  


ప్రతి అయిదేళ్ళకి ఒక సారి జరిగే ఈ పోటీలలో 60మిల్లీ మీటరు పొడవూ, 40 మిల్లీ మీటర్లూ వెడల్పు ఉన్న వాళ్ళెవరైనా పాల్గొనవచ్చు. ఈ పెద్ద ముక్కు క్లబ్‌లో ఇప్పటివరకూ 330 మంది రిజిస్టరయిన సభ్యులు ఉన్నారు. ముక్కు పొడవు, వెడల్పు కొలవడానికి వీళ్ళు ఒక ప్రత్యేకమైన్ పరికరాన్ని రూపొందించారు. కొలిచే సమయంలో ముక్కు పొడవు పెరిగేలా చేయడానికి మొహం చిట్లించడం, మొహాన్ని వింత వింతగా తిప్పడం లాంటివి కూడా చేయవచ్చు. ప్రస్తుతం ఈ పెద్ద ముక్కు చాంపియన్‌షిప్ టైటిల్ గెలిచిన వ్యక్తి ముక్కు పొడవు అయిదు అంగుళాలు. అంతకన్నా పెద్ద ముక్కు ఉన్న వాళ్ళెవరైనా ఉంటే ఈ పోటీలో పాల్గొన వచ్చు.