నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Friday, July 29, 2011

బాబా రామ్‌దేవ్‌ని పెళ్ళాడుతానంటున్న రాఖీ సావంత్!


ఆక్సిజెన్ లేకపోతే ప్రాణులు ఎలాగైతే జీవించలేవో బాలీవుడ్ జీవులు వార్తల్లో లేకపోతే జీవించలేరు. నిత్యం ఏదో ఒకటి చేసో, వాగో వార్తల్లో ఉండాల్సిందే. మీడియా, ప్రింట్ కానీ విజువల్ కానీ ఎక్కువ అయ్యాక బాలీవుడ్ జీవుల దూల తీర్చే వాళ్ళు కూడా ఎక్కువయ్యారు. వార్తల్లోకి ఎక్కడం కూడా ఒక విధంగా లాభమే అని కనిపెట్టాక ఎదో ఒకటి చేసి సెన్సేషన్ క్రియేట్ చేసి దాన్ని తమకి లభించేలా చెసుకునే తెలివితేటలు కొంతమందికి వెన్నతో పెట్టిన విద్య అయింది. ఇందులో సిద్ధహస్తుడు మన రామ్ గోపాల్ వర్మ. ఈ బాపతు జీవి ఇంకొకటి ఉంది. దాని పేరు రాఖీ సావంత్. ముద్దుగా Motor mouth అని పిలుస్తారు ఈమె గురించి బాగా తెలిసిన వాళ్ళు. 

 
రాఖీ కా స్వయంవర్ అని ఒక ప్రోగ్రాం నడిపి అందులో సెలక్టయిన వాడిని పెళ్ళి చేసుకుంటానని చెప్పి చివరికి ఆ బకరాగాడికి హాత్ ఇచ్చి, ఆ పిమ్మట రాఖీ కా ఇన్సాఫ్ అనే ఇంకో ప్రోగ్రాంలో ఒక వ్యక్తిని నువ్వు నపుంసకుడివి అని అనుచితంగా మాట్లాడి అతని ఆత్మహత్యకి కారణమయిందని ఆ వ్యక్తి తల్లి కోర్టుకెక్కింది. ఇప్పుడు మళ్ళీ వార్తల్లోకెక్కింది రాఖీ. అయితే ఈ సారి ఎవరూ ఊహించలేని వ్యక్తిని టార్గెట్ చేసింది తన నోటితో. ఆయన బాబా రామ్‌దేవ్. అంతకు ముందు ముదురు బెండకాయ బ్రహ్మచారి రాహుల్ గాంధీని కూడా ముగ్గులోకి లాగింది. 


తన సరికొత్త టీవీ షో "గజబ్ దేశ్‌కీ అజబ్ కహానియా" ని ప్రమోట్ చేయడంలో భాగంగా మీడియాతో మాట్లాడుతూ తనకి రాహుల్ గాంధీ అంటే ఇష్టమని, కానీ బాబా రామ్‌దేవ్ అంటే పడి చస్తానని, స్వామి ఒప్పుకోంటే ఆయన్ని పెళ్ళి చేసుకుంటానని విలేఖరులతో చెప్పింది. బాబా రామ్‌దేవ్ అని పిలవనని ఆయన్ని తను స్వామి అనే పిలుస్తానని, ఈ సారి ఏ చానల్ అయినా తనతో స్వయంవర్ ప్రోగ్రామ్ పెడితే రామ్ దేవ్‌ని పిలవమని చెప్తానని, తనే స్వయంగా ఆయన్ని ఆహ్వానిస్తానని చెప్పింది రాఖీ. 

    
బాబాలో ఏమి నచ్చిందీ అని అడిగిన ప్రశ్నకి, రామ్‌దేవ్ చాలా సెక్సీగా ఉంటారు. అసలాయన పొట్టని చూశారా, ఎంత ఫ్లాట్‌గా ఉంటుందో? మాకు పెళ్ళయి మేము యోగా డీవీడీ రిలీజ్ చేస్తే అది శిల్పా శెట్టి డీవీడీ కన్నా బాగా సెక్సీగా ఉంటుంది, అని చెప్పి చివర్లో అసలు కారణం చెప్పింది. రామ్‌దేవ్ దగ్గర దండిగా డబ్బుంది. ఎప్పుడూ ఖరీదైన కార్లలో తిరుగుతూ ఉంటారు అని అసలు విషయం చల్లగా బయట పెట్టింది. 
 
బహుశా రామ్ దేవ్ బాబాని పెళ్లి చేసుకొంటే ఆయన తన ప్రైవేట్ ఐలాండ్‌లో తనని శోభనానికి తీసుకెళ్తాడని ఆశ పడుతుందేమో ఈ మోటార్ మౌత్. 


No comments: