నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Tuesday, July 19, 2011

దొంగతనం కోసం వచ్చిన వాడి కాళ్ళూ చేతులు కట్టేసి, వయాగ్రా తినిపించి, శృంగారం కోసం వాడుకొన్న చిన్నది.

ముప్పై రెండేళ్ల విక్టర్ జాసిన్‌స్కీ రష్యాలో, మెష్చోవ్స్క్‌లోని  ఆ సెలూన్‌లోకి వెళ్ళే సమయానికి కస్టమర్లెవరూ లేక పోవడం చూసి తను వచ్చిన పని తేలిగ్గా అయిపోతుందని సంతోషించాడు. అతను వచ్చిన పని ఆ హెయిర్ కట్టింగ్ సెలూన్ యజమానిని భయపెట్టి ఆ రోజు ఆమె సంపాదించిన డబ్బు దోచుకుపోవడం. ఆ సెలూన్ ఓనర్ ఓల్గా జజాచ్ ఒక్కతే ఉండడం చూసి పని తేలిగ్గా జరిగి పోతుందని భావించి, జేబులోంచి తుపాకి బయటకి తీసి ఆమెకి గురిపెట్టాడు. అయితే అతనికి తెలియని విషయమేమిటంటే ఆమె కరాటేలో బ్లాక్ బెల్ట్ హోల్డర్. 
Olga Zajac: The world's greatest Salon Owner                     


ఒక దెబ్బతో అతడిని స్పృహ తప్పేలా చేసిందామె. ఆ తరువాత అతడిని లోపలి గదిలోకి ఈడ్చుకెళ్ళి హెయిర్ డ్రయ్యర్ వైరుతో కాళ్ళు, చేతులు కట్టేసి, మూడు రోజుల పాటు అతనికి వయాగ్రా తప్ప తినేందుకు మరేమీ ఇవ్వకుండా ఆ మూడు రోజులు అతనిని తన శృంగార కాంక్ష తీర్చుకోవడానికి వాడుకొంది. మూడవ రోజు "ఇంకొక సారి ఈ చుట్టు పక్కల కనిపిస్తే నా చెతిలో చస్తావ్" అని వార్నింగ్ ఇచ్చి వదిలేసింది.
 


అతను వాచిపోయిన జననాంగంతో నేరుగా హాస్పిటల్‌కి వెళ్ళి చికిత్స చేయించుకొని, పిమ్మట పోలీస్ స్టేషన్‌కి వెళ్ళి ఫిర్యాదు చేశాడు. పోలీసులు విచారణకి ఓల్గాని పిలిపిస్తే ఆమె కస్సుమంది. "దొంగ లం....కొడుకు. అవున్నిజమే, ఓ రెండు సార్లు మేం శృంగారంలో పాల్గొన్నామంతే. ఆ మాత్రానికే నేను వాడికి మూడు పూటలా తిండి పెట్టాను, కొత్త జీన్స్ కొనిచ్చాను, ఓ వెయ్యి రూబుల్స్ డబ్బులు కూడ ఇచ్చాను" అని చెప్పింది. పోలీసులు ఇద్దర్నీ అరెస్టు చేసి విడి విడిగా జెయిల్లో పెట్టారు.

No comments: