నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Wednesday, July 20, 2011

నాజీ సైనికుల కోసం సెక్స్ డాల్స్ తయారు చేయించిన హిట్లర్.

1941. యూరోప్‌లో రెండవ ప్రపంచ యుద్ధం భీకరంగా సాగుతున్న రోజులు. హిట్లర్‌కి ఎదురే లేకుండా యూరప్ ఖండం అంతా అతనికి దాసోహమయింది. ఇంగ్లాండ్ మీద ఎడతెరిపి లేకుండా జర్మన్ యుద్ధ విమానాలు బాంబులు కురిపిస్తున్నాయి. రష్యాతో నువ్వు నన్ను గెలకొద్దు, నేను నిన్ను గెలకను అన్న రీతిలో ఒడంబడిక చేసుకుని హిట్లర్ తనని ఎదిరించే మొనగాడు లేడని విర్రవీగుతున్న రోజులవి. ఏమాత్రం ప్రతిఘటన లేకుండా ఫ్రాన్సుని ఆక్రమించుకుంది జర్మన్ సైన్యం. హిట్లర్‌కి చెక్ పెట్టగల ఒకే ఒక దేశం అమెరికా యుద్ధంలోకి అప్పటికి ఇంకా దిగ లేదు.
  
ప్రాన్సు సైన్యం హిట్లర్‌ని ఏమాత్రం ఇబ్బంది పెట్టలేదు గానీ, ఫ్రెంచి వేశ్యలు మాత్రం అతనికి చుక్కలు చూపిస్తున్నారు. జర్మన్ ఆక్రమణతో ఫ్రెంచి ప్రజల దగ్గర వేశ్యలని ఆదరించడానికి వంట్లో ఉత్సాహం, జేబుల్లో డబ్బులు కరువవడంతో ఫ్రాన్సు దేశం అన్ని మూలలనుంచి అందమైన వేశ్యలందరూ రాజధాని పారిస్ చేరుకున్నారు. అక్కడ ఏ బార్‌లో చూసినా ఏ వీధిలో చూసినా జర్మన్ సైనికులే. ఈ సైనికుల దగ్గర వాళ్ళకి కావలసినవన్నీ పుష్కలంగా ఉన్నాయి, మందూ, డబ్బూ, వంట్లో ఉత్సాహమూ.
   


ఈ సైనికులు కూడా ఇల్లు వదిలి వచ్చి చాలా రోజులు కావడంతో వాళ్ళకి ఈ వేశ్యలు దేవ కన్యల్లాగా కనిపించారు. అందునా ఫ్రెంచి అందాలు మరి. అయితే కొద్ది రోజుల్లోనే వారు ఆ దేవ కన్యలదగ్గరనుంచి సుఖంతో బాటు సుఖ వ్యాధులు కూడా స్వీకరించి డ్యూటీలకి సెలవు పెట్టసాగారు. ఇది ఎంతగా ప్రబలిందంటే కొద్ది రోజుల్లోనే ఈ విషయం SS కమాండర్ హెన్రిచ్ హిమ్లర్ దగ్గరికి వెళ్ళింది. పరిస్థితి తీవ్రతని అంచనా వేసిన హిమ్లర్ వెంటనే హిట్లర్‌కి రిపోర్టు పంపాడు. ఏదో ఒకటి చేసి ఈ ప్రమాదం నుంచి బయటపడక పోతే ఫ్రెంచి సైన్యం ఓడించలేని జర్మన్ సైన్యాన్ని ఫ్రెంచి వేశ్యలు ఓడిస్తారు అని అందులో రాశాడు హిమ్లర్.
 


హిట్లర్ వెంటనే తన సలహాదారులతో సమావేశం ఏర్పాటు ఛేశాడు. సైనికులని అమ్మాయిల దగ్గరకి వెళ్ళకుండా కట్టడి చేయడం అసాధ్యం. పారిస్‌లో ఉన్న వేశ్యలందరినీ పరీక్షించి, వాళ్ళకి చికిత్స చేసి, వారిలో జబ్బులు లేకుండా చేయడం కూడా అయ్యే పని కాదు. ప్రతి రోజూ ఫ్రాన్స్ మూల మూలలనుంచి వందల సంఖ్యలో అమ్మాయిలు విటులకోసం పారిస్ వస్తూ ఉంటారు. సైనికుల వెంట సురక్షితమైన అమ్మాయిలని యుద్ధరంగంలోకి పంపడం సాధ్యమయ్యే పని కాదు. ఇలా అన్ని రకాలుగా అలోచిస్తుండగా ఎవరో సెక్స్ డాల్స్ అన్న ఐడియా అందించారు. ప్రతి సైనికుడికీ ఒక అమ్మాయి బొమ్మ అందిస్తే సెక్స్ మీదికి మనసు పోయినప్పుడల్లా ఆ బొమ్మ బయటకి తీసి దానికి గాలి కొట్టి దానితో ఆనందిస్తే సుఖ వ్యాధుల బారిన పడే ప్రమాదం లేకుండా పోతుందన్నది ఇందులో పాయింట్. 


     
హిట్లర్‌కి ఈ ఆలోచన బాగా నచ్చింది. వెంటనే అలాంటి బొమ్మకి ఉండాల్సిన లక్షణాలు నిర్దేశించారు. ఆ బొమ్మ శరీరం, చర్మం నిజమైన అమ్మాయి శరీరం లాగా ఉండాలి. నిజమైన అమ్మాయి శరీరం ఆ సమయంలో ఎలా మెలికలు తిరుగుతుందో ఈ బొమ్మ కూడా అలాగే ఉండాలి. ఇక అసలు పాయింట్, వయసులో ఉన్న అమ్మాయి జననాంగం  లాగానే ఈ బొమ్మకి కూడా ఉండాలి. గాలి తీసినప్పుడు సైనికులు వీపుకి తగిలించుకొనే బ్యాగ్‌లో ఒక వైపు ఇమిడి పోయేలా ఉండాలి.


ఇవన్నీ తేల్చాక అలాంటి బొమ్మని ఎవరు చేయగలరా అని ఆలోచిస్తే అందరికీ స్ఫురించిన పేరు ఫ్రాంజ్ షాకెర్ట్. ఇతను అంతకు ముందు గ్లాస్‌తో ఒక అమ్మాయి మోడల్ చేసి ఎగ్జిబిషన్‌లో ప్రదర్శించి పేరు తెచ్చుకున్నాడు. అతన్ని పిలిచి పని వివరించారు సైన్యాధికారులు. ఈ ప్రాజెక్టుకి బోర్గ్‌హిల్డ్ ప్రాజెక్ట్ అని పేరు పెట్టారు. బోర్గ్‌హిల్డ్ అన్నది యూరోపియన్ పురాణాల్లోని ఒక అందమైన అమ్మాయి పేరు.


 జర్మనీలో అందగత్తెలుగా పేరెన్నికగన్న మోడల్స్ నుంచి కొలతలు తీసుకొని బొమ్మని తయారుచేశాడు షాకెర్ట్. ఫస్ట్ బ్యాచ్ రెడీ అయ్యాక వాటిని తీసుకోవడానికి సైనికులు నిరాకరించారు.


ఎప్పుడైనా ఖర్మ కాలి ప్రత్యర్ధులకి దొరికితే, అప్పుడు వాళ్ళు ఈ బొమ్మని చూస్తే అప్పుడు జరిగే అవమానం కన్నా ఆత్మహత్య చేసుకోవడం మంచిది అని వాళ్ళ భావన. ఇంతలో షాకెర్ట్ బొమ్మలు తయారుచేసే వర్క్ షాప్ ఇంగ్లీషు వాళ్ళ బాంబు దాడిలో కాలిపోవడంతో ఈ ప్రాజెక్టు శాశ్వతంగా మూలపడింది. నాలుగేళ్ళ తరువాత మిత్రదేశాలు నార్మండీ మీద దాడి చేసి ఫ్రాన్సు నుండి జర్మన్ సైనికులని వెళ్లగొట్టేంతవరకూ జర్మన్ సైనికుల ఫ్రాన్సు అమ్మాయిలతోనే ఆనందిస్తూ, వారు అంటించిన జబ్బులతో బాధ పడుతూ గడిపారు.

1 comment:

sree said...

ఏం లాభం లెండి. ఇప్పటికీ మన ఇండియాలో చెయ్యే కదా దిక్కు!!