నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Friday, July 29, 2011

యెడ్యూరప్ప అనే అవినీతి వానపాముని పట్టేశారు. మరి అవినీతి అనకొండల మాటేమిటి?


మొత్తానికి యెడ్యూరప్ప పెట్టిన కండీషన్లు అన్నిటికీ ఒప్పుకొని, ఆయనని ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించి జబ్బలు చరుచుకుంటున్నారు కమలనాధులు. అయితే కర్ణాటకలో అవినీతికి మూలం కానీ, అంతం కానీ యెడ్డీ కానే కాదన్నది చిన్న పిల్లవాడికి కూడా తెలిసిన విషయం. అవినీతి మూల విరాట్టులూ, అవినీతి సామ్రాట్టులూ ఘనత వహించిన గాలి గార్లు అన్నది జగద్విదితం. ఆ గాలి జోలికి వెళ్ళే సాహసం బీజేపీ చేయగలదా? చేసి ఆ పెనుగాలి ప్రభావాన్ని తట్టుకొని నిలవగలదా?
   


గాలి బ్రదర్స్‌ని రాజీనామా చేయమనే ధైర్యం అద్వానీతో మొదలుకొని యెడ్డీ దాకా ఎవరికైనా ఉందా? అప్పుడెప్పుడో గాలి గారికి కోపం తెప్పించిన పాపానికి యెడ్యూరప్ప చావు తప్పి కన్ను లొట్టపోయి విలేఖరుల సమావేశంలో టీవీ కెమెరాల సాక్షిగా కన్నీరు పెట్టుకొన్న సన్నివేశం ఇంకా ఫ్రెష్‌గానే అందరి మనసుల్లో ఉంది కదా?
 
ఒక వేళ గాలి అండ్ కో జోలికి వెళ్ళే సాహసం లోటస్ బాసులు గనుక చేసినట్లయితే ఇక్కడ జగన్ చేస్తున్నకార్యక్రమం అక్కడ గాలి గార్లు పునరావృతం చేస్తారేమో? ఇప్పటికే చాలా దూరం వెళ్ళాము ఇంక చాలు అనుకొని సైలెంటయి పోతారు కానీ, దుస్సాహసంతో దక్షిణ భారతంలో అధికారంలో ఉన్న ఒకే ఒక రాష్ట్రాన్ని చేజార్చుకొనేంత అమాయకులా కమలనాధులు?

No comments: