నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Thursday, April 5, 2012

మద్యం రాజకీయాలకు బలయిన పోలీస్ టైగర్ శ్రీనివాస్ రెడ్డి


అంకుశంలో రాజ శేఖర్‌ని చూశాక పోలీసంటే ఇలా ఉండాలని అనిపిస్తుంది. పోలీసు టైగర్, పోలీసు సింహం......ఇలా బిరుదులు విన్నప్పుడు నిజంగా అలాంటి పోలీసులు ఉంటారా అనిపిస్తుంది. నిజ జీవితంలో అలా పోలీసు అన్న పదానికే వన్నె తెచ్చిన వాడు కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి. 1994 బ్యాచ్‌కి చెందిన ఈయన గతంలో నెల్లూరు జిల్లా ఎస్‌పీగా పని చేశాడు. పుష్కర కాలం దాటినా ఈ నాటికీ నెల్లూరు ప్రజలు శ్రీనివాస్ రెడ్డి గురించి కథలు కథలుగా చెప్పుకొంటూ ఉంటారు. మళ్ళీ అలాంటి వాడు వస్తే కానీ ఈ బాధలు తప్పవు అని అనుకొంటూ ఉంటారు.
  
నెల్లూరు ఎస్పీగా వచ్చీ రాగానే రౌడీల మీద దృష్టి పెట్టి వాళ్ళ తాట తీశాడు. నెల్లూరు ప్రజలకి తెలియని ఎన్‌కౌంటర్ అన్న పదాన్ని చూపించి ఒక కరడు కట్టిన రౌడీని ఎన్‌కౌంటర్ చేశాడు. మరొక కరడు కట్టిన రౌడీ మీద దృష్టి పెట్టినా అతగాడు కాళ్ళమీద పడి, బతికి పోయి రెడ్డి ఎస్పీగా ఉన్నన్ని నాళ్ళూ కుక్కిన పేనులా ఇల్లు దాటి రాకుండా ఉన్నాడు. ఈయన చేసిన మరొక పని నెల్లూరు రోడ్లమీద విచ్చల విడిగా పరుగులు తీస్తున్న ఆటోలు, టౌన్ బస్సులని అదుపు చేయడం. శ్రీనివాస్ రెడ్డి ఉన్నంత కాలం టౌన్ బస్సులు నిర్ధారించిన స్టాపులలోనే ఆగేవి. ఆటోల వాళ్ళు పద్ధతిగా నడిపే వారు.

ఇప్పుడు నెల్లురులో ఎక్కడయినా బయట అబ్బా ఏమిటో ఈ టౌన్ బస్సుల వాళ్ళకి, ఆటోల వాళ్ళకీ  అడ్డూ, అదుపూ లేకుండా పోతుంది అన్న మాట అని చూస్తే, పక్కన ఉన్న వాళ్ళు మళ్ళీ శ్రీనివాస్ రెడ్డి లాంటి ఎస్పీ వస్తే కానీ వీళ్ళకి బుద్ధి రాదు అంటారు. అంతలా నెల్లూరు ప్రజల మీద తన ముద్ర వేశాడు శ్రీనివాస్ రెడ్డి.

 
ఇప్పుడు మద్యం సిండికేట్ల గురించి విచారణ చేస్తున్న SIT(special investigation team) కి శ్రీనివాస్ రెడ్డి నాయకత్వం వహించి విజయ నగరం జిల్లాలో విస్తరించిన బొత్సా సత్యనారాయణ మద్యం సామ్రాజ్యాన్ని బయట పెట్టాడు. దీనితో భయ పడ్డ బొత్సా కాంగ్రెస్ అధిష్టానాని ఆశ్రయించడం, వాళ్ళ ఆగ్నల మేరకు సీఎం బొత్సా మద్యం సామ్రాజ్యం మీద ఎక్కు పెట్టిన ఆయుధాన్ని ఉపసంహరించుకోవాల్సి వచ్చింది. బొత్సా గారి ఆగ్రహం తగ్గించడానికి ప్రభుత్వం ఈ సిన్సియర్ ఐపీఎస్ అధికారిని బలిపెట్టింది. ఏసీబి జాయింట్ డైరెక్టర్ గా ఉన్న శ్రీనివాస్ రెడ్డిని ప్రమోషన్ ఇచ్చినట్లు తీర ప్రాంత బధ్రత అనే ప్రాముఖ్యం లేని విభాగానికి DIGగా బదిలీ చేసింది.

అయితే నిప్పుని కప్పి పెట్టడం సాధ్యం కాదు. కోస్టల్ సెక్యూరిటీకి ఆధునిక సౌకర్యాలు కల్పించినా వాటిని సరిగా ఉపయోగించడం లేదు అని ఆమధ్య వార్తల్లో వచ్చింది. ఇప్పుడు అది లేకుండా పోతుంది. శ్రీనివాస్ రెడ్డి ఆ విభాగంలో ఉన్నన్ని నాళ్ళు తీరప్రాంత ప్రజలు నిశ్చింతగా ఉండొచ్చు.

2 comments:

Anonymous said...

నెల్లూరులో ఉన్న కాలంలో అక్కడ పేరుమోసిన కమ్యూనిస్ట్ రౌడీ మార్కెట్ నాగేశ్వరరావు అనే వాడిని చంపినంత పని చేశాడని విన్నాను. మీకేమైనా తెలుసా?

నమస్తే said...

krishna garu,
will you please mail me to this mail id... namonthly@gmail.com