రేపిస్టులారా తస్మాత్ జాగ్రత్త. మీ పాలిట,సారీ, మీ అంగాల పాలిట యమ దూతలాంటి ఒక కండోముని లండన్ కి చెందిన ఒక డాక్టరమ్మ తయారు చేసింది.
రేప్-యాక్స్ లేదా రేప్-గొడ్డలి అనబడే ఈ కండోముని తయారు చేయాలనే ఆలోచన ఎహ్లర్స్ సోనెట్ అనే ఆమెకి తను దక్షిణ ఆఫ్రికాలో పని చేస్తుండగా కలిగిందట. అత్యధికంగా రేప్ లు జరిగే దేశంగా పేరు పొందిన అక్కడ ప్రతి 17 సెకన్లకీ ఒక రేప్ రిపోర్టు చేయబతుంది. అలా ఒక బాధితురాలికి చికిత్స చేస్తూండగా ఆ అమ్మాయి ఆపుకోలేని కోపంతో బాధతో "నాకు అక్కడే గనుక పళ్ళు ఉన్నట్లయితే వాడి దాన్ని కొరికి నమిలేసే దాన్ని" అని అన్నదట.
ఆ మాటలతో ఆలోచనలో పడ్డ సోనెట్ కి అక్కడ పళ్ళు పెడితే ఎలా ఉంటుంది అన్న ఆలోచన కలిగి దానికి ఆమె ఇచ్చిన రూపమే ఈ రేప్-యాక్స్.
ఇది ఒక ఫిమేల్ కండోం.అయితే దీనిలో లోహపు పళ్ళు ఉంటాయి.దీన్ని తమ మర్మాగం లో పెట్టుకొన్న అమ్మాయికి ఎలాంటి బాధ ఉండదు.అయితే ఎవడైనా దుండగుడు ఆమెని మాన భంగం చేయాలని తన అంగాన్ని ఆమె మర్మాయవంలో చొప్పిస్తే ఆ లోహపు పళ్ళు దానిని గట్టిగా పట్టుకొంటాయి.
అప్పుడు కలిగే భరించలేని బాధతో వాడు తన అంగాన్ని బయటకు తీసినా ఆ లోహపు పళ్ళు వీడి పోవు.దాన్ని తొలిగించాలంటే తప్పక డాక్టర్ని సంప్రదించాల్సిందేనట.మత్తు ఇచ్చి ఆపరేషన్ తో గానీ దాన్ని తీయడం సాధ్యం కాదు.దీని వల్ల వాడిని పోలిసులకి పట్టివ్వడం కూడా సాధ్యపడుతుంది.
చాలా కాలం నుంచీ పత్రికల్లొ రేప్ కేసు గురించి చదివినప్పుడల్లా నాకు ఒక ఆలోచన కలిగేది.అమ్మాయికి ఇష్టం లేకుండా ఎవడైనా అంగ ప్రవేశం చేస్తే ఆ అంగం తెగిపోయేలా ఒక సాధనాన్ని ఆ అమ్మాయి మర్మాంగంలో ఉంచుకొనేలా రూపొందిస్తే కొంత వరకూ రేపులని అరికట్టవచ్చు కదా అని.
దీనికి ప్రేరణ ఇండియానా జోన్స్- ది లాస్ట్ క్రూసేడ్ నుంచి వచ్చింది.అందులో క్లైమాక్స్ లో విలన్ హోలీ గ్రయిల్ ఉన్న చోటికి పోబోతే రెండు పదునైన కత్తులు వచ్చి అతడి తలని కత్తిరిస్తాయి.అలాంటి మెకానిజం యోనిలోపల పెట్టడం అయ్యేపని కాదని అంతకు మించి ఆలోచించడం మాని వేశాను.కానీ సోనెట్ డాక్టరు కాబట్టి,ఆడది కాబట్టి కొంచెం తెలివిగా ధరించిన అమ్మాయికి ఇబ్బంది లేకుండా రేప్ చేయడానికి సాహసించిన వాడికి మళ్ళీ అలాంటి ఆలోచన కలగకుండా ఉండేలా శిక్షించే సాధనం కనుక్కొంది.
వెరీ వెల్ డన్ ఎహ్లర్స్ సోనెట్.