నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Friday, July 15, 2011

ముంబాయి పేలుళ్ళ గురించి చెత్త వాగుడు వాగిన టాప్-5 చెత్త నాయకులు

ఏదైనా దుర్ఘటన జరిగినప్పుడు దానిని ఖండిస్తూ స్టేట్‌మెంట్లు ఇవ్వడం మన నాయకులకు మామూలే. అయితే ఏం మాట్లడాలో తెలియక పోతే అవి చెత్తగా ఉండి ప్రజలకు నవ్వునీ, కోపాన్నీ తెప్పిస్తాయి. ఇప్పుడు బొంబాయి పేలుళ్ళ విషయంలో కూడా మన నాయకులు తమ చెత్త ప్రకటనలతో తమ తెలివి తక్కువ తనాన్ని మరొక సారి చాటుకున్నారు. చెత్త ప్రకటనలిచ్చిన చెత్త నాయకులని టాప్-5 లిస్టులో పెడితే ఎలా ఉంటుందో చూద్దాం.
 
5. చెత్త: అయిదవ స్థానంలో నిలిచి చెత్త స్టేట్‌మెంట్ అవార్డు అందుకొంటున్నది మన ప్రధాని మన్‌మోహన్ సింగ్. టెర్రరిస్టులకి చెప్పా పెట్టకుండా దాడి చేయగలిగే  సౌలభ్యం ఉంది అని అన్నారు మహా మేధావి అయిన మన ప్రధాని గారు. మన్‌మోహన్‌జీ మీరు ఒక ప్రకటనలో టెర్రరిస్టులకి పద్ధతీ, మర్యాద ఎలా ఉండాలో నేర్పండి. ఎప్పుడయినా బాంబు దాడి చేయదలచుకొంటే ముందుగా ఎక్కడ ఎప్పుడు ఎలా దాడి చేయబోతున్నారో చెప్పి మరీ చేయడం మర్యాదస్తుల లక్షణం అని వారికి చెప్పండి. వారు మీమాట వినేంత వరకూ మన నిఘా వర్గాలని అప్రమత్తంగా ఉండమని చెప్పండి.
 
4.అతి చెత్త: నాలుగవ స్థానంలో మన యువరాజా వారున్నారు. ఆయనేమన్నారంటే మనం 99 శాతం వరకూ ఉగ్రవాదుల దాడులు ఆపగలం. మనం చేయగలిగింది అంతే. ఒక శాతం దాడులు జరగుతూ ఉంటాయి. యువరాజావారు, మీరు చెప్పింది నిజం అయితే కావొచ్చు గాక,  సమయం సందర్భం ఉండాలి కదా. ఒక వైపు ప్రజలు ప్రాణాలు పోయి అల్లాడుతూ ఉంటే మీరిలా గణాంకాలు చెప్పడం ఏమైనా పద్ధతిగా ఉందా?
 


3. మహా చెత్త: మూడవ స్థానంలో ఉన్నది తమిళ తంబి మన హోమ్ మినిస్టర్ చిదంబరం. ఈ పేలుళ్ళు మన నిఘా వర్గాల వైఫల్యం కాదు అని అన్నారాయన. అమెరికా వాళ్ళు ఒసామా బిన్ లాడెన్‌ని వేసేశాక ఇస్లామ్ తీవ్రవాదులు ఇండియాని ఒక దెబ్బ వేయడానికి కాచుకొని ఉన్నారని అందరికీ తెలుసు. పైపెచ్చు మన మీద దాడికి ప్లాన్ జరుగుతూ ఉందని అమెరికా నిఘా వర్గాలు చెప్పి ఉన్నారాయే. ఇంత పెద్ద నిఘా వర్గ సిబ్బంది ఉండి కూడ దాడి జర్గింది అంటే అది వైఫల్యమె కదా సార్?
 
2. పరమ చెత్త: ఈ అవార్డుని మహా రాష్ట్ర హీరో్/కమెడియన్ రాజ్ థాకరే గారు చెజిక్కించుకున్నారు. ఈయన ఏమి కూశారయ్యా అంటే గత పదేళ్ళలో మహరాష్ట్రలో నేరాల సంఖ్య పెరిగిందనీ, బయట రాష్ట్రాల నుండి వచ్చిన వారే దీనికి కారణం అని అంటాడీ బావిలో కప్ప. నాయనా రాజ్, ఎప్పుడూ బీహార్, ఉత్తర ప్రదేశ్ వారి మీద పడి ఏడవడమేనా  నీకు తెలిసింది?


 
1.చెత్తాతి చెత్త:  ఇక అందరినీ వెనక్కి నెట్టి చెత్తశ్రీ గా నిలిచింది దిగ్విజయ్ సింగ్. ఇండియా పరిస్థితి పాకిస్తాన్ కన్నా మెరుగ్గానే ఉంది కదా?
అక్కడ చూడండి. ప్రతి వారం, ప్రతి రోజూ బాంబులు పేలుతూ ఉంటాయి అని ఈ చెత్త నా నాయకుడి లాజిక్. 
 
అంటే మన దేశంలో అలా రోజుకో బాంబు పేలే రోజు వచ్చే వరకూ మన పరిస్థితి బాగా ఉందని చంకలు గుద్దుకొంటూ ప్రజలు నోరు మూసుకొని ఉండాలని డిగ్గీ రాజా వారి ఉద్ధేశ్యమేమో?

13 comments:

Indian Minerva said...

సూపరో సూపరు. మనల్ని మనం ఆఖరికి పాకిస్తాన్‌తో పోల్చుచూసుకొని సంతృప్తి చెందాలన్నమాట.

Anonymous said...

నిజాలు చెత్తలా అనిపించడం సహజం.

ముసలి కన్నీరు కారుస్తూ, మేము అది చేసేస్తాం, ఇది చేసేస్తాం సొల్లు కబుర్లు చెపితే దేశభక్తి వున్నట్టు అన్నమాట.

Anonymous said...

కృష్ణ గారు ,ఎం చెప్పారండీ .చెత్త వెధవలని చెప్పు తీసుకుని కొట్టారు గా .

కొత్త పాళీ said...

brilliant

durgeswara said...

నిజంగా చెప్పుదెబ్బకొట్టారండి
కాకుంటే వాల్ల చర్మాలు మందం స్పర్ష ఆనదు

durgeswara said...

నిజంగా చెప్పుదెబ్బకొట్టారండి
కాకుంటే వాల్ల చర్మాలు మందం స్పర్ష ఆనదు

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

రెండవ ఎనోనిమస్ గారూ, ఏం చెప్పాలో తెలియకపోతే మూసుకుని ఉండాలి అన్నది నా ఉద్ధేశ్యం. అంతే కానీ పాకిస్తాన్‌లో పేలినన్ని మన దేశంలో పేలడం లేదు కదా, 99% పేలుళ్ళు ఆపుతాం, మిగిలిన 1% పేలుడులో మీరు చస్తే ఏం చేయలేం, ఈ హింసకి కారణం బీహారీలు ముంబయిలోకి రావడమే అని కామెడీ, కడుపు మండించే మాటలు దేనికి?

Unknown said...

very very well said..

శ్రీ said...

బాగుంది

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

Thank you Sri.

sree said...

మన పోలీసులందరూ ఈ చెత్త వెధవల సెక్యూరిటీ కి వాల్లు రెచ్చగొట్టే అల్లర్లను ఆపడానికి పని చేస్తుంటే ఇక ప్రజలను కాపాడే పని ఎపుడు చెయ్యగలరు? ఏ దాడిలోనో ఈ వెధవలందరూ కొట్టుకుపోతే ఎంతబాగున్నో

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

Sree గారూ, బాగా చెప్పారు. ఇదే ఐడియాతో నేనొక పోస్టు రాశాను. ఇవాళో రేపో నా బ్లాగ్‌లో పెడతాను. చూడండి.

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

Sree గారూ, బాగా చెప్పారు. ఇదే ఐడియాతో నేనొక పోస్టు రాశాను. ఇవాళో రేపో నా బ్లాగ్‌లో పెడతాను. చూడండి.