నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Wednesday, July 6, 2011

స్వలింగ సంపర్కం అసహజమే: గులాం నబీ అజాద్ అన్న దాంట్లో తప్పు లేదు


ఎయిడ్స్ వ్యాధికి సంబంధించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి గులాం నబీ ఆజాద్ హోమో సెక్సువల్స్ గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇది ఒక జబ్బు అనీ, అసహజమైన చర్య అనీను. దాంతో ఒక పెద్ద దుమారమే రేగింది. గే, లెస్బియన్ యాక్టివిస్టులు, బాలీవుడ్ తారలు( సెలినా జైట్లీతో సహా) ఆజాద్ మీద విరుచుకు పడ్డారు. జబ్బులను లిస్ట్ చేసే DSM లోంచి స్వలింగ సంపర్కాన్ని ఎన్నడో తీసేశారని, మన దేశంలో కూడా స్వలింగ సంపర్కం నేరంగా భావించే క్లాజుని చట్టంలోనుండి తొలగించారు, ఈ సంగతులు తెలియని ఈయన ఒక మంత్రా అని విరుచుకు పడ్డారు. రాజకీయనాయకులు తాము వివాదంలో పడ్డప్పుడు తప్పించుకోవడానికి వాడే తేలికైన పద్ధతి తన వ్యాఖ్యల్ని వక్రీకరించారని చెప్పుకోవడం. అదే పద్ధతిలో ఆజాద్ గారు తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకున్నారు. 


     
అయితే స్వలింగ సంపర్కం జబ్బు కాక పోవచ్చు కానీ, అసహజమైన చర్య అన్న ఆజాద్ వ్యాఖ్యలో తప్పు లేదని నా ఉద్ధేశ్యం. ప్రకృతి స్త్రీకి, పురుషుడికి మధ్య శృంగారం జరగాలని అందుకు తగ్గట్టుగా పునరుత్పత్తి అవయవాలని సౄష్టించింది. యోని మార్గంలోకి ప్రవేశపట్టేలా మగవాడి అంగాన్ని తయారు చేసింది. మల ద్వారం గుండా కూడా రతి జరపవచ్చు కదా అని వాదించవచ్చు కానీ, దానికి మల విసర్జన అని వేరే క్రియని అసైన్ చేసింది ప్రకృతి. సహజమో, అసహజమో ఇద్దరు ఇష్టపడి చెసుకుంటే మధ్యలో మీకేమిటి బాధ అంటే ఎవరూ ఏమీ చేయలేరు. డైనింగ్ రూమ్‌లో మల విసర్జన చెసి, టాయిలెట్‌లో భోజనం చెస్తాను నా ఇష్టం అంటే ఎవరూ ఏమీ చేయలేరు. వాడి ఇల్లు వాడి ఇష్టం. అలాగే ఇదీనూ.




ఆజాద్ స్టేట్‌మెంట్‌లో స్వలింగ సంపర్కం జబ్బు అన్నది సరి కాదేమో కానీ, ఇది అసహజమైన చర్య అన్న దానిలో తప్పేమీ లేదు. 

8 comments:

Anonymous said...

మరి మూత్ర విసర్జనం దేంతో చేస్తారు మాష్టారూ..? ఆపని చేయడానికి దాన్ని ప్రకృతి అసైన్ చేసిన తరువాత దాంతో ఆపని కాకుండా సెక్స్ చేయడమేమిటి? మీరే చెప్పండి. స్వలింగ సంపర్కం సహజమైనదే అని చాలా అధ్యయనాలు రుజువు చేశాయి, వాతిని చదివి ఒక అభిప్రాయానికి రండి అంతే కానీ, దీన్ని దానికి అసైన్ చేసింది .. కాబట్టి వాడకూడదు లాంటి సిల్లీ లాగిక్కులు చెప్పకండి.

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

Good point.

Anonymous said...

స్వలింగ సంపర్కం పూర్తి సహజమైన చర్య అని అనేకసార్లు నిరూపించబడింది. ఇలాంటి లక్షణాలు జంతువులలో కూడా ఉన్నట్టు పరిశోధకులు ఎప్పుడో తేల్చి చెప్పారు. కనుక దీని గురించి మీరు తీర్పు తీర్చవలసిన అవసరం లేదు. అప్పటికే స్వలింగ సంపర్కులు అనుభవించే క్షోభ వర్ణనాతీతం.

సరే, అయినా మీకు అసహజంగా తోచింది, రోగములా కనబడింది కదా వారిని అలా వదిలేయండి లేదా రోగిపై జాలి చూపండి. అది వదిలేసి మరుగుదొడ్డి-వంటగదిలాంటి చెత్త అభిప్రాయాలతో వారి మనసులు గాయపరిచే హక్కు మీకు లేదు.

మీరు చేసే శృంగారం వారి కళ్ళకి అసహజంగానే కనబడుతుంది మరి! మరిచారేమో!

Anonymous said...

అయ్యా అజ్ఞాత గారూ మూత్రవిసర్జనకు మరియు రతి జరపడానికి స్త్రీలకు ప్రకృతి వేరు వేరు మార్గాలు ఇచ్హింది.ఒకసారి పరిశీలించండి.

sree said...

{స్వలింగ సంపర్కం పూర్తి సహజమైన చర్య అని అనేకసార్లు నిరూపించబడింది. ఇలాంటి లక్షణాలు జంతువులలో కూడా ఉన్నట్టు పరిశోధకులు ఎప్పుడో తేల్చి చెప్పారు. కనుక దీని గురించి మీరు తీర్పు తీర్చవలసిన అవసరం లేదు}

మనిషిని జంతువులతో పోల్చుకుని అన్నిటికీ తెగబడితే ఎలా సామీ? జంతువులు వావి వరసలు చూసుకుని శృంగారం చేయవు. జంతువుల్లో ఆటవిక ప్రవృత్తి సహజం. వాటి మాంసాన్ని అవే తింటాయి కూడా. మనం కూడా ఆ లక్షణాలనే అలవర్చుకుని "సహజమే.. its all natural" అనుకుందామా?

Anonymous said...

@శ్రీ

/మనిషిని జంతువులతో పోల్చుకుని అన్నిటికీ తెగబడితే ఎలా సామీ?/

మనిషి జంతువే అని మీరు చిన్నప్పుడు పాఠాల్లో చదువుకోలేదా? లైంగికేచ్ఛ అనేది ప్రకృతి ప్రేరణ. ఒక వయసు వచ్చాక సొంత ఆక్కాచెల్లెళ్ళతోనే ఒక చోట నిద్ర్రించరాదంటుంది హిందూ ధర్మం. ఎందుకు? ప్రకృతికి వావివరుసలతో సంబంధం లేదు. వావివరుసలనేవి మనుషులు ఏర్పరచుకున్నవి. ప్రకృతి ఏర్పరచినవి కావు. ప్రకృతి ఏర్పరచిన వావివరుసలు రెండే, ఆడ మరియు మగ. కేవలం సంఖ్యాబలం ఉండటం చేత ఇది అసహజం అని రుద్దితే సరిపోదు. అయినా ఆ ఇద్దరు స్వలింగ సంపర్కులకి లేని సమస్య మీకెందుకో? మిమ్మల్ని బలవంతం చేస్తే సమస్య. బలవంతం ఆడదాన్ని చేసినా సమస్యే! కాబట్టి వ్యక్తుల వ్యక్తిగత జీవితాలపై ఆసక్తి కాస్త తగించి మన మీద మనం దృష్టి పెడితే అందరికీ మంచిది.

షరా: వావి వరుసలు రెండే కదా అని నీవు తల్లి, చెల్లితో రమిస్తావా అంటే అది అడిగేవారి, చదివేవారి సంస్కారానికే వదిలేస్తున్నాను.

Krishna Reddy said...

రెండవ ఎనోనిమస్ గారూ, మూత్రమే కాదు, వీర్యం కూడా అందులోనుండి వస్తుంది కాబట్టి పురుషాంగం రతికీ, మూత్ర విసర్జనకీ ప్రకృతిచేత నిర్దేశించబడినది. బ్లాగు రచయిత ఆ పాయింటుని గుర్తించకుండా మీరు రాసిన దానికి గుడ్ పాయింట్ అని వంత పలికారు.

మనిషి కూడా జంతువే కానీ పరిణామం చెందిన జంతువు. అంచేత జంతు లక్షణాలను వదిలిపెట్టి మనిఒషిగా ఎదిగాడు. మనిషి కూడా జంతువే అంచేత నేను జంతు లక్షణాలతోనే ఉంటాను అని ఎవరయినా అనుకుంటే అది వారిష్టం. సుప్రీమ్ కోర్టు స్వలింగ సంపర్కం నేరం కాదు అని చెప్పింది కాబట్టి ఎవరికీ ఇబ్బంది కలగకుండా ఇద్దరు పురుషులూ, లేదా స్త్రీలు శృంగారణ్ చేసుకుంటే అది వారి ఇష్టం.

Anonymous said...

@ రెడ్డి
/ఎవరికీ ఇబ్బంది కలగకుండా ఇద్దరు పురుషులూ, లేదా స్త్రీలు శృంగారం చేసుకుంటే అది వారి ఇష్టం/

నేను చెప్పిన విషయమూ అదే. కనుక ఈ విషయమ్మీద తీర్పు తీర్చవలసిన అవసరం ఎంతమాత్రం లేదు. స్త్రీ-పురుష సంబంధములోకి తొంగి చూడటం ఎంత తప్పో స్వలింగ సంపర్కుల సంబంధములోకి తొంగి చూడటమూ అంతే తప్పు.