నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Friday, July 29, 2011

రాఖీ ప్యాంటీలతో తిప్పలు పడుతున్న ప్రొడ్యూసర్లు


షూటింగ్‌లో అవీ ఇవీ కావాలని నిర్మాతలని హీరోయిన్లు ముప్పు తిప్పలు పెట్టడం కొత్తేమీ కాదు. అయితే టీవీ షో ప్రొడ్యూసర్లకి ఈ కష్టాలు అంతగా ఉండవు. కానీ రాఖీ సావంత్ తన కొత్త రియాలిటీ షో "అజబ్ దేశ్ కీ గజబ్ కహానియా" నిర్మాతలని తనకి లేటెస్ట్ వెరైటీ ప్యాంటీలు తెచ్చి పెట్టమని తిప్పలు పెడుతుందట. ఈ షోకి సంబంధించిన షూటింగ్ మొదలయినప్పటినుంచీ రాఖీ చేస్తున్న డిమాండ్‌లతో, అవి తీర్చడానికి తమకి అవుతున్న ఖర్చులతో నిర్మాతల కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. 
 


రాఖీ అడుగుతున్నవి కొత్తగా మార్కెట్లోకి వచ్చిన C-స్ట్రింగ్ రకానికి చెందిన ప్యాంటీలు.  వీటికి, తాళ్ళు, బెల్టులు ఏమీ ఉండవు. C షేప్‌లో ఒక వైరు దాని చుట్టు ఒక గుడ్డ పీలిక ఉంటాయి అంతే. 


 
విదేశాల్లో కొత్తగా మార్కెట్‌లోకి వచ్చి హాలీవుడ్‌లో బాగా పాపులర్ అయిన ఈ రకం ప్యాంటీలను ధరించిన మొదటి సెలబ్రిటీ తనే కావాలని అమ్మడి పట్టుదల. ఎరుపు, పింక్, పర్పుల్ మూడు రంగుల్లో C-స్ట్రింగ్స్ వెంటనే తెప్పించాలని, లేకుంటే తను షూటింగ్ చేయనని అల్టిమేటమ్ పాస్ చేసింది రాఖీ. ఇప్పటికే అమ్మడి దుస్తుల ఖర్చు 70 లక్షలు అయింది అని నిర్మాతలు గుండెలు బాదుకుంటూ ఉంటే ఈ తాజా హెచ్చరిక వాళ్ళ నెత్తిమీద పిడుగు అయింది. కారణమేమిటంటే ఈ ముద్దు గుమ్మ మనసు పడ్డ ఈ పీలికలు మన దేశ మర్కెట్‌లో లభ్యం కాకపోవడమే. ఇక ప్యాంటీల షాపింగ్ కోసం  విదేశీ యాత్ర చేయడానికి నిర్మాతలు సిద్ధంగా లేరు. 





"అవున్నిజమే. నేను C- స్ట్రింగ్స్ కావాల్ని అడిగాను. పొట్టిగా, పల్చగా ఉండే డ్రస్సులు వేసుకున్నప్పుడు వాటి లొపల నుండి ప్యాంటీ కనిపించకుండా ఉండాలంటే C-స్ట్రింగ్స్ కావాలి. నేను వేసుకొనే డ్రస్సులకి C- స్ట్రింగ్స్ చాలా అవసరం. మన దేశంలో టెలివిజన్ తెర మీద C- స్ట్రింగ్స్ వెసుకునే మొదటి సెలబ్రిటీ నేనే అవుతాను" అంటూంది రాఖీ. 


"మేమేమైనా బ్లూ ఫిల్మ్ తీస్తున్నామా? లోపల ఏమి వేసుకున్నా బయటకి కనిపిస్తుందా ఏం? " అని లోలోపల సణుక్కుంటూ C- స్ట్రింగ్స్ వేటలో పడ్డారు ప్రొడ్యూసర్లు.

2 comments:

Anonymous said...

ఒక మీటరు కాటన్ గుడ్డ కొని దాన్ని నాలుగు పీలికలుగా చీల్చితే అమ్మడు చెప్పే కొత్త రకం పేంటీలు రెడీ ... అదేనండీ గోచీ ... మన పల్లెటూళ్లలో పిల్లలు కాలువ స్నానాలకి వెళ్ళేటప్పుడు అవే వేసుకుంటారు . చిన్నప్పుడు నేను కూడా అవే వేసుకునేవేసుకుని పిల్ల కాలువలో ఈత కొట్టేవాన్ని

ANALYSIS//అనాలిసిస్ said...

ఒక మీటరు కాటన్ గుడ్డ కొని దాన్ని నాలుగు పీలికలుగా చీల్చితే అమ్మడు చెప్పే కొత్త రకం పేంటీలు రెడీ ... అదేనండీ గోచీ ... మన పల్లెటూళ్లలో పిల్లలు కాలువ స్నానాలకి వెళ్ళేటప్పుడు అవే వేసుకుంటారు . చిన్నప్పుడు నేను కూడా అవే వేసుకునేవేసుకుని పిల్ల కాలువలో ఈత కొట్టేవాన్ని