నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Sunday, January 31, 2010

తప్ప తాగి చస్తే చావండి-జనాన్ని చంపకండి.

న్న ముంబై లో ఒక యువతి,అప్పుదే టీనేజ్ దటి వుంటుందేమో,తప్ప తాగి ద్రైవ్ చేస్తూ ఇద్దరి చావుకి కారణమైంది.అందరూ చూసే వుంటారు.ఇలాంటి ఘటన ఇది మొదటిది కాదు.ఈ అమ్మాయి విషయానికొస్తే ఈమె తండ్రి డాక్టరు,ఈమె ఫషన్ డిజైనర్ అని కొన్ని చానల్స్ లొ వచ్చింది.తండ్రి ఇరవై నాలుగు గంటలు పని చేస్తూ డబ్బు మింట్ చేస్తూ వుంటాడు, బహుశా తల్లి కూడా అదే పనిలో వుండి వుండొచ్చు. వాళ్ళు అలా సంపాయించిన డబ్బు ముక్కిపోకుండా ఈమె దానిని ఇలా పబ్బుల్లో,క్లబ్బుల్లో ఖర్చు చేస్తూ వుంటుంది. డబ్బెక్కువై తాగి తందనాలాడితే ఎవరికీ అభ్యంతరం లేదు. పబ్ లొ డోసు ఎక్కువై ఒకరిని ఒకరు కాల్ఛుకు చచ్చినా, డ్రగ్స్ ఒవర్ డోసుతో చచ్చినా మనకేమీ ఇబ్బంది లేదు.టీవీ వారికి కొంత కాలం మంచి ఆహారం.మాట్లాడుకోవడానికి మంకి ఒక టాపిక్ అంతే. ఎటొచ్చీ ఆ కైపులో బయటికొచ్చి కారులో కన్నూ మీద తెలియకుండా జనాన్ని చంపితేనే ఇబ్బంది.అంత డబ్బు నీళ్ళలా ఖర్చు చేసే ఈ వెధవలు ఇలాంటి పార్టీలకి పోయేటప్పుడైనా వెంట ఒక డ్రైవర్ ని తీసుకెళ్ళినట్లైతే వీళ్ళూ క్షేమంగా ఇంటీ చేరుకోవచ్చు, రోడ్లపైన జనం క్షెమంగా వుండవచ్చు.అయినా ఇలా విచ్చల విడిగా డబ్బుని పిల్లలకి అందించే తల్లి తండ్రులు వారికి ముందుగా కొంచెం బధ్యతల గురించి చెప్పి చావొచ్చుగా! సంజీవ్ నందా కేసు కూడా ఇలంటిదే.తాత అడ్మిరల్, మన్వడి చేతిలో బి ఎం డబ్ల్యూ కారు, తల నిండా మత్తు, పెవ్మెంటు మీద జనం.తీరా చూస్తే ఆ జనం మిద కారు ఎక్కించేసి తాపీగా జైలుకి పోయి దర్జాగా బయటికి పోయిన మనవడు.కనీసం ఒక కేసులో నయినా శిక్ష పడితే మిగతా వరికి కొచెం భయం వుంటుంది.లేక పోతే ఇలాంటివి మళ్ళీ<మళ్ళీ జరుగుతూనే వుంటాయి.

Friday, January 29, 2010

ఈ బూతు కూతలు పాటలా?

సినిమ పాటలన్నింటిలో మంచి సాహిత్యాన్ని ఆశించడం తప్పే. అందరు దర్శకులు విశ్వనాధ్ లొ జంధ్యాలలో కారు.అందరు రచయితలు అత్రెయలు, సీతారామ శాశ్త్రి, వేటూరి కారు, కాలేరు.ఒప్పుకొందాం. కనీసం నువ్వు, నేనూ జింగ్ ఛక్... నీతో నాకు దుంబ్ ఛుక్ లాంటి పిచ్చి కూతల్ని పాటలుగ అంగీకరిద్దామనుకొన్నా ఇటీవల దానికి కూడా వీలు కావడం లేదు.ఆర్య-2 అని ఓ చిత్ర రాజంలో ఒక పాట విన్నాను.రింగ రింగ అని మీరూ వినే ఉంటారు.దానిలో అన్నీ బూతులే.కన్నె కొంప కుల్చేయడం, సిగ్గు గుత్తి తెంపేయడం ఇలా వుందా పాట. పాడిన వాడికి ఎలాగూ తెలుగు వచ్చి వుండదు అనుకొన్నా, రాసిన వెదవ తెలివి ఏమైంది? దర్శక నిర్మాతలకి అయిన కొంచెం సెన్సు ఏడవాలసిన పని లేదా?ఈ ముగ్గురు వెదవాయిలని ఒక రూం లో సకుటుంబ సమేతంగా తోసి, తలుపుకి గడియ పెట్టి, అదె పాట 24 గంటలు రిపీట్ మోడ్ లో ఫుల్లు సౌండ్ పెట్టి వినిపిస్తే కానీ బుద్ధి రాదు వెదవలకి.సూపర్ హిట్ మగధీర బంగారు కోడి పెట్ట సాంగ్ లో ఒక లైన్ వుంది."కాక మీద వున్న దాన్ని రయ్యో, దాక మీద కోపమెందుకు" అని.దాక అనే పదం బూతు పుస్తకాల్లో యోని కి పర్యాయ పదంగా వాడుతారు. ఈ రచయిత కూడా అదె ఉద్ధేస్యంతో వడినట్లు మనం భావించాలా?కొంచెం శ్రద్ధ పెడితే అద్భుతమైన అణిముత్యాల్లాంటి సాహిత్యం అందించే రచయితలు చాలా మంది ఉన్నారు మనకి. కళ్ళు తెరిచి వెతకండ్రా వెధవాయిల్లారా.

రోశయ్యా కొంచెం మగాడివనిపించుకో

తాతా రోశయ్యా, నాకు నీ మీద చాలా సానుభూతి వుంది.ఇంత కాలం శాస్వత నంబర్ టూ లా బ్రతికి ఇప్పుదు నం.1 అయితె కొంచెం ఇబ్బందే మరి.కానీ ఎంత కలం ఈ బానిస బ్రతుకు?ఎందు కోసం? ముఖ్య మంత్రిగా మూదో నాలుగో వేల కోట్లు వెనకేసుకొని ఏం సాదించాలని?ఆ డబ్బు అనుభవించె వయస్సు నీకు లేదాయే?సోనియ్యమ్మని ఛూసి భయం నీకెందుకు? నీ కొడుకులో, భందువులో రాజకియాల్లో లేరు వారికేమైనా అవుతుందేమోనని భయపడడనికి.ఎత్తు.తలెత్తి జీవింఛు.రేపో మాపో నువ్వు పోయాక నువ్వు వెనకేసిన కోట్లు ఛూసి నిన్ను ఛరిత్ర అంచనా వేయదు.నువ్వు సాదించిన దన్ని చూసే నీ స్తానం నిర్నయించబడుతుంది.ప్రతిదానికీ అధిష్టానం ఆర్డర్ కొసం చూడకుండా స్వంతంగా కొన్ని పనులు చేయి.సోనియాకి నచ్చకపొతె "గో టు హెల్" అను.అప్పుడు మన రాష్ట్రమే కాదు దేశమంతా నిన్ను నివ్వెర పొయి చూస్తుంది.మగాడంటే వీడేరా అని వేనోళ్ళా పొగుడుతుంది.నీకు నచ్చని వాళ్ళు మంత్రులైనా అధికారులైనా పీకి పారెయ్యి.స్వంతంగా నిర్ణయాలు తీసుకొ.ఆ తరువాత సోనియజికి తెలియచేయి.ఏమైనా అటూ ఇటూ అయితే ఈ పదవి నా కాలి గోటితో సమానం అని ధిక్కరించు.చరిత్ర నిన్ను గొప్పవాడిగా గుర్తు పెట్టుకొంటుంది.నువ్వు శాశ్వతంగా చరిత్రలో ఒక్క మగాడిగా నిలుస్తావు.డబ్బు ముఖ్యం కాదు.ఒక వేళ కోటానుకోట్లు వెనకేసుకొన్నా దానివలన నీకు అస్సలు ఉపయొగం లేదు.ఊరు పొమ్మంటూంది కాడు రమ్మంటోంది. ఈ వయస్సులొ కొంచెం శాశ్వత మయిన కీర్తి కోసం ప్రయత్నించు.ఆల్ ది బెస్ట్, తాతా.

మా IPL కూలీలు-మా ఇష్టం

ఈ మధ్య జరిగిన ఐ పీ ఎల్ -3 వేలంలో పాకిస్థాన్ ఆటగాళ్ళని ఎవరూ పాడుకోకపోవడంపై చాలా గొడవ జరిగిన విషయం అందరికీ గుర్తుండి వుంటుంది. ఐతె దీనిలో అంత తప్పేముందో నాకు అర్థం కాలేదు.ఐ పీ ఎల్ టీం అంటే అది ఒక వ్యక్తికో లేదా సంస్థకో స్వంతం.అందులో ఎవరు వుండలన్నది పూర్థిగ వారి అభిప్రాయం బట్టే వుంటుంది.ణా దగ్గర ఎలాంటి కూలీలు పని చేయాలో నేను నిర్ణయిస్తాను. ఎందుకంతే వాళ్ళకి జీతం నేను ఇస్తాను కాబత్తి. ఇదీ అంతే.కాబట్టి దీనిని ఇంతటితో వదిలి వేసి పాకీ క్రికెటర్లు ఇంకో అవకాశం కోసం ఎదురు చూస్తూ వుంటే మంచిది.

చిదంబరం గారికి ఒక ఐడియా

తెలంగాణా సమస్యని ఎలా కొంత కాలం నాంచాలా అని తల పట్టుకొంటున్న సొనియా మరియు చిదంబరం గర్లకు ఒక ఐడియ ఇక్కడ ఉంది. ఆఫ్ కోర్స్ ఇది ఆల్రెడీ వాళ్ళ మనశ్శుల్లో వుండి వుండొచ్చు సుమా! ఒక కమిటీ వేయ వచ్చు. అందులో ఎవరెవరు వుండాలా అన్నది తేల్ఛడానికి మరో కమిటీ, అది ఎప్పటిలోగా నివేదిక ఇవ్వాలో చెప్పడనికి ఇంకో కమిటీ,అస్లేం తేల్ఛాలో తెల్యచెప్పడానికి మరో కమిటీ, ఈ కమిటీలన్నింటినీ సమన్వయ పరఛడానికి ఇంకొక కమిటీ ఇల కమిటిల పై కమిటీలు వెసుకొంటూ పోతే మళ్ళి ఎన్నికలు వస్తయి.ఆప్పుడు గెలిస్తే అప్పటి సంగతి చూసుకోవచ్చు.

ఇదేమి తెలుగురా బాబూ?

నిన్న మార్కెట్లో ఒక పెద్ద్ ఫ్లెక్స్ బోర్డ్ ఛూశాను. అది కోల్గేట్ వారి ప్రకటన.దానిలో కాపీ ఏమిటంటే "పిల్లలలో ప్రతి 2లొ 1కి దంత క్షయం వస్తుంది"కాస్సేపు జుట్టు పీక్కొన్నాక నాకు అర్దమయ్యింది ఏమంటే పిల్లలో ప్రతి ఇద్దరిలో ఒకరికి దంత క్షయం వస్తుంది అని.నా కజిన్ ఒకడు చెన్నయిలో అడ్వర్తైజింగ్ కంపెనీలో వుంటే వాడినడిగాను ఎందుకు వాళ్ళ బాష ఇలావుంటుందని.వాడు చెప్పింది ఏమంటే యాడ్ కంపెనీలు కాపీ రైటర్స్ ని నియమించే సమయంలో అన్నీ చూస్తారు ఒక్క బాష తప్ప.అందుకే ఈ విదంగా బాష ఇలా ఖూనీ అయిపోతూందట.

Wednesday, January 27, 2010

ఛిరంజీవి జీరో-అరవింద్ హీరో

అందరూ తెలంగాణా లేక సమైఖ్యాంధ్రా అని తలలు కొట్టుకొంటున్న ఈ నాడు ఛిరంజీవి గురింఛి బ్లాగు ఎవడ్రా అని అశ్ఛ్యర్య పోకండి. ఈరోజు వార్తలలో ఛిరంజీవిని ఛూసి ఈ బ్లాగు రాస్తున్నాను.ప్రజారాజ్యం పార్టీ పెట్టడం వెనక ముఖ్య పాత్ర అరవిందే నని అందరికి తెకిసిన విషయమె.కానీ తమషా ఏమిటంటే పార్తీ పెట్టాక కలెక్షన్లు మాత్రమే ఛూసుకొంటూ అమలాపురం పార్లమెంటు సీటూ కి నామినేషన్ పడేసి గళ్ళా పెట్టె దగ్గరే కాలం వెల్లబుఛ్ఛి వఛ్ఛిన డబ్బంతా వెనకేసుకొని, తీరా ఎన్నికల్లాయ్యాక పార్టీ ఆఫీసు ఎక్కడ వుందో కూడా మర్ఛిపోయిన అరవిందే ఏ టోటల్ వ్యవహారంలో హీరో అని నా నమ్మకం.ఆవేశంతో రెఛ్ఛిపోయి నాయకులని పట్టుకొని పంఛెలు విప్పి కొట్టండి అని ప్రజలకు పిలుపునిఛ్ఛిన యువరాజ్యాధినేత పవన్ కళ్యాణ్ ,రాష్ట్రమంతా తిరిగి బ్యాక్ గ్రౌండ్ లో పార్టీ వ్యవస్ఠాపనకు కృషి ఛేసిన నాగబాబు, టీవీ కెమెరాల ముందు పిఛ్ఛి కుక్కలా కేకలేసిన పోసాని, ఛిరంజీవి ఏదో ఛేస్తాడని నమ్మిన వెర్రి వెంగళప్పలు కత్తి పద్మారావు, డాక్టర్ మిత్రా,ఎట్సెట్రా లందరూ జీరోలేనని నా అభిప్రాయం.వీళ్ళందరికన్నా పెద్ద జీరో అసలు హీరో అని అందరూ లెదా కొందరు భావిస్తున్న ఛిరంజీవి అనేది రాష్ట్రమెరిగిన సత్యం.పిఛ్ఛి వాడి లాగా ఎండలో తిరిగి తిరిగి గ్లామరంతా పోయి, అభిమానులంతా దూరమయ్యి అటు సినిమా ఫీల్డుకి కాక ఇటు రాజకీయాల్లొ సైడ్ యాక్టర్ లాగా ఇమడలేక రెంటికీ ఛెడ్డ రేవడి లాగా తయారయ్యి అటూ ఇటూ కాని దశలో వున్న మెగాస్టార్ తదుపరి ఎత్తు ఏమిటో?కాంగ్రెస్ లో విలీనమేనా?

Saturday, January 23, 2010

తెలంగాణా సమస్యకి న్యాయమైన పరిష్కారం

అస్సలు తెలంగాణా ఇవ్వడానికి సొనియా ఎవరు?తీసుకోవడానికి ఎవరు? ఇది సొనియా గాంధీకి ఆమె పుట్టింటి వారు ఇఛ్ఛిన ఆస్తి కాదు ఇవ్వడానికి.కేసీఅర్ కి అనువంశికంగా వఛ్ఛిన ఆస్తి కూడా కాదు.మనం ప్రజాస్వామ్యంలో వుంటున్నాం.అంటే ప్రజలు వారుకేం కావాలో వారే నిర్ణయింఛ్ఛుకోవఛ్ఛు.మరి తెలంగాణా విషయంలో మరోలా ఎందుకు ఉండాలి? తెలంగాణా ప్రజలు మిగతా రాష్ట్రంతో కలిసి ఉండాలో లేక ప్రత్యేకంగా ఉండాలో వారే తేల్ఛుకోవాలి. ఆ స్వతంత్ర్యం వారికుండాలి.అంతే కాని ఏ సొనియా గాంథీ పాదాల దగ్గర ప్రణమిల్లి ప్రత్యేక రాష్ట్రం తెఛ్ఛుకోవాల్సిన అగత్యం వారికి ఉండకూడడు.దీనికి పరిష్కారం ఛాలా సులువు. తెలంగాణా ప్రజలలో రెఫరెండం పెట్టండి.ఎక్కువ మంది ఏది కోరుకొంటే అది ఇవ్వాలి.అంతే.నేను తెలంగాణా వాడినీ, లేక తెలంగాణా వాదిని కాను.కోస్తా వాడిని, హైదరాబాద్ లో ఛదువుకొన్న వాడిని. తెలంగాణా వెనుకబటు ప్రత్యక్షంగా ఛూసిన వాడిని.బయట వాళ్ళు వఛ్ఛి ఇక్కడి భూమిని, వనరులనీ ఎలా అనుభవిస్తున్నరో ఛూశాను.తెలంగాణా ప్రజలపై నాకు సానుభూతి వుంది.కానీ ప్రత్యేక రాష్ట్రం వారి సమస్యలకు పరిష్కారం అని నాకు నమ్మకం లేదు.అయితే ఆ విషయం తేల్ఛుకోవలసింది తెలంగాణా ప్రజలే. ఆ అవకాశం వారికి ఇవ్వాలి అంతే కానీ ఏ సొనియాకో లేక కేసీఆర్ కో వారి భవిష్యత్తుని నిర్ణయింఛే అధికారం వుండకూడదు.

ఛర్ఛా వేదికలా ఛేపల మార్కెట్లా

పొద్దున్న లేస్తే ప్రతి ఛానల్లో ఏదో ఒక అంశమ్మీద పానల్ డిస్కషన్ పేరుతో కొందరు నాయకులని అప్పుడప్పుడు కొందరు అనలిస్టులని ఛేర్ఛి ఛర్ఛా కార్యక్రమం అనే తంతు పెడతారు.ఇవి అన్నీ కూడా ఆరోజు వార్తా పత్రికలలో వఛ్ఛిన వార్తల మీద నే ఉంటాయి.కాకపోతే ఈ తంతులో ప్రేక్షకులకి ఛిర్రెత్తే విషయం ఏమిటంటే ఈ నిపుణులలో ఎవెరు కానీ ఎప్పుడో తప్ప పక్క వాడు ఏమి ఛెపుతున్నాడో కొఛెం కూడా పట్టింఛుకోకుండా నా గోల నాదే అన్నట్టు వాగుటుంటారు. నా ఛిన్నప్పుడు స్కూలులో ఎక్కువ గొడవ ఛేస్తుంటే మాస్టారు వఛ్ఛి "ఏమిట్రా ఇది క్లాసా లేక ఛేపల మార్కెటా?" అని కేకలేసే వాడు. ఇప్పుడు ఈ ఛర్ఛా వేదికలు అంత కన్నా అన్యాయంగా తయారయ్యయి.వీరిలో కొందరు మరీ ఆగం గాళ్ళు ఉన్నారు.కాంగ్రెస్ నుంఛి అంబటి రాంబాబు ఇందులో మరీ ఛెప్పుకొదగ్గ వ్యక్తి. మైకు తన హక్కు అన్నట్టుగా ఫీలవుతుంటాడు ఈయన.పక్క వాళ్ళకు మాట్లాడే హక్కు లేనట్టూ అది కేవలం తన ఒక్కడికే వున్నట్టూ ఛూసే వాళ్ళకూ,యంకరుకూ ఛిర్రెత్తిస్తూ కేకలేస్తూ వుంటాడు.ఏ కోవలో ఛేర్ఛదగ్గ మరొ వ్యక్తి నన్నపనేని రాజకుమారి.ప్రజ రాజ్యం శోభారాణి కూడా తక్కువేమీ కాదు.కానీ ఏ మహిళా నాయకురాళ్ళ గురింఛి, వారి వీధి పోరాటాల గురింఛి మళ్ళీ మరో బ్లాగులో వివరంగా మరో సారి. తెలుగుదేశం నుంఛి వర్ల రామయ్య , కాంగ్రెస్సు ఆనం వివేకాంద రెడ్డి ఈ లిస్టులో ఛేర్ఛ దగ్గ మరో ఇద్దరు ప్రముఖులు.ఛెప్పుకొంతూ పోతే ఈ లిస్టు ఛేంతాడు అవుతుంది.కొంత కాలానికి, అప్పటి దాకా ఎందుకు, ఇప్పుడే పెద్ద వాళ్ళూ ఈ ప్రోగ్రాముని ఛూస్తే పిల్లలు ఛెడిపొతారని భయపడి ఛిన్నపిల్లల ముందు దీన్ని ఛూడకుండా టీవీలు కట్టేయడం మంఛిది.

sandy691972@rediffmail.com

Sunday, January 17, 2010

ఉపొద్ఘాతం

ఈ బ్లాగ్ రాయడం వెనుక ముఖ్య ఉద్దేశ్యం వార్తా పత్రికలు చదివినప్పుడు నాలో కలిగే భావాలు అందరితో పంచుకోవడం. కొన్ని వార్తలు చదివినప్పుడు పరుగెత్తుకెళ్ళి కొందరిని చొక్కా పట్టుకొని ఎడా పెడా దులిపేయాలని అనిపిస్తుంది. ఇంకొందరిని చెప్పు తీసి వాయింఛాలని అనిపిస్తుంది. ఇంకోసారి కొంతమందిని మల్ల్లె పూల మాలతో సత్కరింఛాలని కూడా అనిపిస్తుంది. కానీ ఏదయినా రిస్కుతో, ఖర్ఛుతో కూడుకొన్న విషయం. ఏ వార్త పత్రిక వాడు కూడా మొదటి రకం లేఖలు తన పత్రికలో ప్రఛురింఛే సాహసం ఛేయడు. ఎవరైనా నాక్కొంఛెం మెంటల్ టైపులో ప్రఛురింఛినా పక్క రోజు ఆ పత్రిక ఆఫేసు అద్దాలు కొండొకఛో స్టాఫు తలలు పగలడం ఖాయం.అందుకే నేను ఏ మార్గం ఎంఛుకొన్నాను. ప్రతి టపా ఛివర నా మెయిలు అడ్రసు ఉంటుంది. మీ అభిప్రాయాలు నాకు పంపవఛ్ఛు.