నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Friday, January 29, 2010

ఈ బూతు కూతలు పాటలా?

సినిమ పాటలన్నింటిలో మంచి సాహిత్యాన్ని ఆశించడం తప్పే. అందరు దర్శకులు విశ్వనాధ్ లొ జంధ్యాలలో కారు.అందరు రచయితలు అత్రెయలు, సీతారామ శాశ్త్రి, వేటూరి కారు, కాలేరు.ఒప్పుకొందాం. కనీసం నువ్వు, నేనూ జింగ్ ఛక్... నీతో నాకు దుంబ్ ఛుక్ లాంటి పిచ్చి కూతల్ని పాటలుగ అంగీకరిద్దామనుకొన్నా ఇటీవల దానికి కూడా వీలు కావడం లేదు.ఆర్య-2 అని ఓ చిత్ర రాజంలో ఒక పాట విన్నాను.రింగ రింగ అని మీరూ వినే ఉంటారు.దానిలో అన్నీ బూతులే.కన్నె కొంప కుల్చేయడం, సిగ్గు గుత్తి తెంపేయడం ఇలా వుందా పాట. పాడిన వాడికి ఎలాగూ తెలుగు వచ్చి వుండదు అనుకొన్నా, రాసిన వెదవ తెలివి ఏమైంది? దర్శక నిర్మాతలకి అయిన కొంచెం సెన్సు ఏడవాలసిన పని లేదా?ఈ ముగ్గురు వెదవాయిలని ఒక రూం లో సకుటుంబ సమేతంగా తోసి, తలుపుకి గడియ పెట్టి, అదె పాట 24 గంటలు రిపీట్ మోడ్ లో ఫుల్లు సౌండ్ పెట్టి వినిపిస్తే కానీ బుద్ధి రాదు వెదవలకి.సూపర్ హిట్ మగధీర బంగారు కోడి పెట్ట సాంగ్ లో ఒక లైన్ వుంది."కాక మీద వున్న దాన్ని రయ్యో, దాక మీద కోపమెందుకు" అని.దాక అనే పదం బూతు పుస్తకాల్లో యోని కి పర్యాయ పదంగా వాడుతారు. ఈ రచయిత కూడా అదె ఉద్ధేస్యంతో వడినట్లు మనం భావించాలా?కొంచెం శ్రద్ధ పెడితే అద్భుతమైన అణిముత్యాల్లాంటి సాహిత్యం అందించే రచయితలు చాలా మంది ఉన్నారు మనకి. కళ్ళు తెరిచి వెతకండ్రా వెధవాయిల్లారా.

8 comments:

మంచు said...

మీ ముందు టపాలు చదివినాళ్ళకి ...మీకు చిరంజీవి , అతని కుటుంబసభ్యుల సినిమాల్లొ మాత్రమే బూతులు కనిపిస్తాయని వెరేగా చెప్పకర్లెదు.. :-))) ఎప్పుడో ఇరవై సంవత్సరాల క్రితం వచ్చిన లారిడ్రైవర్ పాటలు వినండి కావల్సినన్ని బూతులు.. సర్లె అవి మీ స్వంత అభిప్రాయాలు.. మీ ఇస్టం

మగధీర పాటల రచయత ఈ మీనింగ్ తొ రాసాడొ , మీకు పరిచయం వున్న పుస్తకాల్లొ మీనింగ్ ఎమిటొ తెలీదు కానీ " దాక " అంతె గొదావరి జిల్లల్లొ కూర వండుకునే పాత్ర.. మాకు తెలిసి అదే మీనింగ్.. మీకు తెలిసిన మీనింగ్లు చెప్పి దాని అర్ధం మర్చేయకండి.. ప్లీజ్ ..

శరత్ కాలమ్ said...

నాలాంటి వాళ్ళం బూతునే అభిమానిస్తాము. ఏం తప్పా? మాలాంటి వారికోసమే అవి వ్రాసారు. మీకిష్టం లేకపోతే మూలకు కూర్చోండి. భక్తి సినిమాలు చూసుకోండి. మా మాస్ తో పెట్టుకోవద్దు!

తెలుగు వెబ్ మీడియా said...

సినిమాలు తీసేది ఎలాంటివాళ్ళనుకుంటున్నారు? భూస్వాములు, రియల్ ఎస్టేట్స్ వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు. వీళ్ళు లాభాల కోసం సినిమాలలో ఎలాంటి చెత్తైనా చూపిస్తారు. చిరంజీవి నటించిన మగమహారాజు సినిమాలోని వాక్యాలు ఇవి "మా అమ్మ చింతామణీ, నా పేరు సౌదామినీ, ఉన్నోళ్ళ మరదల్ని, లేనోళ్ళ చెల్లెల్ని" ఈ చెత్త పాటని అప్పట్లో మగవాళ్ళందరూ ఆరాధించారు.

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

I was quoting from recent films only.I am not a fan of Nandamuri family.I don't belong to, as you may have been thinking, the kamma community.Indde it has been years since I last saw a Balakrishna starrer in theater.

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

Sarath, I appreciate you.You have a good estimate of your IQ levels.

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

Manchu pallaki, I stand corrected.But, don't you think ringa ringa song is vulgar?

మంచు said...

Usually, I don't pay attention to lyrics.. :-))

I didn't watch that movie, but I heard the comments about that song.

Anonymous said...

మంచి పాటలు కావాలంటే చిరంజీవి రుద్రవీణ పాటలు వినండి, లేదా స్వాతి ముత్యం, శంకరాభరణం, సాగర సంగమం వినండి. ఇక ఈ బూతులంటారా ఎపుడూ ఉండేవే. అమెరికన్ చాన్నెల్స్ లో సగం సీరియల్స్ బూతువే కదా మరి!!