నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.
Search This Blog
Sunday, January 31, 2010
తప్ప తాగి చస్తే చావండి-జనాన్ని చంపకండి.
న్న ముంబై లో ఒక యువతి,అప్పుదే టీనేజ్ దటి వుంటుందేమో,తప్ప తాగి ద్రైవ్ చేస్తూ ఇద్దరి చావుకి కారణమైంది.అందరూ చూసే వుంటారు.ఇలాంటి ఘటన ఇది మొదటిది కాదు.ఈ అమ్మాయి విషయానికొస్తే ఈమె తండ్రి డాక్టరు,ఈమె ఫషన్ డిజైనర్ అని కొన్ని చానల్స్ లొ వచ్చింది.తండ్రి ఇరవై నాలుగు గంటలు పని చేస్తూ డబ్బు మింట్ చేస్తూ వుంటాడు, బహుశా తల్లి కూడా అదే పనిలో వుండి వుండొచ్చు. వాళ్ళు అలా సంపాయించిన డబ్బు ముక్కిపోకుండా ఈమె దానిని ఇలా పబ్బుల్లో,క్లబ్బుల్లో ఖర్చు చేస్తూ వుంటుంది. డబ్బెక్కువై తాగి తందనాలాడితే ఎవరికీ అభ్యంతరం లేదు. పబ్ లొ డోసు ఎక్కువై ఒకరిని ఒకరు కాల్ఛుకు చచ్చినా, డ్రగ్స్ ఒవర్ డోసుతో చచ్చినా మనకేమీ ఇబ్బంది లేదు.టీవీ వారికి కొంత కాలం మంచి ఆహారం.మాట్లాడుకోవడానికి మంకి ఒక టాపిక్ అంతే. ఎటొచ్చీ ఆ కైపులో బయటికొచ్చి కారులో కన్నూ మీద తెలియకుండా జనాన్ని చంపితేనే ఇబ్బంది.అంత డబ్బు నీళ్ళలా ఖర్చు చేసే ఈ వెధవలు ఇలాంటి పార్టీలకి పోయేటప్పుడైనా వెంట ఒక డ్రైవర్ ని తీసుకెళ్ళినట్లైతే వీళ్ళూ క్షేమంగా ఇంటీ చేరుకోవచ్చు, రోడ్లపైన జనం క్షెమంగా వుండవచ్చు.అయినా ఇలా విచ్చల విడిగా డబ్బుని పిల్లలకి అందించే తల్లి తండ్రులు వారికి ముందుగా కొంచెం బధ్యతల గురించి చెప్పి చావొచ్చుగా! సంజీవ్ నందా కేసు కూడా ఇలంటిదే.తాత అడ్మిరల్, మన్వడి చేతిలో బి ఎం డబ్ల్యూ కారు, తల నిండా మత్తు, పెవ్మెంటు మీద జనం.తీరా చూస్తే ఆ జనం మిద కారు ఎక్కించేసి తాపీగా జైలుకి పోయి దర్జాగా బయటికి పోయిన మనవడు.కనీసం ఒక కేసులో నయినా శిక్ష పడితే మిగతా వరికి కొచెం భయం వుంటుంది.లేక పోతే ఇలాంటివి మళ్ళీ<మళ్ళీ జరుగుతూనే వుంటాయి.
Subscribe to:
Post Comments (Atom)
2 comments:
true.. ilantiwarini aemi cheyyalandi
నిజమేనండి..
Post a Comment