మొన్న మాహా టీవీలో కల్కి మీద లైవ్ షో చోస్తూ వుంటే భయం వేసింది.ఎంత మంది పిచ్చి వాళ్ళు ఎన్ని కోట్లు విరాళాలు,ఎంత పెద్ద నిర్మాణాలు.ఒక మనిషి,అప్పటి వరకు ఎల్ ఐ సీ లో ఏజెంటు గా పని చేస్తూ ఉన్నట్టుండి నేను కల్కిని విష్ణు మూర్తి అవతారాన్ని అని చెప్తే నమ్మి అతన్ని ఆరాదించడం... ఇదంతా ఎక్కడికి దారి తీస్తుందోనని.
అంతకన్నా భయపెట్టిన అంశమేమిటంటే ఆ షో ఒక వైపు నడుస్తూండగానే ఆ చానాల్ ఆఫీసుపై కల్కి భక్తులమని చెప్పుకొనే కొందరు దాడి చేయడం.ఎంత పెద్ద నెట్వర్క్ లేకపోతే ఇలంటి దాడీ చేయడానికి వీలవుతుంది?అదే షో లో పాల్గొన్న ఓ కల్కి భక్తుడు పొరబాటుగానో, లేక అతని మనసులో నిజం అతని ప్రమేయం లేకుండా భయటికి వచ్చిందో గాని, ఒక విషయం చెప్పాడు. కల్కి ఆశ్రమంలో చేరాలంటే మొదటిగా లక్ష రూపాయలు చెల్లించడం ఎందుకు అనే ప్రశ్నకు అతను చెప్పిన సమధానం "మాది ఒక కంపెనీ" అని. వెరీ గుడ్, నిజం ఒప్పుకొన్నాడు.
అదే షోలో నారాయణ రెడ్డి అనే ఒక కల్కి భక్త శిఖామణి ఛాలా బాధ పడి పోయాడు ప్రపంచం కోసం అంత కష్ట పడి పొతున్న స్వామి గురించి అలా అభద్దాలు ప్రచారం చేస్తున్నందుకు. దైవ స్వ్రూపుడికి భక్తుల డబ్బు ఎందుకండీ, వరికి ఇతను డబ్బులు ప్రసాదించి వాళ్ళ కష్టాలు తీర్చాలి కానీ?
ఈ దేశంలో తిండికి కొరవేమో గాని దైవాలకీ, వాళ్ళ అవతారాలకీ కొదవ లేదు అని మరో సారి ౠజువైంది.
1 comment:
దున్నపోతు ఈనిందా? దూడని కట్టేయ్! ఎల్.ఐ.సి. ఏజెంట్ విష్ణుమూర్తి అవతారం అయ్యాడా? కొబ్బరికాయలు కొట్టేయ్!
Post a Comment